MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..

Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు, రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ కొణిదెల మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి వివాదాలతో కాదు తన జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణల గురించి ఆమె షేర్ చేసుకున్న ఓ ఎమోషనల్ వీడియోతో సంచలనంగా మారింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 10 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఫస్ట్ టైమ్ ఓపెన్ కామెంట్స్ చేసిన శ్రీజ..
Image Credit : Sreeja Konidela instagram

ఫస్ట్ టైమ్ ఓపెన్ కామెంట్స్ చేసిన శ్రీజ..

రామ్ చరణ్ సోదరి శ్రీజ కొణిదెల తన జీవితంలోని బాధలు, సంఘర్షణలు, మానసిక వేదన గురించి మొదటిసారిగా ఓపెన్ అయ్యింది. తాను ఒక 'బాధితురాలిని అనే ఫీలింగ్ నుంచి ఎలా బయటపడ్డారు? 15 నెలల ఒక ప్రాజెక్ట్ తన జీవితాన్ని ఎలా మార్చేసింది? అనే విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. ఇంతకీ శ్రీజ చెప్పిన విషయాలేంటి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీజ సంచలన పోస్ట్..
Image Credit : Sreeja Konidela instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీజ సంచలన పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు, రామ్ చరణ్ చెల్లెలు శ్రీజ కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో మళ్లీ సంచలనంగా మారాడు. ఫ్యామిలీ ఇష్యూస్ తో గతంలో చాలా సార్లు వార్తల్లో నిలిచిన శ్రీజ.. ఈ సారి మాత్రం వ్యక్తిగత ఎదుగుదల గురించి అద్భుతం స్పీచ్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసిన శ్రీజ, తన జీవితంలోని నొప్పి, సంఘర్షణ, మానసిక స్థితి గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు.

37
ఆలోచనల నుంచి బయటపడ్డ రామ్ చరణ్ సోదరి
Image Credit : Sreeja Konidela instagram

ఆలోచనల నుంచి బయటపడ్డ రామ్ చరణ్ సోదరి

చాలా కాలంగా తనను తాను ఒక 'బాధితురాలిని' అని భావించానని, కానీ 15 నెలల 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. శ్రీజ కొణిదెల తన వీడియోలో మాట్లాడుతూ.. "నా జీవితాంతం 'నాకే ఎందుకిలా జరుగుతోంది?' అనే ప్రశ్న నన్ను వెంటాడేది. కానీ ఇప్పుడు నేను ఆ మానసిక స్థితి నుంచి బయటపడ్డాను. జీవితం అంటే కేవలం మనకు జరిగే సంఘటనలు కాదు, దానిని మనమే తీర్చిదిద్దుకోవచ్చని ఇప్పుడు అర్థం చేసుకున్నాను" అని చెప్పారు.

47
శ్రీజ ఆలోచనలలో మార్పు ఎలావచ్చిందంటే?
Image Credit : Sreeja Konidela instagram

శ్రీజ ఆలోచనలలో మార్పు ఎలావచ్చిందంటే?

తన బాధ, సంఘర్షణలే చాలా కాలం పాటు తన గుర్తింపుగా ఉండేవని శ్రీజ అంగీకరించారు. "నా జీవితం మొత్తాన్ని నా బాధతో, గతంతో ముడిపెట్టుకుని బతికాను. కానీ నాకు జరిగిన చెడు సంఘటనలే నేను కాదు అని ఇప్పుడు తెలుసుకున్నాను" అని ఆమె అన్నారు. 'Sacred Paths' అనే సంస్థ నిర్వహించిన 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్'లో పాల్గొనడం తన ఆలోచనలను మార్చిందని శ్రీజ తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత, ఆమె తనను తాను కొత్త కోణంలో చూడటం ప్రారంభించారు.

57
శ్రీజ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సంఘర్షణలు
Image Credit : Sreeja Konidela instagram

శ్రీజ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సంఘర్షణలు

శ్రీజ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఫేస్ చేసింది. 2007లో, తన 19వ ఏట, కుటుంబ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని.. తను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు, మెగాస్టార్ చిరంజీవి కూతురు ఇల్లు వదిలి పారిపోయి పెళ్లి చేసుకుని, మీడియా, పోలీసుల రక్షణ కోరడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.

 2008లో, 20 ఏళ్ల వయసులో శ్రీజ.. నివృతి భరద్వాజ్ అనే కూతురికి జన్మనిచ్చారు. 2011లో భర్త శిరీష్ వరకట్న వేధింపులకు గురిచేస్తున్నాడని, హింసిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె పుట్టింటికి తిరిగి వచ్చారు. 2014లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

67
నాలుగేళ్లకే ముగిసిన రెండో పెళ్లి
Image Credit : our own

నాలుగేళ్లకే ముగిసిన రెండో పెళ్లి

2016లో, శ్రీజ తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన కళ్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరికి నవిష్క అనే కూతురు పుట్టింది. 2022లో, ఈ జంట కొన్ని తెలియని కారణాల వల్ల విడిపోయారు. 2023లో తాము విడిపోయినట్లు కళ్యాణ్ దేవ్ స్వయంగా ధృవీకరించారు. 2024లో శ్రీజ మొదటి భర్త శిరీష్ మరణించారు.

77
చిరంజీవి కుటుంబం గురించి..
Image Credit : others

చిరంజీవి కుటుంబం గురించి..

శ్రీజతో పాటు చిరంజీవికి సుస్మిత కొణిదెల అనే మరో కూతురు కూడా ఉన్నారు. సుస్మిత 2006లో వ్యాపారవేత్త ఎల్.వి. విష్ణు ప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు సమారా, శమిత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక చిరంజీవి కొడుకు, సూపర్‌స్టార్ రామ్ చరణ్.. ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు క్లిన్ కారా, అన్విరాదేవి, శివరామ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved