త్రిష వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు....? దళపతికి కష్టాలు తప్పవా..?
తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ కెరీర్ కు హీరోయిన్ త్రిష ఇబ్బందిగా మారబోతోందా...? రీసెంట్ గా మరోసారి వీరిద్దరి విషయాలు బయటకు రావడానికి కారణం ఏంటి..? ప్రస్తుతం తమిళనాటు జరుగుతన్న చర్చ ఏంటి..?
తమిళ స్టార్ హీరోగా వెలుగు వెలిగాడు విజయ్ దళపతి. తమిళ సినిమా టాప్ స్టార్ గామాత్రమే కాకుండా.. పాన్ ఇండియా రేంజ్ లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. విజయ్ సినిమా రిలీజ్ అయ్యిందంటే ప్యాన్స్ కు పండగే. అలాగే విజయ్ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టిగ్ కలెక్షన్స్ ను సాధించాయి. అందుకే అరవదేశంలో విజయ్ ని బాక్సాఫీస్ కింగ్ అని కూడా పిలుస్తారు.
30 కోట్ల నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ కు పడిపోయిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
విజయ్ ఇటీవలే తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించాడు. సినిమాలకు త్వరలో స్వస్తి చెప్పబోతున్నాడు. విజయ్ తమిళనాడులో వెట్రి కజగం అనే పార్టీని ప్రారంభించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అని ప్రకటించాడు విజయ్. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ అతనికి చివరి సినిమా అంటున్నారు. ఈ సినిమా పూర్తి చేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఆయన యాక్టీవ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
విజయ్ టాప్ స్టార్‌గా ఉంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నాడు. సినిమాల పరంగా ఎంతో కెరీర్ ఉండగానే.. ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉన్న విజయ్.. పొలిటికల్ గా సత్తా చాటడానికి రెడీ అయ్యాడు. అయితే విజయ్ పొలిటికల్ కెరీర్ చిక్కుల్లో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అది కూడా ఓ హీరోయిన్ వల్ల.. ఆ హీరోయిన్ ఎవరు కాదు.. త్రిష. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
నటుడు విజయ్‌కు భార్య సంగీత, కుమారుడు జేసన్ సంజయ్ మరియు కుమార్తె దివ్య ఉన్నారు. జాసన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు.అయితే ఈలోపు విజయ్- త్రిషల మధ్య కెమిస్ట్రీగురించి కోలీవుడ్ లో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇదే హాట్ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. విజయ్ - త్రిష ప్రేమ వ్యవహారం మరోసారి ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇది విజయ్ రాజకీయ జీవితాన్ని కూడా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది.
ఎప్పుడో గిల్లి సినిమా టైమ్ లో స్ప్రెడ్ అయిన గాసిప్ కాస్తా ఇప్పుడు మళ్ళీ పుట్టుకొచ్చింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. రీసెంట్ గా విజయ్ బర్త్ డేకు హీరోయిన్ త్రిష కాస్త డిఫరెంట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే దానికి కారణం అయ్యింది.త్రిష తనతో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 'నీ థాన్ ఎన్ కాదల్.. టిల్ డెత్ నీ థన్ ఎన్ కాదల్' అంటూ.. ఓ లవ్ సాంగ్ ను ఆమె పోస్ట్ చేసింది.
దీంతో.. ఆడియన్స్.. నెటిజన్లు ఊరుకుంటారా.. వెంటనే వీరిద్దిరి మధ్య గతంలో గట్టిగా వైరల్ అయిన ప్రేమ వ్యవహారాల వార్తలను మళ్ళీ బయటకు తీశారు. ఫోటోలు కూడా బయటపెట్టారు. అందులో విజయ్ ఒంటరిగా నడుస్తున్న ఫోటో మరియు అతని పక్కన త్రిష తన కాలుతో ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. పక్కనే కూర్చున్న త్రిష కాళ్ళకు విజయ్ బూట్లు ఉన్నాయి. విజయ్, త్రిష తరచూ విదేశాలకు వెళ్లారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అదేవిధంగా త్రిష ప్రయాణించే లొకేషన్లలో విజయ్ కూడా ఉన్నట్లు కొన్ని ఫోటోల ద్వారా వెల్లడైంది. దీంతో చాలా మంది విజయ్‌ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ అంశం విజయ్ రాజకీయాలకు ఇబ్బంది కలిగిస్తుందా అనే ప్రశ్న తలెత్తింది. విజయ్-త్రిష ఇష్యూ ఇద్దరికీ పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ పబ్లిక్ లైఫ్ లో ఓ ప్రశ్నగా లేవనెత్తవచ్చు. రకరకాల విమర్శలకు దారి తీయ్యవచ్చు. నిజానిజాలుఏమైనా.. విమర్శలకు మాత్రం అవి అవసరంలేదు అన్నట్టు ఉందిప్రస్తుత సమాజం.
కాబట్టి ఈ అంశం విజయ్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు హీరోగా ఉన్నాడు కాబట్టి.. ఇలాంటి గాసిప్స్ కమన్ గా తీసుకున్నారు ఆడియన్స్. అయితే ఇదే విషయం రాజకీయాల్లో ప్రత్యర్ధులకు ఆయుధంగా మారితే విజయ్ ఇబ్బందులుపడాల్సి వస్తుంది అంటున్నారు. అందుకే ఇది ఇలా మారకముందే.. ఆయన వివరణ ఇస్తే బాగుంటుంది అంటున్నారు కొదరు.