2023 ప్రభాస్ కు ఇబ్బందులు తప్పవా..? వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
సెలబ్రిటీల జాతకాలు చెపుతూ.. వాళ్లకంటే ఫేమస్ అయ్యాడు వేణూ స్వామి. ముఖ్యంగా స్టార్ జంటల పెళ్లిళ్ళు విడాకుల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ.. వస్తున్న వేణూ స్వామి కొత్త సంవత్సరం ప్రభాస్ జాతకం ఎలా ఉంటుందో చెప్పేశాడు.
Venu swamy prabhas
సమంత- నాగ చైతన్య విడాకుల దగ్గర నుంచి.. రాంచరణ్ – ఉపాసన లు లేట్ గా తల్లిదండ్రులు అవుతారన్న విషయం వరకూ.. సెలబ్రిటీల జాతకాలు విప్పే స్వామిగా వేణు స్వామికి సెలబ్రిటీలను మించిన పేరు సంపాదించాడువేణు స్వామి. ఇక కొత్త సంవత్సరం వస్తుండటంతో.. ఆఞన ఎవరి జాతకం విప్పుతాడా అని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో.. ప్రభాస్ గురించి సంచలన విషయాలు వెల్లడించాడు వేణు స్వామి.
అని ఇతను చెప్పాడు. అవి నిజమయ్యాయి. చాలా మంది విషయంలో వేణు స్వామి జాతకం నిజం అయ్యింది కాబట్టి ..చాలా మందికి వేణు స్వామి అంటే గురి ఎక్కువ. ఇతను చెప్పాడు అంటే ఇది అక్షర సత్యం అని కొంతమంది ఫిక్స్ అయిపోయారు. ఇక తాజాగా ఇతను ప్రభాస్ జాతకం చెప్పాడు. 2023 లో ప్రభాస్ జాతకం ఎలా ఉంటుందో వివరించాడు.
Prabhas
ఇంకా రెండు రోజుల్లో 2023 రాబోతోంది. కొత్త సంవత్సరం ప్రభాస్ కు చాలా వరస్ట్ గా ఉందని చెప్పి షాకిచ్చాడు వేణు స్వామి. అంతే కాదు ప్రభాస్ జీవితంలో కొత్త ఏడాది చాలా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయట. సినిమాల పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడని సంచలనం సృష్టిచాడు వేణుస్వామి.
Unstoppable With Prabhas
వేణు స్వామి మాట్లాడుతూ.. ప్రభాస్ జాతకాలను నమ్మడు. అందుకే అతను జాతకాల పై తీసిన సినిమా రాధే శ్యామ్ కూడా ప్లాప్ అయ్యింది. ప్రభాస్ రాజుల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆ కమ్యూనిటీ వారు అందరూ జాతకాలు నమ్ముతారు గౌరవిస్తారు. కానీ ప్రభాస్ గౌరవించడు అన్నారు.
అంతే కాదు ప్రభాస్ ది వృశ్చిక రాశి కావడంతో ఆయన జాతకంలో శని, గురువు మారుతూ ఉన్నారు. కాబట్టి ప్రభాస్ అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నారు వేణు స్వామి. ఆరోగ్యపరంగా, పెళ్లి విషయాల పరంగా, సినిమాల పరంగా అతను చాలా సమస్యలు ఎదుర్కొంటాడంటూ సంచలన వ్యాఖ్యులు చేశారు.
ఇక ప్రభాస్ కు బాహుబలి తరువాత సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. సాహో, రాధేశ్యామ్ ప్లాప్ అవ్వడంతో తీవ్ర నిరాశలోకి వెళ్ళాడు ప్రభాస్. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్ అప్ చేస్తున్నాడు స్టార్ హీరో.
ప్రభాస్ ఆదిపురుష్ తో పాటు సలార్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక నాగ్ అశ్విన్ తో చేస్తున్న ప్రాజక్ట్ కె తో పాటు.. మారుతి రాజా డీలక్స్ షూటింగ్ లో ఉన్నాయి. సందీప్ వంగాతో ఫిక్స్ అయిన స్పిరిట్ అప్ డేట్ తెలియాల్సి ఉంది.