- Home
- Entertainment
- అప్పుడే చెప్పా, నన్ను ఏసుకున్నారు కదరా..సలార్ నష్టాలపై వేణు స్వామి రెచ్చగొట్టే కామెంట్స్
అప్పుడే చెప్పా, నన్ను ఏసుకున్నారు కదరా..సలార్ నష్టాలపై వేణు స్వామి రెచ్చగొట్టే కామెంట్స్
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

Venu Swamy
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది.
ఆయన బాగా పాపులర్ అవుతుండడంతో సెలెబ్రిటీలు కూడా వేణు స్వామి వెంట పడుతున్నారు. ఆయన దగ్గర తమ జాతకాలు చెప్పించుకోవడం, దోషాలు ఏమైనా ఉంటే పరిహారం చేయించుకోవడం చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎంత బడా స్టార్ జాతకం అయినా వేణు స్వామి ఇట్టే చెప్పేస్తారు.
డింపుల్ హయతి, నిధి అగర్వాల్, అషురెడ్డి లాంటి ముద్దుగుమ్మలు వేణు స్వామి దగ్గర పూజలు, హోమాలు చేశారు. అయితే వేణు స్వామి ఎంతటి బడా సెలెబ్రిటీల గురించి అయిన తనకి అనిపించిన విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్, పవన్ కళ్యాణ్ ఇలా సెలెబ్రిటీల జాతకాలని ఆయన తరచుగా చెబుతుంటారు.
ముఖ్యంగా ప్రభాస్ గురించి ఆయన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాము. ప్రభాస్ పెళ్లి చేసుకోడు అని కూడా వేణు స్వామి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సలార్ చిత్రం రిలీజ్ కి ముందు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. సలార్ చిత్రం ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి జోస్యం చెప్పారు. ప్రభాస్ కెరీర్ బాహుబలి చిత్రంతోనే పీక్ కి చేరింది.
బాహుబలి స్థాయికి ఇక ప్రభాస్ చేరుకోలేడు. ఇక కెరీర్ డౌన్ ఫాల్ అవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ సలార్ చిత్రం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని మాసీ గా చూపించి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. దీనితో సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ అని అనుకున్నారు.దీనితో వేణు స్వామిని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. జాతకం పేరుతో ఇష్టం వచ్చినట్లు వాగావ్ కదా.. సలార్ బ్లాక్ బస్టర్ అయింది చూడు అంటూ ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేశారు.
అయితే సలార్ బిజినెస్ లెక్కలు ఒక్క ఒక్కటి బయట పడేకొద్దీ కలెక్షన్ల వివరాలు కూడా బయట పడ్డాయి. సలార్ చిత్రంతో ఫ్యాన్స్ హ్యాపీ కానీ.. వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. నార్త్ ఇండియా, నైజాం ఏరియా తప్ప మిగిలిన చోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. బయ్యర్ల నష్టాలని నిర్మాతలు సెట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
దీనితో వేణు స్వామి మరోసారి సలార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. సలార్ మూవీ ఫ్లాప్ అని నేను అప్పుడే చెప్పా.. కానీ నన్ను కిందా మీదా ఏసుకున్నారు కదరా.. ఇప్పుడేమైంది అంటూ ఒక సెటైరికల్ పోస్ట్ చేశారు. సలార్ నష్టాలని గుర్తు చేస్తూ వేణు స్వామి ఈ పోస్ట్ పెట్టారు.