నాగార్జున గీతాంజలి కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మణిరత్నం, కానీ హీరో ఎవరో తెలుసా?
కింగ్ నాగార్జున హీరోగా మణిరత్నం డైరెక్ట్ చేసిస క్లాసిక్ హిట్ మూవీ గీతాంజలి. ఈసినిమా అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇన్నేళ్లు ఈసినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట మణిరత్నం మరి ఇందులో హీరో ఎవరో తెలుసా?

చరిత్ర సృష్టించిన మణిరత్నం
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిన మణిరత్నం, తన క్లాసిక్ చిత్రాలతో చరిత్ర సృష్టించారు. ఆయన రూపొందించిన అనేక చిత్రాల్లో గీతాంజలి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తికరమైన వార్తలు కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.మణిరత్నం ఇటీవల తెరకెక్కించిన థగ్ లైఫ్ సినిమా, కమల్ హాసన్‌తో కలిసి చేసిన ప్రాజెక్ట్ అయినప్పటికీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం చవిచూసింది. ఈ సినిమా తర్వాత ఆయన నవీన్ పొలిశెట్టితో న్యూ ఏజ్ లవ్ స్టోరీ చేయబోతున్నారని ప్రచారం జరిగినా, తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం.
KNOW
గీతాంజలి సినిమాకు సీక్వెల్
రీసెంట్ గా చెన్నై ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, మణిరత్నం ఇప్పుడు తెలుగులోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. అది కూడా తాను గతంలో డైరెక్ట్ చేసిన హిట్ తెలుగు సినిమాకు సీక్వెల్ ను చేయాలనే ఆలోచనలో ఉన్నాడని టాక్. అందులో కింగ్ నాగార్జునతో మణిరత్నం చేసిన గీతాంజలి సినిమాక సీక్వెల్ చేస్తే బాగుంటుందని అనుకున్నారట. గీతాంజలి 2 ప్రాజెక్ట్ పై కథా నిర్మాణం జరుపుతున్నారని తెలుస్తోంది. గతంలో నాగార్జునతో తెరకెక్కిన గీతాంజలి, తెలుగు సినిమాల్లో ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పుడు దాని కొనసాగింపుగా సీక్వెల్ ప్లాన్ చేయాలనే ఆలోచన మణిరత్నం వద్ద ఉందట.
గీతాంజలి సీక్వెల్ లో హీరో ఎవరు?
అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది ప్రశ్నం. 65 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ గా, హ్యాండ్సమ్ గా ఉన్న నాగార్జున ఈసినిమాలో హీరోగా నటిస్తాడా? లేక ఆయన నట వారసుడు అయిన నాగచైతన్యను ఇందులో తీసుకుంటారా అనేది చూడాలి. నాగార్జున ఈమధ్య కాలంలో రెండు తమిళ సినిమాల్లో నటించాడు. కుబేరాతో పాటు రజినీకాంత్ కూలీ సినిమాలో ఆయన సందడి చేశారు. మరీ ముఖ్యంగా కూలీ సినిమాలో సైమన్ పాత్రలో ఆయన నటన, స్టైలీష్ లుక్స్ కు తమిళ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈక్రమంలో మణిరత్నం సినిమా వస్తే మంచి రెస్పాన్స్ వస్తుందన్న అభిప్రాయంలో ఉన్నారు.
నాగచైతన్య కోసం క్యూలో డైరెక్టర్లు
ఇక నాగచైతన్య మాత్రం ప్రస్తుతం కార్తీక్ దండా దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్ లో విడుదల కావచ్చని అంచనాలు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మణిరత్నంతో చైతన్య సినిమా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.ఇక నాగచైతన్యతో సినిమా చేయడం కోసం చాలామంది డైరెక్టర్లు వెయిటింగ్‌లో ఉన్నారు. బోయపాటి శ్రీను, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్లు కథలు వినిపించారని సమాచారం. అయితే వీరందరిని దాటి మణిరత్నం ప్రాజెక్ట్ ఓకే అయితే, అది చైతన్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈవిషయంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.