మీ నాన్న నిర్మాత కాబట్టే అవకాశాలు, స్టార్ హీరోని డైరెక్ట్ గా అడిగేసిన యాంకర్..ఎలా సమాధానం ఇచ్చాడో తెలుసా
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చి చాలా మంది హీరోలుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో నెపోటిజం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. నెపోటిజం వల్ల చాలా మంది ట్యాలెంటెడ్ యువతకి అవకాశాలు రావడం లేదని కొందరు విమర్శిస్తుంటారు.
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చి చాలా మంది హీరోలుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో నెపోటిజం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. నెపోటిజం వల్ల చాలా మంది ట్యాలెంటెడ్ యువతకి అవకాశాలు రావడం లేదని కొందరు విమర్శిస్తుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ అయితే నెపోటిజం అనేది తప్పు కాదు అంటూ బహిరంగంగా మద్దతు తెలిపారు. వాళ్ళ తల్లి దండ్రుల కష్టం వల్ల వాళ్ళ పిల్లలకు అవకాశాలు వస్తున్నాయి అందులో తప్పేముంది అని రకుల్ ఒక సందర్భంలో తెలిపింది.
సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరోకి ఏదో ఒక సందర్భంలో నెపోటిజం గురించి ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. విక్టరీ వెంకటేష్ కూడా చాలా ఏళ్ళ క్రితమే ఇలాంటి ప్రశ్న ఎదుర్కొన్నారు. వెంకటేష్ కి హీరోగా మంచి గుర్తింపు వచ్చాక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
victory venkatesh
వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఆయన్ని నేరుగా ఒక ప్రశ్న అడిగింది. మీరు ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు ? మీ నాన్న నిర్మాత కాబట్టి హీరోగా సులభంగా అవకాశాలు వస్తాయి అని వచ్చారా అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు వెంకటేష్ చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు.
నాకు సినిమాల్లో నటించాలి అనే కోరిక ముందుగా లేదు. డిగ్రీ చేయాలి చదువుకోవాలి అనుకునేవాడిని. నా చుదువు పూర్తయ్యే వరకు నానా వృత్తిని ఎంచుకోలేదు. బహుశా దేవుడు రాసిన రాత ఏమో.. అనుకోకుండా హీరో అయ్యాను. మా నాన్న నిర్మాత కాబట్టి నేను సినిమాల్లోకి రాలేదు. అది అలా జరిగిపోయింది అని వెంకటేష్ తెలిపారు. చంటి చిత్ర షూటింగ్ జరిగే సమయంలో వెంకటేష్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇతర హీరోల నుంచి పోటీని తట్టుకోవడం కోసం మీరు ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు అని యాంకర్ ప్రశ్నించింది. సినిమా కూడా ఒక వ్యాపారం. ఎలాంటి వ్యాపారంలో అయినా రాణించాలంటే క్రమశిక్షణ, హార్డ్ వర్క్ తప్పనిసరి.. నేను కూడా అదే ఫాలో అవుతున్నా అని వెంకటేష్ తెలిపారు.