- Home
- Entertainment
- న్యూయార్క్ లో జంటగా చూడముచ్చటగా కనిపించిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఇండియా డే పరేడ్ లో అరుదైన గౌరవం
న్యూయార్క్ లో జంటగా చూడముచ్చటగా కనిపించిన విజయ్ దేవరకొండ, రష్మిక.. ఇండియా డే పరేడ్ లో అరుదైన గౌరవం
విజయ్ దేవరకొండ, రష్మిక జంటకి అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరూ న్యూయార్క్ లో జరిగిన ఇండియా పరేడ్ కార్యక్రమంలో జంటగా పాల్గొన్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్
విజయ్ దేవరకొండ, రష్మిక జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరూ లవ్ బర్డ్స్ అనే రూమర్స్ టాలీవుడ్ లో ఉన్నాయి. అది బహిరంగ రహస్యం కూడా. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాల్లో రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా నటించారు. తరచుగా వీరిద్దరూ వెకేషన్స్ కి వెళుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు రష్మిక.. విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో బాండింగ్ పెంచుకుంటున్నట్లు కూడా కొన్ని సంకేతాలు ఇచ్చింది.
KNOW
న్యూయార్క్ లో జంటగా సందడి
ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక జంటకి అరుదైన గౌరవం దక్కింది. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ జంటగా న్యూయార్క్ నగరంలో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర వేడుకల సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ పరేడ్ నిర్వహించారు. ఈ భారీ కవాతులో ఎన్నారైలు, అమెరికన్లు కూడా పాల్గొన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మికకి అరుదైన గౌరవం
ఇండియా డే కవాతులో విజయ్ దేవరకొండ, రష్మికకి గ్రాండ్ మార్షల్స్ గా అరుదైన గౌరవం దక్కింది. కవాతు మొత్తం త్రివర్ణ పతాకాలతో వెలిగిపోయింది. విజయ్ దేవరకొండ క్రీం కలర్ కుర్తా పైజామాలో కనిపించగా, రష్మిక చుడీదార్ లో మెరిసింది.
VIDEO | Actress Rashmika Mandanna, along with actor Vijay Deverakonda (@TheDeverakonda), lead the 43rd India Day Parade in New York City as Grand Marshals.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/CSGiMgzrIG— Press Trust of India (@PTI_News) August 17, 2025
ఎన్నారైలపై విజయ్ దేవరకొండ ప్రశంసలు
భారత స్వాతంత్ర వేడుకల సందర్భంగా న్యూయార్క్ లోని ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ త్రివర్ణ పతాకం రంగులతో వెలిగిపోయింది. ఈ లైటింగ్ ని విజయ్ దేవరకొండ స్వయంగా స్విచాన్ చేసి ప్రారంభించారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇలాంటి అద్భుతమైన బిల్డింగ్ పై మన జెండా మూడు రంగులు చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నారైలో మన దేశ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చాటుతున్నారు. దేశం కోసం ఎన్నారైలు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే గర్వంగా ఉంది అని విజయ్ దేవరకొండ తెలిపారు.
రష్మికతో చనువుగా..
విజయ్ దేవరకొండ, రష్మిక ఈ కవాతులో జంటగా చిరునవ్వులు చిందిస్తూ పాల్గొన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పరేడ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ.. రష్మిక భుజంపై చేయి వేసి చాలా చనువుగా కనిపించాడు. విజయ్ దేవరకొండ చివరగా కింగ్డమ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం పర్వాలేదనిపించింది. మరోవైపు రష్మిక పుష్ప 2, ఛావా లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతోంది.