MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Deverakonda : కోపంతో రగిలిపోయిన విజయ్ దేవరకొండ.. ఆ బాధ నాకు తెలుసంటూ.. రౌడీ హీరో సంచలన పోస్ట్. .

Vijay Deverakonda : కోపంతో రగిలిపోయిన విజయ్ దేవరకొండ.. ఆ బాధ నాకు తెలుసంటూ.. రౌడీ హీరో సంచలన పోస్ట్. .

విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది.. పట్టరాని ఆవేశం వచ్చింది. ఆ బాధ నాకు తెలుసు. వాళ్లను వదిలేయకండి.. ఏదో ఒకటి చేయాల్సిందే.. అంటూ రౌడీ హీరో డిమాండ్ చేశారు. ఇంతకీ విషయం ఏంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 11 2026, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది..
Image Credit : Vijay Devarakonda\Twitter

విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు పట్టరాని కోపం వచ్చింది. ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై అప్పుడప్పుడు స్పందించే విజయ్.. కొన్ని విషయాలలలో కాస్త అగ్రసీవ్ గానే స్పందిస్తుంటాడు. నన్ను కదిలిస్తే ఎవరికైనా ఇచ్చిపడేస్తాను అని ఓ సందర్బంలో విజయ్ స్వయంగా అన్నారు. అయితే తాజాగా విజయ్ కు ఓ విషయం బాగా కోపం తెప్పించింది. అదేదో కాదు.. తమిళంలో.. దళపతి విజయ్ జననాయగన్ సినిమా లీక్ అవ్వడం.. దేవరకొండకు కోపం తెప్పించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోషల్ మీడియాలో రౌడీ హీరో పోస్ట్..
Image Credit : Vijay Devarakonda/Instagram

సోషల్ మీడియాలో రౌడీ హీరో పోస్ట్..

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాకి సంబంధించిన కీలక ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ మూవీ టీమ్ కు తన పూర్తి సపోర్ట్ ను ప్రకటించారు.

35
ఆ బాధేంటో నాకు కూడా తెలుసు..
Image Credit : our own

ఆ బాధేంటో నాకు కూడా తెలుసు..

తన పోస్టులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “‘జన నాయగన్’ లీక్ వార్త నాకు కోపం తెప్పించింది. నా కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి అనుభవం నాకు కూడా ఎదురయ్యింది. ఆ బాధ, నష్టం ఎలా ఉంటాయో నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఈ చర్య కేవలం ఒకరిపై దాడి కాదు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎందరివో కలలు, శ్రమ దీనిపై ఆధారపడి ఉంటాయి” అని అన్నాడు.

45
స్పందిస్తున్న పలువురు ప్రముఖులు..
Image Credit : Asianet News

స్పందిస్తున్న పలువురు ప్రముఖులు..

విజయ్ ఇంకేమన్నాడంటే '' ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, లీక్ వెనుక ఉన్న వారిని గుర్తించాలి, లేదంటే ఇది వ్యవస్థ వైఫల్యంగా పరిగణించాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక ఈ లీక్ వివాదంపై సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ ఘటన ప్రమాదం కాదని, ఇది వ్యవస్థ వైఫల్యమని వ్యాఖ్యానించారు. సర్టిఫికేషన్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యమే పైరసీకి అవకాశం కల్పిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

55
కొనసాగుతున్న దర్యాప్తు..
Image Credit : Facebook@TVK - Vijay Speech

కొనసాగుతున్న దర్యాప్తు..

ఇక మెగాస్టార్ చిరంజీవి, అలాగే హీరో సూర్య కూడా ఈ లీకేజీని తీవ్రంగా ఖండించారు. సినీ పరిశ్రమ మొత్తాన్ని ప్రభావితం చేసే ఇలాంటి చర్యలను అరికట్టాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’ ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా లీక్ ఘటనతో మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Recommended image2
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Recommended image3
Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?
Related Stories
Recommended image1
Tripti Dimri: ఫస్ట్ ఇండియాన్ అంబాసిడర్‌గా తృప్తి డిమ్రి.. యానిమల్ హీరోయిన్ సరికొత్త రికార్డు..
Recommended image2
Prabhas : బిర్యానీ ఆఫర్ చేసి.. ప్రభాస్ ను లంచ్ కు పిలిచిన అమ్మాయి, పాన్ ఇండియా స్టార్ ఏమన్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved