- Home
- Entertainment
- Vijay Devarakonda Planning: పక్కా పాన్ ఇండియా స్కెచ్ వేసిన విజయ్ దేవరకొండ… నెక్ట్స్ ఏంటీ అంటే..?
Vijay Devarakonda Planning: పక్కా పాన్ ఇండియా స్కెచ్ వేసిన విజయ్ దేవరకొండ… నెక్ట్స్ ఏంటీ అంటే..?
పక్కా ప్లానింగ్ తో రెచ్చిపోతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నాడు. నిధానమే ప్రదానం అంటున్నాడు.

వరుసగా రెండు ప్లాప్ ల తరువాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చాలా జాగ్రత్త పడ్డాడు. తీసుకునే కథ విషయంలో ఆలోచించి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో.. టాలీవుడ్ సినిమాగా స్టార్ట్ అయ్యి.. కరణ్ జోహార్ జాయిన్ అవ్వడంతో పాన్ ఇండియా మూవీగా మారిపోయింది లైగర్ (Liger).
కరోనా ఇబ్బందులు దాటుకుని.. ఈ మధ్యే మేజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ రెడీ అవుతుంది లైగర్ సినిమా. అనన్య పాండే హీరోయిన్ గా ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇక ఇంటర్నేషనల్ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు.
లైగర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈసినిమాలో విజయ్ దేవరకొండ ఫుల్ మేకోవర్ అయ్యి కనిపించాడు. క్లీన్ టోన్డ్ బాడీలో.. బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించాడు. ఈమూవీ నుంచి వచ్చిన అప్ డేట్ వీడియోస్ లో విజయ్ ను చూసిన ఫ్యాన్స్ కిక్కెక్కిపోతున్నారు. అంతే కాదు ఈ మూవీలో ఛాయ్ వాలాగా విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు
ఇక సినిమా తరువాత విజయ్ దేవరకొండ ప్లానింగ్ పక్కాగా ఉండబోతున్నాయి. ఇంతకు ముందులా కాకుండా విజయ్ ఈ సారి ఆచి తూచి అడుగులు వేయబోతున్నాడు. లైగర్ తరువాత ముందు గా కమిట్ అయినట్టుగా శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు రౌడీ హీరో. ఈ సినిమా కథ కూడా రొటీన్ కు భిన్నంగా ఉండే లవ్ స్టోరీని ఎంచుకున్నట్టు సమాచారం.అయితే శివ నిర్వాణతో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో చేయబుతన్నారు.
జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తో కూడా విజయ్ సినిమా ఉండగా.. ముందు శివ నిర్వాణ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరుగుతున్నాయి. కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోయు ఈ సినిమాలో హీరోయిన్ గా కీయారా అద్వాని నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తున్న కియారా అద్వానీని ప్రస్తుతం తెలుగు తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న శంకర్ - చరణ్ కాంబినేషన్ మూవలో నటిస్తోంది. ఆతరువాత విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక ఈసినిమా తరువాత విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు. అసలే రౌడీ హీరో.. అక్కడ జీనియస్ డైరెక్టర్ సుకుమార్. తన హీరోలలో నెగెటీవ్ యాంగిల్ చూపిస్తాడు సుక్కు..మరి విజయ్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. అసలు లైగర్ రిలీజ్ తరువాత ఈ సినిమా హిట్ అయితే.. పాన్ ఇండియా రేంజ్ లో విజయ్ ఇమేజ్ ఎలా ఉండ బోతోందో అంచనా వేయడం కష్టమనే చెప్పాలి.
అటు బాలీవుడ్ నుంచి కూడా విజయ్ దేవరకొండ కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు. లైగర్ గట్టిగా వర్కౌట్ అయితే.. సంజయ్ లీలా బన్సాలీ లాంటి స్టార్ డైరెక్టర్ తో విజయ్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ కోసం బాలీవుడ్ లో కథలు రెడీగా అవుతున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఒకేసారి వచ్చి పడుతున్నా.. చాలా స్టాండెడ్ గా ఆలోచిస్తున్నాడు రౌడీ స్టార్.
అవకాశం వచ్చింది కదా అని రెచ్చిపోకుండా.. మంచి కథలు వర్కౌట్ అయ్యే కథలను ఎంచుకుని మరీ సినిమా చేయాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. దీని కోసం తన టీమ్ ను కూడా రెడీ చూసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ స్టార్ హీరో ప్లానింగ్స్ ముందు ముంద వర్కౌట్ అవుతాయా.. లేక గతంలో లా దెబ్బ తింటాడా అనేది చూడాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.