- Home
- Entertainment
- Liger: ప్రభాస్ X విజయ్ దేవరకొండ.. పూరి కాన్ఫిడెన్స్ చూశారా, టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ కి చెక్ ?
Liger: ప్రభాస్ X విజయ్ దేవరకొండ.. పూరి కాన్ఫిడెన్స్ చూశారా, టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ కి చెక్ ?
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న లైగర్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. ట్రైలర్ కి మాస్ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ట్రైలర్ లోని ప్రతి షాట్ లో పూరి జగన్నాధ్ మేకింగ్ స్టైల్, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. విజువల్స్, యాక్షన్ బ్లాక్స్ థ్రిల్ కలిగిస్తున్నాయి. దీనితో సోషల్ మీడియా మొత్తం లైగర్ మ్యానియాతో నిండిపోయింది. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అంటూ ఫ్యాన్స్ లో చర్చ జోరందుకుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పూరి జగన్నాధ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇండియన్ సినిమాలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ బిగ్ థింగ్ కాబోతున్నాడు. రాసి పెట్టుకోండి అంటూ ట్రైలర్ లాంచ్ లో పూరి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. లైగర్ మూవీలో విజయ్ చించేశాడు అంటూ ప్రశంసించాడు. పూరి మాటలని తేలిగ్గా తీసుకోలేం. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారడానికి ఐదేళ్లు పట్టింది. అంటే బాహుబలి రెండు భాగాలు పూర్తి కావడానికి.
ఇక పుష్ప చిత్రానికి సుకుమార్, ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి చాలా సమయమే కేటాయించారు. తక్కువ టైంలో సెన్సేషన్ క్రియేట్ చేయడం పూరికి బాగా తెలుసు. ఆయన అనుకున్న పాయింట్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఉంటుంది. సింగిల్ పాయింట్, హీరో క్యారెక్టరైజేషన్ తో పోకిరి చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టారు.
ఇప్పుడు కరణ్ జోహార్ అండ దండలతో లైగర్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ సినిమాకి కావలసిన హైప్ వచ్చేసింది. ఇక పూరి మ్యాజిక్ వర్కౌట్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం సూపర్ హిట్ కావడం పక్కా అని అంటున్నారు.
అంటే ఈ చిత్రంతో తక్కువ సమయంలోనే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడా.. పూరి మాటలకు అర్థం అదేనా అని కూడా సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. బాహుబలి చిత్రానికి ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. అలాగే ఆర్ఆర్ఆర్ కి చరణ్, ఎన్టీఆర్.. పుష్ప చిత్రానికి బన్నీ కూడా దాదాపు అదే స్థాయిలో శ్రమించారు. కానీ విజయ్ దేవరకొండకి మాత్రం వారితో పోల్చుకుంటే కొంచెం సింపుల్ గానే పాన్ ఇండియా హీరోగా నిలబడే అవకాశం దక్కింది.
చూస్తుంటే లైగర్ మూవీ నార్త్ లో మాస్ ఆడియన్స్ లోకి చాలా ఈజీగా చొచ్చుకుపోయే చిత్రంలా కనిపిస్తోంది. దీనితో విజయ్ కి ఈ చిత్రంతో బలమైన హిందీ మార్కెట్ ఏర్పడబోతోంది అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ వరుస చిత్రాలు చేస్తున్నాడు. పుష్ప తర్వాత బన్నీ.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ పాన్ ఇండియా క్రేజ్ నిలబెట్టుకునే పనిలో ఉన్నారు. వీరందరికి విజయ్ దేవరకొండ రూపంలో టఫ్ ఫైట్ ఎదురు కాబోతోందనే అంచనాలు మొదలయ్యాయి.