- Home
- Entertainment
- తన రోల్స్ రాయ్స్ కారులో `బీస్ట్` టీమ్‌తో విజయ్ షికారు.. థళపతి డ్రైవ్ చేస్తుంటే పూజా, నెల్సన్ రచ్చ
తన రోల్స్ రాయ్స్ కారులో `బీస్ట్` టీమ్‌తో విజయ్ షికారు.. థళపతి డ్రైవ్ చేస్తుంటే పూజా, నెల్సన్ రచ్చ
తన సినిమాల ప్రమోషన్లకి దూరంగా ఉండే థళపతి విజయ్ దాన్ని బ్రేక్ చేస్తున్నారు. `బీస్ట్` చిత్రం కోసం ఆయన టీమ్‌తో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా పూజాహెగ్డే, నెల్సన్ వంటివారితోపాటు కారులో రైడ్‌కి వెళ్లాడు.

విజయ్ నటించిన `బీస్ట్` సినిమా ఈనెల 13న విడుదల కాబోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించింది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైమ్ విజయ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు.
కేవలం ఈవెంట్లలోనే పాల్గొనే ఆయన ఏకంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సారి ఇంటర్వ్యూ ఇచ్చారు. సన్ టీవీ కోసం చిత్ర దర్శకుడు నెల్సన్‌తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొనడం విశేషం. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో వైరల్ అవుతుంది. మరోవైపు దానికి మించి మరో ఫన్‌రైడ్‌కి తెరలేపారు. కారులో షికారుకెళ్లారు. ఇందులో విజయ్ డ్రైవ్ చేయడం విశేషం.
తన రోల్స్ రాయ్స్ కారులో థళపతి విజయ్ డ్రైవ్ చేస్తుండగా, వెనకాల పూజా హెగ్డే, దర్శకుడు నెల్సన్‌తోపాటు డాన్స్ మాస్టర్ సతీష్, నటి అపర్ణ దాస్, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఉన్నారు. వీరంతా జోకులేసుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. విజయ్‌పై కూడా సెటైర్లేస్తూ ఫన్ రైడ్‌కి తెరలేపారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. థళపతి విజయ్ ఫ్యాన్స్ ఆకట్టుకుంటున్నాయి. దాదాపు మూడు వీడియోలను తీసి పోస్ట్ చేసింది యూనిట్. దీంతో విజయ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
`బీస్ట్` సినిమాకి సంబంధించి తమిళనాటు ఎలాంటి ఈవెంట్లు నిర్వహించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. అందుకే ఇలాంటి కొత్తగా ప్రమోషన్‌కి తెరలేపారు విజయ్ టీమ్. విజయ్ వద్దకు వచ్చిన వీరంతా కారులో షికారుకెళ్తామనే ఆసక్తిని వెల్లడించారు. దీనికి విజయ్ వెంటనే ఓకే చెప్పడం విశేషం. అంతేకాదు ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తానని చెప్పడం మరో విశేషం. విజయ్ డ్రైవ్ చేస్తుంటే, వెనకాల పూజా, సతీష్, అపర్ణ, దర్శకుడు రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సన్ టీవీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జీవితానికి సంబంధించిన ఓ పెద్ద కొటేషన్ షేర్ చేసుకున్నారు. మనకు ఓ అవకాశం మిస్ అయితే కళ్లని నీళ్లతో నింపడం కరెక్ట్ కాదని, దాన్ని మరో అవకాశంతో ఫుల్‌ఫిల్ చేయాలని తెలిపారు. ఒక ఛాన్స్ మిస్ అయితే మనకు మరో మంచి అవకాశం వెయిట్ చేస్తుందనే విషయాన్ని చెప్పారు విజయ్. ప్రస్తుతం ఈ కొటేషన్ ట్రెండ్ అవుతుంది.