- Home
- Entertainment
- విజయ్ దళపతి వీడ్కోలు కార్యక్రమం, రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ కు ప్రత్యేక ఆహ్వానం, ఎక్కడంటే?
విజయ్ దళపతి వీడ్కోలు కార్యక్రమం, రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ కు ప్రత్యేక ఆహ్వానం, ఎక్కడంటే?
సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జననాయకన్ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకలకు వచ్చే సినిమా ప్రముఖులు ఎవరో తెలుసా?

సినిమాలకు విజయ్ గుడ్ బై
సౌత్ స్టార్ హీరో విజయ్. సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించి, 2026 ఎన్నికలకు రెడీ అవుతున్నాడు. అంతే కాదు రెండు పెద్ద బహిరంగ సభలను కూడా నిర్వహించాడు విజయ్. మొదటి సమావేశం విక్క్రవాండిలో, రెండవ సమావేశం మధురైలో జరిగాయి. ఈ సమావేశాలకు లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు.
రాజకీయ నేపథ్యంలో సినిమా
ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న విజయ్ చివరిగా చేస్తున్న సినిమా జననాయకన్. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి స్టార్స్ నటిస్తున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం.
రిలీజ్ కు రెడీగా జననాయకన్
వచ్చే ఏడాది జనవరి 9న జననాయకన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజయ్ సమావేశం లాగే ఆడియో లాంచ్ కూడా భారీ ఎత్తును నిర్వహిస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా మలేషియాలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది.
విజయ్ వీడ్కోలు కార్యక్రమానికి భారీగా సెలబ్రిటీలు
విజయ్ చివరి సినిమా కావడంతో, ఆడియో లాంచ్ ని ఫేర్వెల్ ఫంక్షన్ లా నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే ఈ వెంట్ కు భారీ ఎత్తున సెలబ్రిటీలను ఆహ్వానించే పనిలో ఉన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్ వంటి స్టార్స్ ని ఆహ్వానించాలని అనుకుంటున్నారు. రజనీ, కమల్ రావడం కష్టమే. అజిత్ కూడా తన సినిమా ఫంక్షన్స్ కే రాడు. సూర్య, సింబు వంటి వారు హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్లంతా వస్తే జననాయకన్ ఆడియో లాంచ్ టాలీవుడ్ లో ఒక గొప్ప ఈవెంట్ అవుతుంది.