MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డామేజ్ కంట్రోల్ మోడ్ లోకి విజయ్...ఆ పని మీద కూర్చుంటున్నాడా?

డామేజ్ కంట్రోల్ మోడ్ లోకి విజయ్...ఆ పని మీద కూర్చుంటున్నాడా?

లైగర్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఖుషీ సినిమాతో కొంత తేరుకున్నప్పటికీ, అతడు ఆశించిన విజయాన్ని మాత్రం ఖుషీ అందించలేకపోయింది.

3 Min read
Author : Surya Prakash
Published : Apr 13 2024, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

యువతలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటి యువతలో ఉన్న ఆలోచనలకు తగ్గట్లుగా ప్రతి చిత్రంలో విజయ్ పెర్ఫామెన్స్ ఉంటోంది. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, మేనరిజమ్స్ యువతకి బాగా నచ్చేశాయి. అందుకే తక్కువ సమయంలోనే విజయ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


ఉవ్వెత్తున ఎగిరిన  విజయ్ దేవరకొండ కెరీర్ మెల్లిగా డ్రాప్ అవుతూ వస్తోంది. ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. ఖుషీ తో ఒడ్డునపడతాడుకుంటే అదీ మొహం చాటేసింది. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీస్టార్ పై నమ్మకం పెట్టుకుంటే అదీ చీదేసింది. లైగర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ నేఫధ్యంలో విజయ్ దేవరకొండకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ని,లైగర్ కలెక్షన్స్ ని పోల్చి చూపుతూ వేకప్ కాల్ వచ్చినట్లే జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చిందంటున్నారు.

 

39

విజయ్ తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం డైరెక్టర్‌ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన క్రిందటి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఓ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశాడు.  సినిమాపై  మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమాకి ఆడియన్స్ నుండి మాత్రం డివైడ్ టాక్ వచ్చింది.కథలో కొత్తదనం లేదని, రొటీన్ సినిమానే ప్రేక్షకుల మీదకు వదిలారని కామెంట్స్ విపించాయి. 
.
 

49

 . ఈ మూవీలో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. ట్రైలర్, సాంగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దీనితో మరో గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ లోడింగ్ అంటూ అంచనాలు వినిపించాయి . కానీ అవన్నీ తప్పాయి.  ప్యామిలీలు ఈ సినిమాలు బాగా ఆదరిస్తున్నారని నిర్మాత దిల్ రాజు నమ్మకంగా చెప్తున్నా వాస్తవానికి ఆ పరిస్దితి ఏమి కనపడటం లేదు. రివ్యూలు దెబ్బ తీసాయని దిల్ రాజు భాధపడటం తప్పించి ఫలితం లేదు. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద పడింది. అయితే ఈ సినిమాకు మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి

59
Actor Vijay Devarakonda

Actor Vijay Devarakonda


మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.00 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ. 8.20 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. నిజానికి విజయ్ దేవరకొండ స్టామినాకి ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవాలి.రెండో రోజు నుంచి డ్రాప్ ప్రారంభమైంది. వరల్డ్ వైడ్గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కేవలం రూ.30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 11న ఏడో రోజు రంజాన్ ఫెస్టివల్ కూడా తోడైన కూడా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.94 లక్షల కలెక్షన్లే వచ్చి విజయ్ కెరీర్ కు డేంజల్ బెల్స్ మోగించింది.

69


విజయ్ దేవరకొండ కెరీర్లోనే డిజాస్టర్ గా మిగిలిపోయిన లైగర్ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లకుపైగా వసూలు చేసింది.ఫస్ట్ వీక్ అంతా చూసినా మొదటి రోజు లైగర్ కలెక్షన్స్ దగ్గరకు కూడా రాకపోవటం ట్రేడ్ కు షాక్ ఇచ్చింది.  మొత్తంగా ఫ్యామిలీ స్టార్ తెలుగు వెర్షన్ నెట్ కలెక్షన్లు రూ.16.83 కోట్లుగా ఉండగా..తమిళంలో వీకెండ్ మొత్తం కలిపి రూ.1.42 కోట్లు మాత్రమే వచ్చాయి.ఇండియా గ్రాస్ కలెక్షన్లు రూ.21.15 కోట్లుగా, ఓవర్సీస్ లో రూ.9.5 కోట్లు వచ్చాయి. 
 

79


ఇక ఫస్ట్ డే రూ.5.55 కోట్లతో మొదలైనా..ఏడో రోజుకు వచ్చేసరికి కోటి కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక ది ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ బిజినెస్ విషయానికి వస్తే..నైజాం రూ.13.00 కోట్లు, సీడెడ్‌ రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ అన్ని ప్రాంతాల్లో కలిపి రూ.17.00 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక మిగతా భాషల్లో కలిపి రూ.3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లు కలిపి.. మొత్తంగా ఈ సినిమాకు రూ.43 కోట్లు బిజినెస్ జరిగింది. టోటల్ రన్ లో రికవరీ ఏ మేరకు ఉంటుందో చూడాలి. 

89


ఈ నేపధ్యంలో గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ సినిమా స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాల్సిన సిట్యువేషన్ లో విజయ్ ఒకటికి నాలుగు సార్లు స్క్రిప్టు చెక్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జూన్ నుంచి గౌతమ్ తిన్ననూరి సినిమాను స్టార్ట్ చేస్తాడు విజయ్.
 

99
Vijay Devarakonda-Rashmika Mandanna

Vijay Devarakonda-Rashmika Mandanna


 పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు విజయ్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను శ్రీలంకలో ప్లాన్ చేశారు. దాదాపు 40శాతం షూటింగ్ ను అక్కడే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. లైగర్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఖుషీ సినిమాతో కొంత తేరుకున్నప్పటికీ, అతడు ఆశించిన విజయాన్ని మాత్రం ఖుషీ అందించలేకపోయింది. అందుకే ఫ్యామిలీ స్టార్, గౌతమ్ తిన్ననూరి సినిమాలపై ఆశలు పెట్టుకున్నాడు విజయ్. ఫ్యామిలీస్టార్ కూడా దెబ్బ కొట్టడంతో గౌతమ్ మీదే పూర్తి డిపెండ్ అయ్యారు. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
దిల్ రాజు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Stars Salary: రామాయణం కోసం రణబీర్, యశ్, సాయి పల్లవి ఎంత తీసుకున్నారో తెలుసా?
Recommended image2
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image3
Mamitha Baiju: 2026 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్‌.. వరుసగా 300, 330, 350 కోట్ల కలెక్షన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved