విరాట్ కోహ్లి బయోపిక్ చేస్తా.. విజయ్ దేవరకొండ షాకింగ్ అనౌన్స్ మెంట్.!
‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా షాకింగ్ అనౌన్స్ మెంట్ చేశారు. భవిష్యత్ లో పాపులర్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Viral Kohli) బయోపిక్ లో నటించెందుకు సిద్ధమంటూ సెల్ఫ్ అనౌన్స్ మెంట్ చేశారు.

స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘లైగర్’తో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు కాస్తా గట్టి దెబ్బె తగిలింది. అయినా విజయ్ క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ తన మూవీ Liger ప్రమోషన్స్ లో భాగంగానూ, ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు దుబాయికి చేరుకున్నాడు.
ఆదివారం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. చాలా ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ పై ఇండియా గెలుపొందింది. ఇదిలా ఉంటే క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, విజయ్ దేవరకొండ తో కలిసి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ అనౌన్స్ మెంట్ చేశారు.
ఇప్పటికే ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా కొనసాగుతుండగా.. విజయ్ దేవరకొండ ప్రముఖ ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బయోపిక్ లో నటిస్తానని సెల్ఫ్ గా అనౌన్స్ చేశారు. ఇటీవల విడుదలైన బయోపిక్ ‘83’లోనూ సీనియర్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకు తనను అడిగారని కూడా చెప్పారు.
కానీ అప్పుడు కృష్ణమాచారి శ్రీకాంత్ లా నటించడం కుదరలేదు. కానీ భవిష్యత్ లో విరాట్ కోహ్లి బయెపిక్ లో నటిస్తానని నిర్భయంగా వెల్లడించారు. కోహ్లి అంటే తనకెంతో ఇష్టమని కూడా చెప్పారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇప్పటికే ఇండియన్ క్రికెటర్స్ బయోపిక్స్ లు వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, అజ్హారుద్దీన్, కపిల్ దేవ్ జైత్రయాత్ర, మిథాలీ రాజ్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇండియన్ క్రికెటర్ గా విరాట్ కోహ్లి క్రియేట్ చేసిన సెన్సేషన్ కు, ఆయన వ్యక్తిగత జీవితంపైనా బయోపిక్ వచ్చే అవకాశం లేకపోలేదు.
ఇక విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే ‘లైగర్’ నెగెటివ్ టాక్ ను జీర్ణించుకుంటున్నాడు. దీని నుంచి బయటపడేందుకు ప్రస్తుతం ‘ఖుషి’ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. రౌడీ స్టార్ చేతిలో ‘ఖుషి’తో పాటు ‘జన గణ మన’ చిత్రం ఉంది. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లోనూ నటించనున్నారు.