MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • చిరంజీవిగారు ఆ మాట అనగానే నేను షాక్ అయ్యాను: సావిత్రి కుమార్తె !

చిరంజీవిగారు ఆ మాట అనగానే నేను షాక్ అయ్యాను: సావిత్రి కుమార్తె !

అప్పుడు  చిరంజీవి కాలికి గాయం అయ్యి ఉందట. అయినాసరి ఆమె వచ్చిందని తెలుసుకున్న చిరంజీవి.. పైన రూమ్ లో నుంచి కర్ర సహాయంతో క్రిందకి వచ్చారట.  

4 Min read
Author : Surya Prakash
Published : Apr 03 2024, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
chiranjeevi

chiranjeevi


దివంగత నటి సావిత్రిపై సంజయ్‌ కిశోర్‌ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ బుక్‌ లాంచ్‌ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. మహానటి సావిత్రిపై ఆమె కూతురు విజయ చాముండేశ్వరి 'సావిత్రి క్లాసిక్స్' పేరుతో ఒక బుక్ వేయించారు. సంజయ్ కిశోర్ రూపొందించిన ఈ పుస్తకాన్ని, ముఖ్య అతిథులుగా  చిరంజీవి దంపతులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మురళీమోహన్ .. బ్రహ్మానందం .. తనికెళ్ల భరణి తదితరులు హాజరయ్యారు. ఈ వేదికపై విజయ చాముండేశ్వరిని సురేఖ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
chiranjeevi

chiranjeevi


ఈ క్రమంలో చిరంజీవిగారి చేతుల మీదుగానే ఈ పుస్తకాన్ని ఎందుకు ఆవిష్కరించాలనున్నారు? అంటూ సురేఖ అడిగిన ప్రశ్నకి  విజయ చాముండేశ్వరి స్పందిస్తూ .. " అమ్మ ఎందుకు మహానటి అయింది .. ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు .. పాత్రలను గురించి ఒక బుక్ వేయాలనుకున్నాను. సినిమాల ఫోటోలు .. ఆ సినిమా గురించిన సమాచారం బుక్ లో ఉంటే బాగుంటుందని అలాగే డిజైన్ చేయించాము. ఈ బుక్ ను చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని అనుకున్నాము" అని అన్నారు. 

311
chiranjeevi

chiranjeevi


"ఒకసారి నేను చిరంజీవిగారి ఇంటికి వెళ్లినప్పుడు .. కాలు నొప్పిగా ఉన్నప్పటికీ ఆయన మేడ దిగి వచ్చారు. తాను ఉదయాన్నే నిద్ర లేవగానే సావిత్రిగారి ఫొటోను చూస్తానని చిరంజీవిగారు చెప్పారు. నేను నమ్ముతానో లేదోనని చెప్పి బెడ్ రూమ్ కి వెళ్లి అమ్మ ఫొటో తీసుకొచ్చి చూపించారు. అమ్మపై అంత అభిమానమున్న చిరంజీవిగారితోనే ఈ బుక్ ను ఆవిష్కరించడం జరిగింది" అని ఆమె చెప్పారు.  

411
chiranjeevi

chiranjeevi

సురేఖ: అమ్మ పేరు మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.సినిమా వచ్చింది కదా. మరి ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటి? అని అడగగా..

 చాముండేశ్వరి: ముందు తరాల వారికి అమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ తరానికి ఆమె గురించి తెలిసేట్టుగా ‘మహానటి’ సినిమా వచ్చింది. తర్వాత తరం పిల్లలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా కేవలం ఆమె సినిమా జీవితం గురించి మాత్రమే ఈ పుస్తకంలో రాశాం. కొన్ని సినిమాలోని స్టిల్స్ ని అచ్చు వేయించాం.
 

511
chiranjeevi

chiranjeevi


సురేఖ: మీకు పాములంటే ఇష్టమని ఇంటికి పాముల్ని తెప్పించేవారట! 

చాముండేశ్వరి: అవును. చిన్నప్పటినుంచి పాములంటే నాకు చాలా ఇష్టం. అమ్మ నా ఇష్టాన్ని గమనించి వారాంతాల్లో పాముల వాళ్ళని ఇంటికి పిలిపించి ఆడించేది. కొద్ది రోజుల తర్వాత పులి పిల్లల మీద కూడా ఇష్టం ఏర్పడింది. తమిళనాడు నుంచి రెండు పులి పిల్లల్ని కూడా తెప్పించింది. మాతో ఎక్కువ సమయం గడిపేందుకు అమ్మకి అవకాశం లేక పోయిన మా ఇష్టాల్ని ఎప్పుడూ కాదనలేదు.
 

611
chiranjeevi

chiranjeevi


సురేఖ: మీ ఇంట్లో అంతమంది నటులు ఉండగా మీరు ఎందుకు నటి కాలేదు?

 చాముండేశ్వరి: చిన్నతనంలో నేను అమ్మానాన్నని చాలా మిస్ అయ్యాను. నా పిల్లలు అలా అవ్వకూడదని కుటుంబంతో సమయం గడపాలన్న ఉద్దేశంతో సినిమా ఫీల్డ్ కి దూరంగా ఉన్నా.

711
chiranjeevi

chiranjeevi


సురేఖ: మహానటి సినిమాలో అమ్మ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చూపించారా? ఇంకా ఏమైనా చెప్పుంటే బాగుండు అనిపించిందా?

 చాముండేశ్వరి: ‘మహానటి’లో చూపించినవన్నీ నిజాలే. ఆ సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు నన్ను సంప్రదించారా లేదా అని చిరంజీవి ‘మహానటి’ టీం ని అడిగారట. అది ఆయన మా కుటుంబానికి ఇచ్చే విలువ. ఆ సినిమా చూసి ఆయన కూడా చాలా సంతోషించారు.

811
chiranjeevi

chiranjeevi


 చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘పునాదిరాళ్లు’లోనే సావిత్రిగారితో నటిస్తున్నానని తెలియగానే ఒళ్లు జలదరించింది. రాజమండ్రిలోని పంచవటి హోటల్‌లో ఉన్న సావిత్రిగారిని పరిచయం చేసేందుకు నన్ను తీసుకెళ్లారు. ఆమెను చూడగానే నోట మాట రాలేదు. ‘నీ పేరేంటి బాబు’ అని అడిగారామె. చిరంజీవి అన్నాను. ‘శుభం బాగుంది’ అన్నారు.మరుసటి రోజ వర్షం వల్ల ‘పునాదిరాళ్లు’ షూటింగ్‌ క్యాన్సిల్‌ అయింది. నేను సరదాగా డ్యాన్స్‌ చేస్తూ జారిపడ్డాను. 

911
chiranjeevi

chiranjeevi


అయినా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్‌ చేయడంతో అందరూ క్లాప్స్‌ కొట్టారు. అప్పుడు సావిత్రిగారు ‘భవిష్యత్‌లో మంచి నటుడు అవుతావు’ అని చెప్పిన మాట నాకు వెయ్యి ఏనుగుల బలం అనిపించింది. ‘ప్రేమ తరంగాలు’లో సావిత్రిగారి కొడుకుగా నటించాను. ఆ తర్వాత ఆమెతో నటించే, ఆమెను చూసే చాన్స్‌ రాలేదు. కేవలం కళ్లతోనే నటించగల, హావభావాలు పలికించగల అలాంటి గొప్ప నటి ప్రపంచంలో మరెవరూ లేరు’’ అన్నారు. 

1011
chiranjeevi

chiranjeevi

  అలాగే  చిరంజీవి మాట్లాడుతూ..‘ మా నాన్నకి సావిత్రి అంటే ఎంతో అభిమానం. ఆయనతో కలిసి ఆ మహానటి సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అలా తెలియకుండానే చిన్నప్పటినుంచి ఆమె మీద అభిమానం ఏర్పడింది. నా మొదటి సినిమా ‘పునాది రాళ్లు’ షూటింగ్ సమయంలో తొలిసారి ఆమెని నేరుగా కలిసే అవకాశం వచ్చింది. షూటింగ్ విరామ సమయంలో డాన్స్ చేయమని అడిగేవారు. నా డాన్స్ చూసి ఆమె చప్పట్లు కొడుతూ ఉంటే గర్వంగా అనిపించేది. ఆమెతో రెండు సినిమాలు చేశాను. నటన పరంగా ఎన్నో విషయాలు ఆమె నుంచి నేర్చుకున్నాను. సావిత్రి ఆశీస్సులే నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచాయని నమ్ముతున్నాను. అందుకే రోజు నిద్ర లేవగానే ఆమె ఫోటోనే చూస్తాను. అలాంటి నటి మీద రాసిన పుస్తకం నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

1111
chiranjeevi

chiranjeevi


సీనియర్ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ… ‘ సావిత్రి గురించి తర్వాత తరాలకు తెలిసేలా పుస్తకాన్ని రచించిన సంజయ్ కిషోర్ కి, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఇంత మంచి కార్యక్రమం జరగడానికి కారణమైన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు. నేను నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలో నా నటన బాగుందని ఎవరైనా ప్రశంసిస్తే సంతోషించే వాడిని. నటన మెరుగుపరచుకోవడానికి నేను సావిత్రి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అందులో భాగంగా డాక్టర్ చక్రవర్తి సినిమాలోని ‘నువ్వు లేక వీణ’ పాటని ఎన్నోసార్లు చూశాను. అందులో ఆమె పలికించే హవ భావాలకి నేను పెద్ద అభిమానిని. ఆ ఒక్క పాట చాలు ఆమె నట శిఖరం అని చెప్పడానికి. ఎస్వీ రంగారావు-సావిత్రి కలిసి నటించిన సినిమాలు నటనాపరంగా చాలా నేర్చుకున్నాను. ఆ సినిమాల్లో వాళ్ళిద్దరూ పోటీపడి నటించేవారు. అంతటి నటి గురించి తర్వాత తరాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Movie: వారణాసి నుంచి మరో లీక్.. గుడి వద్ద డైనోసార్లు, ఇదేం ప్లానింగ్ బాబోయ్
Recommended image2
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved