నయనతారకు విష్నేష్ శివన్ విషయంలో అత్తగారు పెట్టిన షరతులేమిటో తెలుసా...?
హమ్మయ్య నయనతార పెళ్లి ఎట్టకేలకు అయ్యింది. యంగ్ డైరెక్టర్ తో జీవితం పంచుకోవడం కోసం పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యింది నయన్. అయితే ఈ పెళ్ళి జరగాలంటే నయన్ కు కొన్ని షరతులు తప్పలేదట, అవి కూడా విష్నేష్ కన్నతల్లి పెట్టిన షరతులకు నయన్ ఒప్పుకున్నాకే పెళ్ళి జరిగిందట. ఇంతకీ ఆ షరతులేమిటి.
తెలుగు, తమిళ్, మలయాళం లో మంచి ఫాలోయింగ్ ఉంది నయనతారకు. అన్ని భాషల్లో అభిమానులకు కొదవలేదు ఆమెకు. పెద్ద పెద్ద హీరోలతో జోడీ కట్టిన నయనతార రెమ్యునేషన్ దాదాపు 6 కోట్ల వరకూ తీసుకుంటుంది. అందరి హీరోయిన్స్ తో పోలిస్తే యువర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువనే చెప్పవచ్చు.
నయనతార.. ఏజ్ పెరుగుతున్న డిమాండ్ తగ్గని హీరోయిన్. ఇప్పటికీ సినిమాకు 7కోట్ల వరకూ వసూలు చేస్తోందంటే.. ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ విష్నేష్ శివన్ ను పెళ్శాడింది..కోలీవుడ్ సీనియర్ బ్యూటీ.
ఇక ఎప్పుడో 20 ఏళ్లక్రితం కెరీర్ స్టార్ట్ చేసిన నయనతారకు ప్రేమికుల లిస్ట్ కూడా ఎక్కువే. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లో యంగ్ స్టార్ శింబుతో ప్రేమలో పడిన నయన్.. శింబులో చెట్టాపట్టల్ వేసుకుని తిరగింది. ఇక వీరి పెళ్ళి మాత్రమే మిగిలి ఉంది అనుకున్న టైమ్ లో బ్రేకప్ చెప్పుకున్నారీ జంట. అంతేకాకుండా వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ కూడా అప్పటిలో తెగ వైరల్ గా మారాయి.
নয়নতারা-অভিনেত্রী
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మళ్లీ దర్శకుడు మరియు కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా ప్రేమలో పడింది నయనతార. వీళ్లిద్దరు ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్ళింది.పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతానని అప్పటి లో రిలీజ్ అయిన శ్రీ రామరాజ్యం చిత్రం ఓ ఫంక్షన్ సందర్భంగా ప్రెస్ మీట్ లో చెప్పింది నయన్. ఇక ప్రభుదేవా నయనతారని పెళ్లి చేసుకోవడం కోసం అతని భార్యకు విడాకులు ఇచ్చేశాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రభుదేవా నయనతార జంట విడిపోయింది.
ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత విగ్నేష్ శివన్ తో ఏడు సంవత్సరాల పాటు రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఈ సంవత్సరం జూన్ 9వ తేదీన వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్ళికి గానూ విగ్నేష్ తల్లి మీనా కుమారి నయనతారకు కోన్ని షరతు పెట్టినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
పెళ్లి తరువాత నయనతార సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలని అత్తగారు కండీషన్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షరతుకి నయనతార కూడా సుముకత వ్యాక్తం చేసినట్టు సమాచారం. అందుకే సౌత్ మీడియాలో నయనతార సినిమాలకు దూరం అవుతుంది అన్న ప్రచారం గట్టిగా జరిగింది.
అయితే ఇప్పుడు ఉన్న సినిమాలలో కూడా ఎటువంటి ఎక్ప్ ఫోజింగ్ లేకుండా.. కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా సినిమాలు చేయాలి అని కూడా చెప్పారట నయన్ అత్తగారు.
ఇక పెళ్లికి ముందే చాలా ఆఫర్లు తన చేతిలో ఉంచుకున్న నయనతార ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెబుతుందా లేక నటిస్తుందా అని అభిమానులు నయన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అంతే కాదు రాకరాక బాలీవుడ్ ఆఫర్ కూడా ఇప్పుడే వచ్చింది. షారుఖ్ ఖాన్ తో అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తోంది నయన్ తార.
వీళ్ళ పెళ్లికి కూడా షారుఖ్ హజరయ్యారు. త్వరలో షూటింగ్ కూడా షురు కాబోతోంది. మరి నయనతారకు అత్తగారు పెట్టిన కండీషన్స్ నిజం అయితే.. ఆమె నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి. ప్రస్తుతం కొత్త పెళ్ళి కూతురు తన భర్తతో టైమ్ స్పెండ్ చేస్తోంది.