MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ హీరో గొప్ప డాన్సర్ అని ఒప్పుకున్న ఎన్టీఆర్, అవసరం కోసం అలా తగ్గాడా?

ఆ హీరో గొప్ప డాన్సర్ అని ఒప్పుకున్న ఎన్టీఆర్, అవసరం కోసం అలా తగ్గాడా?

ఇండియాలోని టాప్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకరు. అలాంటి ఎన్టీఆర్ కి ఓ హీరో డాన్స్ అంటే చాలా ఇష్టం అట. ఆ హీరో డాన్స్ లో అంత ప్రత్యేకత ఏముంది? 

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 20 2024, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఎన్టీఆర్ కంప్లీట్ యాక్టర్ అని చెప్పొచ్చు. నటనలో, డైలాగ్ డెలివరీలో పేరు పెట్టడానికి లేదు. ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా మార్చిన మరో అంశం ఆయన డాన్సులు. చిరంజీవి తర్వాత ప్రొఫెషనల్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్. ఆయన డాన్స్ లో గ్రేస్ కట్టిపడేస్తుంది. అనంతరం ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ పోటీ ఇచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
NTR

NTR

దేశంలోని బెస్ట్ డాన్సర్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి స్టెప్ అయినా.. ప్రాక్టీస్ చేయకుండా వెంటనే చేయగల హీరో ఎన్టీఆర్. ఈ విషయాన్ని పలువురు కొరియోగ్రాఫర్స్ వెల్లడించారు. ఎన్టీఆర్ ఎలాంటి డాన్స్ రిహార్సల్స్ చేయరు. నేరుగా వేసేయగలరంటూ, ఆయన ప్రతిభను కొనియాడారు. 

ఎన్టీఆర్ బాల్యంలో శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. కూచిపూడి నేర్చుకున్న ఎన్టీఆర్ పలు స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. మోడ్రన్ డాన్స్ ఆయన అలవోకగా చేయడం వెనుక కారణం ఇదే. గతంలో భారీ కాయంతో కూడా ఎన్టీఆర్ కఠినమైన స్టెప్స్ వేగంగా వేసేవాడు. ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం చాలా కష్టమని ఇటీవల జాన్వీ కపూర్, అన్నారు. 

36

అలాంటి గొప్ప డాన్సర్ కి ఒక హీరో డాన్స్ అంటే చాలా ఇష్టం అట. సదరు హీరో ఎవరంటే దళపతి విజయ్. దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై వెళ్లిన ఎన్టీఆర్, ఈ విషయం వెల్లడించారు. డాన్స్ అనేది డాన్స్ లా ఉండాలి. అదేదో ఫైట్ లా, జిమ్నాస్టిక్స్ లా ఉండకూడదు. విజయ్ సర్ చాలా కూల్ గా ఉంటూనే అందంగా డాన్స్ చేస్తారు. ఆయన పెద్దగా కష్టపడుతున్నట్లు ఉండదు. విజయ్ డాన్స్ కి నేను వీరాభిమానిని, అన్నారు.

46
Thalapathy vijay

Thalapathy vijay

ఎన్టీఆర్ ఇంకా మాట్లాడుతూ.. నాకు డాన్స్ చేయడం అంత ఇష్టం ఉండదు. బోర్ గా ఫీల్ అవుతున్నాను. డైలాగ్స్, యాక్టింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తాను, అన్నారు. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గ్రేట్ డాన్సర్ ఎన్టీఆర్ పొగడడంతో విజయ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. 

 విజయ్ ఫ్యాన్స్ తమ హీరో కంటే గొప్ప డాన్సర్ ఎవరూ లేరంటారు. మా హీరో అంటే... కాదు మా హీరో గొప్ప డాన్సర్ అని ఎన్టీఆర్-విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాదనకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ లేటెస్ట్ కామెంట్స్ తో విజయ్ తనకంటే బెస్ట్ డాన్సర్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లు అయ్యింది. 

56

విజయ్ ఫ్యాన్స్ ప్రేమను గెలుచుకోవడానికి ఎన్టీఆర్ ఈ కామెంట్స్ చేశారు. విజయ్ కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. దేవర చిత్రానికి విజయ్ ఫ్యాన్స్ మద్దతు ఉంటుందని ఎన్టీఆర్ స్ట్రాటజిక్ గా ఈ కామెంట్స్ చేసి ఉంటారనడంలో సందేహం లేదు. నిజానికి విజయ్ డాన్స్ ప్రొఫెషనల్ గా ఉండదు, ఆయన బెస్ట్ డాన్సర్ కాదనే వాదన ఉంది.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

66

ఈ విషయం అటుంచితే... దేవర విడుదలకు సిద్దమవుతుంది. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో గా చేసిన చిత్రం ఇది. అరవింద సమేత వీర రాఘవ 2018లో విడుదల కాగా, 2024లో దేవరతో ఆడియన్స్ ని పలకరించనున్నాడు.  

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సెప్టెంబర్ 27న విడుదలవుతుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేశాడు. అనిరుధ్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధా ఆర్ట్స్ నిర్మించాయి. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved