ఫ్యామిలీ స్టార్ ప్రీమియర్ రివ్యూ: విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో, ఓవర్ ఆల్ టాక్ ఏంటంటే?
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఏమిటో చూద్దాం...
Family Star Review
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్లీన్ హిట్ కొట్టి ఏళ్ళు గడుస్తుంది. ఆయన గత చిత్రం ఖుషి సైతం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. యావరేజ్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే హిట్ కాంబోతో చేతులు కలిపాడు. 2018లో విడుదలైన గీత గోవిందం విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఉంది.
Family Star Review
ఆ గీత గోవిందం మూవీ తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ తో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ చేశాడు. మృణాల్ ఠాకూర్ మొదటిసారి విజయ్ దేవరకొండతో జతకట్టింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు.
Family Star Review
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేశారు. లెక్కకు మించిన ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. హీరోయిన్ మృణాల్ కూడా చాలా సమయం కేటాయించింది. చివరికి దిల్ రాజు కూడా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ ని సీరియస్ గా తీసుకున్నాడు. మృణాల్, విజయ్ దేవరకొండలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
Family Star Review
మరి విజయ్ దేవరకొండ-పరశురామ్ ల ప్రయత్నం ఫలితం ఇచ్చిందా? ఫ్యామిలీ స్టార్ టాక్ ఏమిటో చూద్దాం... యూఎస్ లో ఫ్యామిలీ స్టార్ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.
Family Star Review
ఆడియన్స్ కామెంట్స్ ని బట్టి ఫ్యామిలీ స్టార్ కి మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యామిలీ స్టార్ వన్ మ్యాన్ షో. విజయ్ దేవరకొండ వంద శాతం న్యాయం చేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మెప్పిస్తుందని అంటున్నారు. మృణాల్ ఠాకూర్ గ్లామర్, నటన మరో హైలెట్.
Family Star Review
ఫ్యామిలీ స్టార్ లో అక్కడక్కడా కామెడీ, రొమాంటిక్ సీన్స్ వర్క్ అవుట్ అయ్యాయి. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ విషయానికి వస్తే కొందరు బాగుంది అంటున్నారు. మరి కొందరు ఆడియన్స్ సినిమాకు మైనస్ అంటున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Family Star Review
అయితే పరశురామ్ తన మార్క్ మిస్ అయ్యాడనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ నిరాశ పరుస్తాయి. సినిమా రొటీన్ గా ఉంది. ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అయితే సీరియల్ మాదిరి సాగిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో మూవీ ఊపందుకున్న భావన కలుగుతుంది. మరలా డల్ గా సాగుతుంది.
Family Star Review
ఫ్యామిలీ స్టార్ క్లైమాక్స్ సైతం మైనస్ అంటున్నారు. పరశురామ్ కెరీర్లో బెస్ట్ చిత్రాలుగా ఉన్న సోలో, గీత గోవిందం స్థాయిని ఫ్యామిలీ స్టార్ అందుకోలేదు అనేది ఆడియన్స్ అభిప్రాయం. అదే సమయంలో యూత్ ని మెప్పించే అంశాలు కూడా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు అంటున్నారు.
Family Star Review
పూర్తి రివ్యూ వస్తే కానీ టాక్ ఏమిటనేది చెప్పలేం. ఇక ఫస్ట్ వీకెండ్ కి సినిమా ఫలితం ఏమిటో తెలిసిపోతుంది. మరి చూడాలి విజయ్ దేవరకొండ ఈసారైనా క్లీన్ హిట్ కొడతాడలో లేదో. మృణాల్ ఠాకూర్ కి తెలుగులో ఇది మూడో చిత్రం కాగా గత రెండు చిత్రాలు సీతారామం, హాయ్ నాన్న విజయం సాధించాయి...