విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫస్ట్ టైమ్.. రిస్క్ తీసుకుంటున్నాడా?
. అదే ధైర్యంతో విజయ్ దేవరకొండ వెంటనే ప్రాజెక్టు సైన్ చేసేసాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తునన్నాడని సమాచారం.

గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ సినిమాలు ఏమీ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. లైగర్ నుంచి మరీ దారుణంగా తయారైంది. చేస్తున్న ప్రతీ సినిమా యావరేజ్ లేదా ప్లాఫ్ అన్నట్లుగా తయారైంది. విజయ్ దేవరకొండ జడ్జిమెంట్ పవర్ తగ్గిందని కొందరు అంటున్నారు. ట్రెండ్ ని పట్టుకోకుండా ఖుషీ, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు చేసి దెబ్బ తింటున్నాడని మరికొందరు అంటున్నారు. ఏదైతైనేం ఫలితం మాత్రం ఒకటే. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త చిత్రం కమిటయ్యారు.
Vijay Devarakonda
విజయ్ దేవరకొండ..రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండు కొత్త చిత్రాలను ఎనౌన్స్ చేసారు. అందులో ఓ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచింది. 1854 నుంచి 1878 మధ్య జరిగే కథ అని పోస్టర్ మీద పేర్కొనడంతో ఈ సినిమా ఇతివృత్తం గురించి ప్రేక్షకుల్లో ఉత్సుకత పెరిగింది.
గతంలో టాక్సీవాలా వంటి హారర్ సినిమాతో తనకి మంచి హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్ డైరక్టర్ కాబట్టి రిస్క్ తక్కువే. అదే ధైర్యంతో విజయ్ దేవరకొండ వెంటనే ప్రాజెక్టు సైన్ చేసేసాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తునన్నాడని సమాచారం. దాంతో విజయ్ దేవరకొండకు ఇప్పుడు రిస్క్ అవసరమా అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.
Vijay devarakonda
రాహుల్ సంకృత్యాన్ గత చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్‌ను పోషించిన విషయం తెలిసిందే. తాజా చిత్రంలో సైతం దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డ్యూయల్ రోల్‌లో హీరో పాత్రను డిజైన్ చేశారని అంటున్నారు. తండ్రి,కొడుకులుగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Actor Vijay Devarakonda
ఇక విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాలు క్రేజీవే. వాటిమీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. విజయ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి.. దర్శకత్వంలో ఒక ప్యాన్ ఇండియా సినిమాచేస్తున్నారు. జెర్సీ సినిమాతో నానికి హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండకి కూడా పెద్ద హిట్ ఇస్తాడని అంటున్నారు. అలాగే రవి కిరణ్ కోలాతో దిల్ రాజు నిర్మించబోతున్న ఒక సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఒక కొత్త జోనర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.