MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతార క్యారవ్యాన్ లోకి వెళ్లాలన్నా భయమే..మేడం మేడం అంటూ ముగ్గులోకి, లవ్ స్టోరీ రివీల్ చేసిన విగ్నేష్

నయనతార క్యారవ్యాన్ లోకి వెళ్లాలన్నా భయమే..మేడం మేడం అంటూ ముగ్గులోకి, లవ్ స్టోరీ రివీల్ చేసిన విగ్నేష్

విగ్నేష్ శివన్ ఇన్నేళ్ల తర్వాత తాజాగా తన లవ్ స్టోరీ రివీల్ చేశారు. హీరో ధనుష్ వల్లే నయన్ తో నాకు పరిచయం ఏర్పడింది అని తెలిపారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 15 2023, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నయన్ నటిస్తోంది.   

 

26

చాలా కాలం పాటు సహజీవనం చేసిన నయన్, విగ్నేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. నయనతార ఏమో లేడీ సూపర్ స్టార్.. విగ్నేష్ శివన్ దర్శకుడిగా కొన్ని చిత్రాలు చేశారు. విగ్నేష్ కి ఇంకా దర్శకుడిగా పూర్తి స్థాయి గుర్తింపు లభించలేదు. నయన్, విగ్నేష్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది చాలా మందికి తెలియదు. 

 

36
Nayanthara

Nayanthara

విగ్నేష్ శివన్ ఇన్నేళ్ల తర్వాత తాజాగా తన లవ్ స్టోరీ రివీల్ చేశారు. హీరో ధనుష్ వల్లే నయన్ తో నాకు పరిచయం ఏర్పడింది అని తెలిపారు. పోడాపోడీ చిత్రం పరాజయంతో నన్ను నేను నిరూపించుకోలనుకున్నా. కెరీర్ పరంగా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అప్పుడే 'నేనూ రౌడీనే' అనే చిత్ర కథ రాశా. 

46

నా దగ్గర ఓ కథ ఉందని తెలుసుకున్న హీరో ధనుష్..దానిని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. నయనతారని కలసి కథ చెప్పమని చెప్పారు. కానీ నయనతార ఈ చిత్రానికి అంగీకరిస్తుంది అని నేను అనుకోలేదు. అందుకే నజ్రియాకి ఈ కథ చెబుదాం అనుకున్నా. కానీ ధనుష్ కోసం నయనతారని వెళ్లి కలిశాను. 

56

ఆమె నన్ను ఎంతో గౌరవంగా రిసీవ్ చేసుకుంది. ఆ కథకి కూడా ఓకె చెప్పింది. ఆ క్షణమే ఆమె ప్రేమలో పడ్డా. షూటింగ్ సెట్స్ లో కొన్ని రోజులపాటు నయనతారని మేడం మేడం అంటూ పిలిచేవాడిని. ఆమె క్యారవ్యాన్ లోకి వెళ్లాలన్నా భయపడేవానిని. కానీ కొన్ని రోజుల తర్వాత మేమిద్దరం డేటింగ్ మొదలు పెట్టాం. అప్పటికి సెట్స్ లో నయన్ ని మేడం అనే పిలిచాను. దీనితో మేమిద్దరం ప్రేమించుకుంటున్న విషయం ఎవరికీ తెలిసేది కాదు. 

66

నాకు, నయన్ కి సింపుల్ గా ఉండడం అంటేనే ఇష్టం. ఇటీవల తిరుచ్చిలో మా పిల్లల కోసం పూజలు కూడా చేశాం. తిరిగి వెళ్లే సమయం ఆలస్యం అవుతుందని పిల్లలని అక్కడకి తీసుకెళ్లలేదు. మేము విమానం కోసం ఎదురుచూడకుండా ట్రైన్ లో తిరిగి వచ్చినట్లు విగ్నేష్ తెలిపారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోని చెప్పుతో కొడతానన్న దీప-శ్రీధర్ అనుమానం-కార్తీక్ కొత్త ప్లాన్
Recommended image2
Thalapathy Vijay: గెలుపు తర్వాత విజయ్ ఫస్ట్ రియాక్షన్! మోదీ, రాహుల్ కు దళపతి కౌంటర్ ?
Recommended image3
10 కోట్లు లోన్ తీసుకుని 100 కోట్లు సంపాదించిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎలా సాధ్యం అయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved