విజయ్ కాంత్ కు అవమానం, బాలీవుడ్ వాళ్లను కొట్టడానికి వెళ్లిన కుష్బూ, ఏం జరిగింది..?
బాలీవుడ్ కు సౌత్ యాక్టర్స్ అంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది.. ఇప్పుడు వాళ్ల పొగరు దిగిపోయింది అది వేరే విషయం. అయితే ఈ మధ్యల చాలామంది నటీనటులకు హిందీ వాళ్ల వల్ల అవమానాలు ఎదురయ్యాయి. ఈక్రమంలో తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ ను కూడా వారు అవమానించారట.

సౌత్ సినిమా మొత్తాన్ని అవర సినిమాల జాబితాలో కలిపే వారు బాలీవుడ్ జనాలు. దక్షణాది నటీనటులకు చాలా తక్కువ చేసి చూసేవారు. వారికి విలువ ఇవ్వకపోగా.. అవమానాలు కూడా ఎదురయ్యేవి. అలా చేయబట్టే.. ఇప్పుడు బాలీవుడ్ ఓమూలకు వెళ్లిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఇండియన్ సినిమాను టాలీవుడ్ ఏలుతోంది. ఈక్రమంలో తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ కు బాలీవుడ్ వల్ల జరిగిన అవమానాన్ని.. నటి కుష్ఫు తాజాగా వెల్లడించారు. అసలేం జరిగింది.
40 లక్షలు సాయం.. నటుడు పొన్నంబలంకు ప్రాణం పోసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?
vijayakanth
తమిళ సినిమాతో పాటు డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగులో కూడా స్టార్ గా వెలుగు వెలిగాడు విజయకాంత్. తన నటనతో పెద్ద సంఖ్యలో అభిమానులను ఆకర్షించి రజనీ, కమల్‌ల తర్వాత పెద్ద హీరోగా నిలిచాడు. సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద స్టార్లతో పాటు.. చిన్న చిన్న టెక్నీషియన్స్ తో కూడా కలిసిపోయే విజయ్ కాంత్.. ఎంతోమంది టెక్నికల్ ఆర్టిస్టులకు అండగా నిలిచారు.
రాజమౌళిపై నోరు పారేసుకున్న దర్శన్, కన్నడ హీరో నోటి దురుసు అంతా ఇంత కాదు..
RIP Captain Vijayakanth
విజయకాంత్ తన కెరీర్ లో విజయ్, సూర్య వంటి చాలా మంది నటులకు చేయుతనందించారు. ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. నిర్మాతలకు నష్టం రాకుండా.. సహాయం చేశారు. నష్టాల్లో ఉన్న నిర్మాతలకు పైసా తీసుకోకుండా సినిమాలు చేసిన మంచి మనిషి విజయ్ కాంత్.
షూటింగ్ చూడ్డానికి వెళ్తే.. పెళ్లి చేసుకుంటావా అన్నాడు.. స్టార్ డైరెక్టర్ క్యూట్ లవ్ స్టోరీ..
Captain Vijayakanth
సినీమాతో పాటు.. పాలిటిక్స్ లో కూడా తనదైన ముద్ర వేశారు విజయకాంత్. మఖ్యమంత్రి స్థాయి చూడకపోయినా.. ప్రతిపక్షహోదాలో పనిచేశారు. అయితే ఆయన ఎంత మంచి చేశారో.. అంతగా ద్రోహాలను కూడా ఎదుర్కొన్నారు. నమ్మినవాళ్లు చాలామంది ఆయన్ను ముంచారు.. ద్రోహం చేశారు. అయినా ధైర్యంగా నిలబడ్డారు. నటన, రాజకీయాలు రెండు బ్యాలన్స్ చేస్తూ.. వెళ్లిన విజయ్ కాంత్.. అనారోగ్యంతో చాలా ఏళ్ళు ఇబ్బందిపడ్డారు. చివరకు ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు.
కమల్ హాసన్ తో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో, వేల కోట్లకు వారసుడు..?
అయితే విజయ్ కాంత్ మరణం తమిళనాట ఆయన అభిమానులు తట్టుకోలేకపోయారు. విజయ్ కాంత్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో.. ఆయన మరణం రోజే తెలిసింది. లక్షల మంది ఆయన్ను చూడటానికి వచ్చి కన్నీరు మున్నీరు అయ్యారు. ఈక్రమంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. స్టార్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక రీసెంట్ గా విజయ్ కాంత్ గురించి మాట్లాడారు అప్పటి స్టార్ హీరోయిన్ కుష్బు.
విజయ్ కాంత్ కోసం తాను చేసిన ఫైట్ గురించి కూడా ఆమెచెప్పుకొచ్చారు. తాజాగా ఓఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఏమన్నారంటే..? అప్పట్లో నటీనటుల సంఘం అధ్యక్షుడిగా విజయ్ కాంత్ ఉన్నారు. ఆటైమ్ లో కూడా ఆయన ఎలాంటి ఈగో లేకుండా పని చేసేవారు. తమిళ చిత్రసీమలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకూ ఏ సమస్య వచ్చినా.. ముందుండే వారు. అప్పట్లో పెప్సీ సమస్య నడుస్తున్నప్పుడు ముంబై నుంచి చాలా మంది టెక్నీషియన్లు ఇక్కడికి వచ్చారు.
vijayakanth
చెన్నైలోని కోడంబాక్కంలోని ఓ హోటల్‌లో బస చేశారు. వారితో చర్చలు జరిపేందుకు నేను, విజయకాంత అక్కడికి వెళ్లాం. కానీ విజయకాంత్ సర్ కు వారు అక్కడ కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా వేయలేదు. అక్కడివారు దర్జాగా పెట్టెలమీద కూర్చున్నారు. విజయ్ కాంత్ ను నిల్చోబెట్టి మాట్లాడారు. పైగా అవమానకరంగా హీరో హీరో అంటూ ఎగతాళి చేశారు. ఇది చూసి నాకు బాగా కోపం వచ్చింది.
వెంటనే వారితో గొడవకు దిగాను.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాను. కాని నన్ను పట్టుకుని విజయకాంత్ సార్ ఆపారు. పోట్లాడుకోకుండా కలిసి పనిచేద్దామని భరోసా ఇచ్చారు. నేను చెప్పాను సార్.. మీ గురించి తప్పుగా మాట్లాడారు, మిమ్మల్ని కొడతాను అన్నారు. అయితే ఎందుకు ఇలా ప్రశాంతంగా ఉన్నారు. అని అడిగాను. అప్పుడు ఆయన మన వెనక 200 కుటుంబాలు ఉన్నాయి. సమస్య వస్తే సాఫీగా పరిష్కరించుకోవాలి. వాళ్లకు కూడా ఫ్యామిలీస్ ఉంటారు కదా.. అని అన్నారు.
ఇలా ఎలాంటి సమస్య వచ్చినా.. ఆయన చాలా ప్రశాంతంగా పరిష్కరించేవాడు. అగ్రస్సీవ్ గా ఉండాల్సిన చోట అలానే ఉండేవారు. అలా ఉండటం ఎవరికీ సాధ్య కాదు.. అంతే కాదు విజయకాంత్ సహాయం అందుకోని టెక్నీషియన్ అంటూ ఎవరు లేదు అని అన్నారు. కుష్బు. కుష్బు ప్రస్తుతం నటిగా కొనసాగుతూ.. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కు జడ్జిగా వ్యవహరించారు మాజీ హీరోయిన్.