`కింగ్‌డమ్` మూవీ 4 రోజుల కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్‌కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?
విజయ్ దేవరకొండ హీరో నటించిన `కింగ్‌డమ్` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఈ మూవీ నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.

`కింగ్‌డమ్` మూవీ కలెక్షన్లు
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన `కింగ్‌డమ్` మూవీ గత గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్స్ తో ఈ మూవీకి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ అంచనాలను అందుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యింది. అదే సమయంలో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక డే 1 కలెక్షన్లని రాబట్టడం విశేషం. మొదటి రోజు ఈ సినిమా రూ.39కోట్లు వసూలు చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు కలెక్షన్లు తగ్గినా, స్టడీగా ఉన్నాయి.
KNOW
`కింగ్‌డమ్` నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే
శనివారం, ఆదివారం కూడా డీసెంట్ నెంబర్స్ వచ్చాయి. నాలుగు రోజుల్లో ఈ మూవీ కలెక్షన్ల వివరాలు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఏకంగా రూ.82 కోట్లు రాబట్టినట్టు అధికారికంగా వెల్లడించింది. ఈ లెక్కన ఈ మూవీ సుమారు రూ.40కోట్ల వరకు షేర్ సాధించిందని చెప్పొచ్చు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లని రాబట్టింది. అలాగే నార్త్ అమెరికా, ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు రావడం విశేషం.
`కింగ్‌డమ్` థియేట్రికల్ బిజినెస్
`కింగ్‌డమ్` మూవీకి రూ.52కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందని తెలుస్తోంది. ఈ లెక్కన ఈ మూవీ సేఫ్ కావాలంటే వంద కోట్ల గ్రాస్ రావాలి. ప్రస్తుతం వచ్చిన కలెక్షన్లని బట్టి చూస్తే మరో ఇరవై కోట్ల కలెక్షన్లు వస్తేనే ఈ సినిమా సేఫ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ మూవీకి మరో పది రోజుల వరకు ఎలాంటి అడ్డంకులు లేవు. అప్పటి వరకు పెద్ద సినిమాలు లేవు. దీంతో ఈ కలెక్షన్లు రావడం పెద్ద కష్టం కాదు. కానీ సోమవారం నుంచి కలెక్షన్లు ఎలా ఉంటాయనేదానిపై ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా? అనేది తేలనుంది.
`కింగ్‌డమ్` సినిమా బడ్జెట్
ఇదిలా ఉంటే `కింగ్‌డమ్` మూవీని నిర్మాత నాగవంశీ రూ.130కోట్లతో నిర్మించారు. థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.52 కోట్లు, ఓటీటీ ద్వారా మరో యాభై కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. నిర్మాత సేఫ్ కావాలంటే ఈ మూవీ థియేట్రికల్‌గా ఇంకా ఎక్కువ వసూళ్లని రాబట్టాలి. మరి అది సాధ్యమవుతుందా అనేది చూడాలి. థియేట్రికల్‌గా వసూళ్లని బట్టి ఈ మూవీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
`కింగ్‌డమ్` స్టోరీ లైన్
`కింగ్‌డమ్` మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. మలయాళ నటుడు వెంకటేష్ వైపీ నెగటివ్ రోల్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీలంక నేపథ్యంలో అన్నాదమ్ముల సెంటిమెంట్‌తో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. విజయ్, సత్యదేవ్ అన్నాదమ్ముళ్లుగా నటించారు.
#KINGDOM continues to reign supreme 🔥#BoxOfficeBlockbusterKingdom strikes 𝟖𝟐 𝐂𝐫+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟒 𝐃𝐚𝐲𝐬💥
&
Holding strong across all centres even today 🤟🏻
🎟️ - https://t.co/4rCYFkA5dI@TheDeverakonda@anirudhofficial@gowtam19@ActorSatyaDev… pic.twitter.com/PpLLjuOpIm— Sithara Entertainments (@SitharaEnts) August 4, 2025