నయనతారలో మరో కోణాన్ని బయట పెట్టిన విఘ్నేష్ శివన్, తన కోసంత్యాగం చేసిందట
మరోసారి నయనతారను పొగడ్తలతో ముంచెత్తాడు ఆమె భర్త విఘ్నేష్ శివన్. ఆమె ఒక అద్భుతమన్నట్టు ఆకాశానికెత్తేశాడు. చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన ఈ జంట రీసెంట్ గా పెళ్ళి బంధంతో ఒక్కటయ్యింది. దీనికి సంబంధించిన ఓ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశారు.

దాదాపు అయిదారు సంవత్సరాలు ప్రేమలో మునిగి తేలారు నయనతార-విఘ్నేష్ శివన్. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ 9న పెళ్లి బంధంతో వీరు ఒక్కటయ్యారు. ఈ పెళ్ళికి తమిళ సినీ పరిశ్రమకు చెందిన తారలే కాకుండా..బాలీవుడ్ స్టార్స్ కూడా హాజరయ్యి సందడిచేశారు. ఈ వేడుకంతా తమిళదర్శకుడు గౌతమ్ మీనన్ ఆద్వర్యంలో జరిగినట్టు తెలుస్తోంది.
అయితే నయనతార - విఘ్నేష్ ల పెళ్లి కి సంబంధించిన వీడియోను గౌతమ్ మీనన్ ఆద్వర్యంలో.. స్పెషల్ గా తీశారు. ఈ ఈవెంట్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో.. డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఈ పెళ్లి ఈవెంట్ కు సబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు టీమ్. ఈ ప్రోమో విష్నేష్ నయన్ లోని మరో కోణాన్ని బయట పెట్టాడు.
నయనతారను పొగడటం విఘ్నేష్ శివన్ కు కొత్తేం కాదు.. చాలా సందర్భాల్లో ఆమెను ఆకాశానికంటేలా... పొగడ్తలతో ముంచి తేల్చాడు. ఇక ఇప్పుడు మరోసారి నయన్ ను పొడగమే పనిగా పెట్టుకున్నట్టు వెడ్డింగ్ ప్రమోలో కనిపిస్తోంది. నయనతార అందరికి లేడీ సూపర్ స్టార్ గానే తెలిసు. కాని తను పర్సనల్ గా ఏంటో చాలా మందికి తెలియదు అంటూ వీడియోలో విఘ్నేష్ మాట్లాడాడు.
తన కోసం ఎన్నో వదిలేసుకుని.. తన కోసం ఎన్నో మార్చుకున్న బంగారం .. మై డియర్ నయనతార అంటూ విష్నేష్ ప్రోమోలో తెలిపారు. అంతే కాదు ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. అంచలంచెలుగా.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుందంటూ విఘ్నేష్క తెలిపారు.
ఇక వీరి పెళ్ళికి సంబంధించిన స్పెషల్ వీడియో త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుంతం ఈవెంట్ కు సబంధించిన ప్రోమో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. త్వరలో ఫుల్ వీడియో కోసం నయన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.