పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లికి టైం ఫిక్స్... సంచలనంగా వేణు స్వామి కామెంట్స్!
పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు వేణు స్వామి. ఆయనకు నాలుగో వివాహం తప్పదని బాంబు పేల్చాడు. అది ఎప్పుడు జరుగుతుందో కూడా వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం మరో వివాహం చేసుకుంటాడని చెప్పాడు.

వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. ఈ సెలెబ్రిటీ జ్యోతిష్యుడు తరచుగా ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. హీరోలు, హీరోయిన్స్, చిత్ర ప్రముఖుల జాతకాలు అంచనా వేస్తూ ఉంటారు. వేణు స్వామికి టాలీవుడ్ తో అనుబంధం ఉంది. హీరోయిన్స్, హీరోలు ఆయన చేత ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు.
వేణు స్వామితో పూజలు చేయిస్తే సక్సెస్ దక్కుతుందని భావిస్తారు. హీరోయిన్ రష్మిక మందాన వేణు స్వామికి గొప్ప శిష్యురాలు. ప్రతి ఏడాది తప్పకుండా ఆయనతో పూజలు చేయిస్తుంది. డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ కూడా ఆయనతో పూజలు చేయించారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నాలుగో వివాహం చేసుకుంటారని వేణు స్వామి బాంబు పేల్చారు. ఆయన జాతకం ప్రకారం మరోసారి వివాహం తప్పదు అన్నారు. అది కూడా 2024లో అంటున్నారు. పెళ్లి అనేది ఆయన వ్యక్తిగత జీవితంలో భాగం. జాతక ప్రకారం ఈ ఏడాది చివర్లో నాలుగో పెళ్లి చేసుకుంటాడని వేణు స్వామి అంచనా వేశాడు.
అలాగే ఏపీ సీఎం ఎవరో కూడా ఆయన జాతకరీత్యా వెల్లడించారు. 2024లో వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతాడని వేణు స్వామి అంచనా వేశారు. జగన్ జాతకం ప్రకారం 2023 నుండి అష్టమాన శని ఉంది. కాబట్టి ఆయనకు మరోసారి సీఎం అయ్యే యోగం ఉందని అన్నారు.
నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సీఎం అయ్యే అవకాశం లేదన్నారు. వీరిద్దరి జాతకాలు బాగోలేదు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాఢ నక్షత్రం. కాబట్టి 2024లో వీరిద్దరిలో ఎవరు కూడా సీఎం అయ్యే ఛాన్స్ లేదని వేణు స్వామి అంచనా వేశారు. వేణు స్వామి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.