అలీ మూవీని రీమేక్ చేసి బాలీవుడ్ లో పరువు పోగొట్టుకున్న వెంకటేష్.. ఆయన చేసుంటే మాత్రం బ్లాక్ బస్టర్ పక్కా
విక్టరీ వెంకటేష్ ఇప్పటికీ టాలీవుడ్ లో రాణిస్తున్న సీనియర్ హీరో. వెంకటేష్ 'కలియుగ పాండవులు' చిత్రంతో తన కెరీర్ ని ప్రారంభించారు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకీ ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు.
విక్టరీ వెంకటేష్ ఇప్పటికీ టాలీవుడ్ లో రాణిస్తున్న సీనియర్ హీరో. వెంకటేష్ 'కలియుగ పాండవులు' చిత్రంతో తన కెరీర్ ని ప్రారంభించారు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకీ ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించారు. చిరంజీవి, నాగార్జున తరహాలోనే వెంకటేష్ కూడా బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.
Yamaleela
అప్పట్లో తెలుగు హీరోలకి బాలీవుడ్ లో కలసి వచ్చేది కాదు. వెంకటేష్ విషయంలో కూడా అదే జరిగింది. వెంకటేష్ తన బ్లాక్ బస్టర్ చంటి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. హిందీలో అనారి అనే టైటిల్ తో రీమేక్ చేశారు. తెలుగులో మీనా హీరోయిన్ అయితే హిడిలో కరిష్మా కపూర్ నటించింది. కానీ తెలుగులో లాగా హిందీలో ఈ చిత్రం సూపర్ హిట్ కాలేదు. పర్వాలేదనిపించింది అంతే.
ఆ తర్వాత మరోసారి వెంకటేష్ హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సారి వెంకీ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడు. దీనితో హిందీలో పరువు పోయింది. అంతటి దారుణమైన డిజాస్టర్ ఎదురైంది. ఆ చిత్రం ఇంకేదో కాదు 'తక్దీర్ వాలా'. ఈ మూవీ కమెడియన్ అలీ నటించిన చిత్రానికి రీమేక్ అని తెలుసా ? అవును అలీ కెరీర్ లో మెమొరబుల్ హిట్ గా నిలిచిన యమలీల చిత్రాన్ని వెంకటేష్ హిందీలో తక్దీర్ వాలాగా రీమేక్ చేశారు. అలీకి సూపర్ హిట్ ఇచ్చిన చిత్రాన్ని రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు వెంకీ.
వెంకటేష్ తండ్రి రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వచించారు. హిందీలో మాత్రం మురళి మోహనరావు దర్శకత్వంలో తెరకెక్కింది. కానీ కృష్ణారెడ్డి తరహాలో ఆయన మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయారు. ఈ మూవీలో వెంకటేష్ సరసన రవీనా టాండన్ హీరోయిన్ గా నటించింది. యమలీల చిత్రంలో అత్యంత కీలకమైన యమధర్మరాజు పాత్రని కైకాల సత్యనారాయణ పోషించారు. అలాంటి పాత్రల్లో మెప్పించడం కైకాలకి వెన్నతో పెట్టిన విద్య. యముడి పాత్రలో కైకాల అదరగొట్టేశారు.
కానీ హిందీలో ఈ పాత్రని కేడర్ ఖాన్ పోషించారు. అసలు తప్పు ఇక్కడే జరిగింది. యముడి పాత్రలో ఆయన ఏమాత్రం మెప్పించలేకపోయారు. యముడి పాత్రలో కైకాల తరహాలో మెప్పించడం ఎవ్వరి వల్లా కాదు అని ఆ చిత్రంతో మరోసారి నిరూపితం అయింది. వెంకటేష్ తన కెరీర్ లో చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్స్ లో తక్దీర్ వాలా చిత్రం ఒకటి అని చెప్పొచ్చు. ఈ మూవీ తర్వాత వెంకీ ఇక హిందీ చిత్రాల జోలికి వెళ్ళలేదు. అప్పుడప్పడూ కామియో రోల్స్ లో మాత్రం కనిపిస్తున్నారు.