MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించింది తమ్ముడే.. ఆర్థిక కష్టాలు చెప్పిన విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించింది తమ్ముడే.. ఆర్థిక కష్టాలు చెప్పిన విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గా మారుతున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు విజయ్ దేవరకొండ క్రేజ్ పెంచాయి. విజయ్ కి స్పెషల్ ఫాలోయింగ్ వచ్చింది. 

2 Min read
Author : pratap reddy
| Updated : Oct 26 2021, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో యూత్ ఐకాన్ గా మారుతున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు విజయ్ దేవరకొండ క్రేజ్ పెంచాయి. విజయ్ కి స్పెషల్ ఫాలోయింగ్ వచ్చింది. విజయ్ తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో యువతని మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక Vijay Devarakonda తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలో అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. నటుడిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. దేవరకొండ సోదరులు ఇద్దరూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో విజయ్, దేవరకొండ సరదాగా మాట్లాడుతూ.. తమ లైఫ్ స్టైల్, సినిమాల్లోకి రాకముందు తమ ఆర్థిక పరిస్థితి, ప్రేమ వ్యవహారాలు లాంటి అనేక విషయాలు పంచుకున్నారు. 

36

విజయ్ దేవరకొండ సినిమా నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి చిత్ర పరిశ్రమలోకిఅడుగుపెట్టాడు. గతంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందట. ఆ సంగతులని దేవరకొండ బ్రదర్స్ రివీల్ చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నాకంటే ముందుగా మా ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించింది తమ్ముడే అని చెప్పాడు. దీనిపై Anand Devarakonda స్పందిస్తూ.. ఇంజనీరింగ్ చదివే సమయంలో ఒక ఇంటర్న్ షిప్ చేసినట్లు తెలిపాడు. అంతకు ముందు మేమిద్దరం మా అమ్మ నడిపే ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో క్లాసులు చెప్పేవాళ్ళం. 

46

మా ఇద్దరికీ ఇంగ్లీష్ బాగా వచ్చు. ఎవరైనా ట్రైనర్ లేనప్పుడు మేము క్లాసులు చెప్పేవాళ్ళం. ఈరోజు క్లాస్ చెబితే 500 ఇస్తా అని మా అమ్మ చెప్పేది. ఆ టైములో 500 అంటే వామ్మో 500 అని అనుకునేవాళ్లం. అలా చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులతో ఫ్యామిలీ గడిచేది. ఆ తర్వాత తమ్ముడు యుఎస్ వెళ్ళాడు. యుఎస్ నుంచి ఫోన్ చేసి నాకు డెలాయిట్ లో జాబ్ వచ్చింది అని చెప్పగానే సంతోషంతో ఇంట్లో వాళ్ళందరం ఏడ్చేశాం అని విజయ్ దేవరకొండ తెలిపాడు. తమ్ముడికి జాబ్ రావడం కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడింది. 

56

యూఎస్ నుంచి వచ్చాక తమ్ముడు తన డబ్బుతో తొలిసారి డిన్నర్ ఇచ్చాడు అంటూ విజయ్ దేవరకొండ మెమొరీస్ గుర్తుచేసుకున్నాడు. తమ్ముడు జాబ్ చేస్తున్నప్పుడు వాడి కొత్త బట్టలు నేను వేసుకునే వాడిని. నా బట్టలంటే కొంచెం ఇష్టం. స్టయిల్ గా మైంటైన్ చేయాలనుకుంటా. డబ్బు లేనిరోజుల్లో కూడా మంచి బట్టలు వేసుకునేవాడిని. 50శాతం ఆఫర్ చూసి క్వాలిటీ బట్టలు కొనేవాడిని. ఇప్పుడు బట్టలు కొనాల్సిన అవసరం లేదు.. ఫ్యాషన్ డిజైనర్స్ పంపుతున్నారు అంటూ విజయ్ దేవరకొండ సరదాగా కామెంట్ చేశాడు. 

66

ఇప్పుడు తమ్ముడు తన బట్టలని వేసుకుంటున్నాడని విజయ్ సరదాగా తెలిపాడు. విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా దూసుకుపోతుంటే.. ఆనంద్ దేవరకొండ మంచి అవకాశాలు అందుకుంటూ చిన్న బడ్జెట్ లో చిత్రాలు చేస్తున్నాడు. ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో కూడా ఆనంద్ సినిమాలు చేస్తున్నాడు. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved