- Home
- Entertainment
- విజయ్, రమ్యకృష్ణ, అనన్యపాండేల పారితోషికం..`లైగర్` కోసం ఎంత తీసుకున్నారో తెలిస్తే ఫ్యూజులెగిరిపోవాల్సిందే!
విజయ్, రమ్యకృష్ణ, అనన్యపాండేల పారితోషికం..`లైగర్` కోసం ఎంత తీసుకున్నారో తెలిస్తే ఫ్యూజులెగిరిపోవాల్సిందే!
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన `లైగర్` చిత్రం డిజాస్టర్ టాక్‌ని తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. కానీ వీరి పారితోషికం మాత్రం షాకిస్తుంది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన `లైగర్` చిత్రం గురువారం విడుదలై నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంటోంది. విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణల నటన తప్పిస్తే సినిమాలో ఏం లేదని తేల్చిపడేస్తున్నారు ఆడియెన్స్. విజయ్ అతి నత్తి, కథ, కథనాలు లేకపోవడం, అనన్య పాండే నటన వెరసి సినిమాని డిజాస్టర్‌ని చేశాయని అంటున్నారు క్రిటిక్స్.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర, షాకింగ్ విషయం ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికిగానూ విజయ్ దేవకొండ, రమ్యకృష్ణ, అనన్య పాండేలు తీసుకున్న పారితోషికం వివరాలు షాకిస్తున్నాయి.
`లైగర్` చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ. రిలీజ్‌కి ముందే ఈ స్థాయి ఇమేజ్, క్రేజ్ రావడం మామూలు విషయం కాదు. అది ఒక్క విజయ్‌కే సాధ్యమైందని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రానికిగానూ ఆయనకు పూరీ ఏకంగా 35కోట్ల పారితోషికం ఇచ్చారని సమాచారం. ఇది `ఆర్‌ఆర్‌ఆర్`లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల పారితోషికంతో సమామని చెప్పొచ్చు.
బాక్సింగ్ మాజీ వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్ర కోసం తీసుకున్న విషయం తెలిసిందే. సరైన ప్రాధాన్యతనివ్వని ఆయన పాత్రకిగానూ ఏకంగా రూ.40కోట్లు పారితోషికంగా ఇచ్చారట. ఇది సినీ వర్గాలను షాక్‌కి గురి చేస్తుండటం విశేషం.
మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేని `లైగర్`లో హీరోయిన్ పాత్రకి తీసుకున్న విషయం తెలిసిందే. ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో మెరిసిన అనన్య పాండేకి మూడు కోట్లు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇందులో ఆమె పాత్రపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్ మెటీరియల్ కాదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం.
ఇక సరైన పాత్ర దొరికితే నట విశ్వరూపం చూపించే రమ్యకృష్ణ ఇందులో హీరోకి తల్లిగా నటించిన విషయం తెలిసిందే. తన కొడుకుని మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో ఛాంపియన్‌గా నిలపాలనే కోరికతో ముంబాయికి వచ్చిన తల్లి పాత్రలో అదరగొట్టింది రమ్యకృష్ణ. ఈ పాత్రకిగానూ ఆమె కోటి రూపాయలు పారితోషికం అందుకున్నారు. కోచ్‌గా కనిపించిన రోనిత్ రాయ్‌కి కోటిన్నర పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. ఇలా పారితోషికాలే వంద కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం.
విడుదలైన ఫస్ట్ షో నుంచే సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ చిత్రం తొలి రోజు 24కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఇవేన్ కావాలంటే ఇంకా వంద కోట్లకుపైగా కలెన్లని రాబట్టాలి. ఈ లెక్కన సినిమాకి భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది.