గోల్డెన్ టెంపుల్ లో విక్కీ కౌశల్, రష్మిక మందన్న.. భక్తి శ్రద్దలతో 'ఛావా' జోడి
Vicky Kaushal and Rashmika Mandanna: విక్కీ కౌశల్, రష్మిక మందన్న తమ సినిమా 'ఛావా' విడుదలకు ముందు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో దర్శనం చేసుకున్నారు. విక్కీ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Vicky Kaushal, Rashmika Mandanna
Vicky Kaushal and Rashmika Mandanna: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రస్తుతం తమ రాబోయే చిత్రం 'ఛావా' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.
Vicky Kaushal, Rashmika Mandanna
'ఛావా' విడుదలకు ముందు విక్కీ, రష్మిక అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి చేరుకున్నారు.గోల్డెన్ టెంపుల్ లో భక్తి శ్రద్దలతో కనిపించిన వీరిద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Vicky Kaushal, Rashmika Mandanna
ఈ సందర్భంగా విక్కీ తెల్ల చికెన్ కుర్తాలో, రష్మిక పింక్ సూట్‌లో కనిపించారు.ఈ చిత్రంపై రష్మిక చాలా ఆశలు పెట్టుకుని ఉంది. ఈ మూవీ సక్సెస్ అయితే రష్మిక బాలీవుడ్ లో కూడా పాగా వేసినట్లే.
Vicky Kaushal, Rashmika Mandanna
ఈ ఫోటోలను షేర్ చేస్తూ విక్కీ, 'శ్రీ హర్మందిర్ సాహిబ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. ప్రశాంతత, దైవత్వం, ప్రార్థన శక్తి. మేము 'ఛావా'ను ప్రపంచానికి అందిస్తున్నాం.'
Vicky Kaushal, Rashmika Mandanna
'ఈ పవిత్ర స్థలం ప్రేరేపించే శక్తి, భక్తిలో కొంత భాగాన్నైనా ఇది ప్రతిబింబిస్తుందని నేను ఆశిస్తున్నాను. రబ్ మెహర్ బక్షే' అని విక్కీ రాసుకొచ్చారు.