MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరో తాగొచ్చి లైంగిక వేధింపులు, ఆ తెలుగు స్టార్ గురించేనా?

హీరో తాగొచ్చి లైంగిక వేధింపులు, ఆ తెలుగు స్టార్ గురించేనా?

 తాగొచ్చి నా రూమ్ ముందు ప్ర‌తిరోజు గొడ‌వ చేసేవాడు. అత‌డి బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి రోజుకో రూమ్ మార్చా. 

2 Min read
Author : Surya Prakash
| Updated : Nov 22 2023, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Vichithra

Vichithra

తమిళ సీనియ‌ర్ న‌టి విచిత్ర ఓ  స్టార్ హీరోపై చేసిన కౌస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. షూటింగ్ కోసం వెళ్లిన క‌నీసం పేరు కూడా ఆడ‌గ‌కుండానే ఓ స్టార్ హీరో త‌న‌ను రూమ్‌కు ర‌మ్మ‌న్నాడ‌ని, అత‌డి ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించినందుకు త‌న కెరీర్‌ను నాశ‌నం చేశాడ‌ని విచిత్ర ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ త‌మిళ్ సీజ‌న్ 7లో ఓ కంటెస్టెంట్‌గా విచిత్ర కొన‌సాగుతోంది. బిగ్‌బాస్ షోలో భాగంగా త‌న కెరీర్‌లో ఎదురైన చేదు అనుభ‌వాల‌ను హౌజ్‌మేట్స్‌తో పంచుకున్న‌ది.ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏ హీరో అలా అన్నాడు? ఏ సినిమా సెట్‌లో ఇది జరిగింది? అంటూ ఇలా ఆరాలు తీస్తున్నారు.  ఆమె వీడియోలో ఏం చెప్పిందో చూద్దాం... అప్పుడు ఆ హీరో ఎవరో ఊహిద్దాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Jovika and Vichithra

Jovika and Vichithra


విచిత్ర మాట్లాడుతూ...ఇది ఇరవై, 23 ఏళ్ల క్రితం జరిగింది..అంటే 2000 లో ... నాకు ఓ సినిమా ఆఫర్ వచ్చింది.. ఆ హీరో, ఆ సినిమా వివరాలు చెప్పదల్చుకోవడం లేదు.. కేరళలో షూటింగ్.. అక్కడే హీటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్న  నా భర్తను కూడా కలిశాను.. అక్కడే నాకు దారుణమైన అనుభవం ఎదురైంది.. 
 

38


అంత దారుణమైన క్యాస్టింగ్ కౌచ్ ఘటన నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు.. నా పెళ్లి జరగడంతోనే సినిమాలకు దూరం అయ్యాను అని అనుకున్నారు. కానీ అసలు విషయం అది కాదు.. ఈ క్యాస్టింగ్ కౌచ్  ఘటన తరువాతే సినిమాలు మానేశాను..

48


2000 సంవ‌త్స‌రంలో ఓ సినిమా షూటింగ్ కోసం ఫారెస్ట్ ఏరియా వెళ్లాం. అక్క‌డ మాకు త్రీ స్టార్ హోట‌ల్‌లో విడిది ఏర్పాటుచేశారు. న‌టీన‌టుల కోసం ఏర్పాటుచేసిన పార్టీలో ఆ సినిమా హీరోను క‌లిశాను. అత‌డు నా పేరు కూడా అడ‌కుండా రాత్రికి రూమ్‌కు వ‌చ్చేయ‌మ‌ని అన్నాడు.

58

రోజుకో రూమ్ మార్చాల్సి వచ్చింది


ఆ హీరో అలా అనటం చూసి  షాక‌య్యాను. అత‌ని  ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రినందుకు మ‌రుస‌టి రోజు నుంచి నాకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. తాగొచ్చి నా రూమ్ ముందు ప్ర‌తిరోజు గొడ‌వ చేసేవాడు. అత‌డి బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి రోజుకో రూమ్ మార్చా. 

68

ఆ స‌మ‌యంలో నాకు హోట‌ల్ మేనేజ‌ర్ చాలా హెల్ప్ చేశాడు. అత‌డినే పెళ్లి చేసుకున్నా. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పా అని విచిత్ర తెలిపింది.  ఆ ఘటనను, నా మనసుకు తగిలిన గాయాన్ని మరిచిపోవాలని అనుకున్నాను. కానీ ఇంకా ఆ గాయం తాలుకు బాధ నన్ను వెంటాడుతూనే ఉంటోంది. మమ్మల్ని ఆప్పుడు ఓ త్రీ స్టార్ హోటల్‌లో పెట్టాడు.

78


అలాంటి ఘటన నాకు ఎప్పుడూ కూడా తమిళ సినిమా సెట్లలో జరగలేదు.. ఆ సినిమా కోసం పని చేసే వ్యక్తి ఒకడు ప్రతీ రోజూ నా రూమ్ డోర్ కొట్టేవాడు.. నా రూమ్‌కి ఫోన్లు వచ్చేవి.. ఇదంతా గమనించిన హోటల్ మేనేజర్ నాకు సాయం చేశాడు. సినిమా టీంకు తెలియకుండా రూం మార్చేవారు.. అది తెలియక రోజూ వచ్చిడోర్ కొట్టేవారు..లోపలే నేను ఉన్నానని అనుకునేవారు. ఇలా ఒక రోజు సెట్‌లో ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. బై మిస్టేక్ అలా చేస్తున్నాడేమో అని వదిలేశాడు. మళ్లీ రెండో టేక్‌లోనూ అలానే చేశాడు.

88


ఓ టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో గురించే ఈ కామెంట్స్ చేసిన‌ట్లు తమిళంలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది ఫలానా హీరోనే చేసాడంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ హీరో పేరు ఆమె ఫలానా అని ప్రస్తావించనప్పుడు ఎవరూ కన్ఫర్మ్ చేసి చెప్పలేరనేది నిజం.  దాంతో ఆమె తెలుగులో చేసిన సినిమాలు ఏమిటా అని వెతుకుతున్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved