విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? బాలయ్యకు షాక్ ఇచ్చిన స్టార్ హీరో
64 ఏళ్ళ వయస్సులో కూడా వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. దూసుకుపోతున్నాడు దగ్గుబాటి హీరో. ఇన్నేళ్ల కెరీర్ లో ఆయనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? వెంకీ ఏం చెప్పారంటే..?
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతికే సందడి చేయబోతున్నాడు విక్టరీ స్టార్ వెంకటేష్. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇకఈమూవీలోంచి రిలీజ్ అయిన గొదావరి సాంగ్ కు కూడా భారీగా స్పందన వస్తోంది. రీల్స్ లో ఎక్కడ చూసినా.. ఈ పాటే మోగుతోంది. ఈక్రమంలో ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు మూవీ టీమ్.
ఇక వెంకటేష్ జోడీగా ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్ నటించింది. ఇక ఈ సినిమా కోసం విక్టరీ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగాఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ బాలయ్య షోకు అతిథిగా వెళ్ళారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈక్రమంలో చాలామంది స్టార్స్ ఈ షోలో సందడిచేశారు. ఇక సంక్రాంతి సంందర్భంగా బాలయ్యతో కలిసి అభిమానులకు కన్నుల పండుగ చేయబోతున్నారు వెంకటేష్.
అన్ స్టాపబుల్ షోలో వెంకటేష్ హడావిడిచేసిన ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. ఈసందర్భంగా బాలయ్య చాలా ప్రశ్నలు అడిగారు వెంకీని. తమ కెరీర్ బిగినింగ్ లో విషయాలు కూడా మాట్లాడుకున్నారు ఇద్దరు హీరోలు. ఇక కొన్ని పర్సనల్ ప్రోఫిషినల్ విషయాలపై కూడా చర్చ జరిగింది. ఈక్రమంలోనే వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అన్న విషయం చర్చకు వచ్చింది. బాలయ్య మాట్లాడుతూ.. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ? అని అడిగారు.
క్రికెట్ ను అమితంగా ఇష్టపడే వెంకీ.. తనకు క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచిన్, ధోనీని కలిసిన సందర్భం మర్చిపోలేనిదన్నారు వెంకటేష్. ఇక ఈ ఎపిసోడ్ ఈరోజు అనగా డిసెంబర్ 27న ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా సందడి చేయబోతోంది.
ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. వెంకటేష్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు నా భార్య నీరజ. తన వల్ల నాకు వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం రాలేదు. ఏమాత్రం సమయం దొరికినా తన భార్యతో కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఇద్దరం కలిసి టూర్స్ వెళ్తాం. ఆమెతో కలిసి అప్పుడప్పుడు వంట చేయడం నాకు చాలా ఇష్టం అన్నారు. అంతే కాదు తన అభిరుచుల గురించి కూడా కాస్త వివరంగా చెప్పారు వెంకటేష్.