MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘ఐదేళ్లుగా ఎదురుచూశా’.. ‘ఖుషి’ రిలీజ్ సందర్భంగా... విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్

‘ఐదేళ్లుగా ఎదురుచూశా’.. ‘ఖుషి’ రిలీజ్ సందర్భంగా... విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్

‘ఖుషి’ చిత్రం ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఐదేళ్లుగా ఎదురుచూపుల పట్ల భావోద్వేగం అయ్యారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 01 2023, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  - స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. బ్యూటీఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ గా ఈ రోజు (సెప్టెంబర్ 1) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి.. సినిమాపై ఆడియెన్స్, ఫ్యాన్స్ ఖుషి అయినట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యామాల్లో సినిమాపై వస్తున్న అభిప్రాయాలతో సినిమా మెప్పించిందని తెలుస్తోంది. 
 

26

ఇంకా సినిమాపై పూర్తి స్థాయిలో రివ్యూలు కొద్దిసేపట్లో రానున్నాయి. ఆ తర్వాత మూవీ విజయ్ దేవరకొండకు ఏ స్థాయిలో విజయం అందించిందనేది తేలబోతోంది. అయితే Kushi  Release సందర్భంగా విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. వరుస ఫ్లాప్స్ ను అందుకుంటున్న వస్తున్న రౌడీ హీరో ఈ చిత్రంపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మేరకు తన మార్క్ లో ప్రమోషన్స్ కూడా చేశాడు. ప్రస్తుతం సినిమా థియేటర్లలో చేరింది. దీంతో విజయ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి. 
 

36

నిన్న యూఎస్ లో ప్రీమియర్స్ పడ్డ సందర్భంగా విజయ్ తొలుత ఓ వీడియోను విడుదల చేశాడు. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న విజయ్ ఎమోషనల్ గా మాట్లాడారు. ‘ఖుషి విడుదల కాబోతోంది. ఇప్పుడే రిలీజ్ దాకా వచ్చామంటే నమ్మలేకపోతున్నాను. మీరు నన్ను వెండితెరపై చూసి ఏడాది గడిచింది. మళ్లీ ‘ఖుషి’తో వస్తున్నాం. మీరందరూ సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను. మీ అందరి ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు ఎంత వేచి ఉన్నానో మాటల్లో చెప్పలేను. కొన్ని గంటల్లో ‘ఖుషి’ మీ సొంతం కాబోతోంది.’ అంటూ యూఎస్  ప్రీమియర్స్ ముందు తన ఫీలింగ్ ను బయటపెట్టారు. 
 

46

ఇక తాజాగా... మరో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘మీరందరూ నాతో పాటు 5 ఏళ్లు వేచి ఉన్నారు. నేను చేయాల్సి చేస్తానని ఓపికగ్గా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ‘ఖుషి’తో అది మేం చేశాం. నాకు దగ్గరగా ఉన్నవాళ్లు హ్యాపీగా నన్ను నిద్రలేపారు. అలాగే కొన్ని వందల మెసేజ్ లు నా ఫోన్‌కు  వచ్చాయి. ఈ క్షణంలో నేను భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేను. నేను మీ అందరి పట్ల ప్రేమతో ఉన్నాను. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ‘ఖుషి’కి వెళ్లి ఆనందించండి.  ప్రేమతో మీ విజయ్ దేవరకొండ’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. 
 

56

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కు ‘ఖుషి’తో మంచి రిజల్ట్ అందిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పూర్తిస్థాయిలో రివ్యూలు, రిజల్ట్ బయటికి రావాల్సి ఉంది. ఈ చిత్రానికి శివ నిర్మాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు. హేషమ్ అబ్దుల్ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. 
 

66

ఇప్పటి వరకు ఉన్న టాక్ ప్రకారం సినిమా విషయానికొస్తే.. బ్రహ్మిణ కుటుంబంలోని ఆరాధ్య, క్రిస్టియన్ అయిన విప్లవ్ ను కాశ్మీర్ లో బేగంగా కలుస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకొని తాము బెస్ట్ కపుల్ అని నిరూపించాలనుకుంటారు. ఆ తర్వాత ఏం చేశారనేది సినిమా. సమంత, విజయ్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. మ్యూజిక్, కామెడీ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ
Latest Videos
Recommended Stories
Recommended image1
ఆలియా భట్ ను బాక్సాఫీస్ క్వీన్‌గా మార్చిన 5 సినిమాలు.. ఒక మూవీ కలెక్షన్లు తెలిస్తే షాకే!
Recommended image2
Chiranjeevi: హిట్లర్ మూవీ ఆ ఒక్క డైలాగ్ మేనరిజం రాసింది నేనే.. చిరంజీవి పిలిచి ఏమన్నారంటే.?
Recommended image3
Rajamouli: అదీ రాజమౌళి గొప్పతనం.! అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు పక్కన తిరుగుతున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved