- Home
- Entertainment
- అది నోరా తాటిమట్టా.. 'ఆదిపురుష్' విషయంలో మరోసారి నిజమైన వేణు స్వామి జ్యోతిష్యం.. రాజమౌళి తీస్తేనే అంటూ
అది నోరా తాటిమట్టా.. 'ఆదిపురుష్' విషయంలో మరోసారి నిజమైన వేణు స్వామి జ్యోతిష్యం.. రాజమౌళి తీస్తేనే అంటూ
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రామాయణం ఆధారంగా ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నాడు అనగానే ఎక్కడలేని హైప్ వచ్చింది. అప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 'తానాజీ' అనే పీరియాడిక్ చిత్రంతో హిట్ కొట్టి జోరుమీద ఉన్నాడు. దీనితో రామాయణాన్ని అద్భుతంగా దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తాడని సినీ విశ్లేషకులు, ఆడియన్స్ ఆశించారు. నిన్ననే శుక్రవారం రోజు ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.
అభిమానుల ఆశలన్నీ నీరుగారిపోయాయి. కార్టూన్ గ్రాఫిక్స్ చిత్రం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ జరుగుతోంది. దర్శకుడు ఓం రౌత్ మన సంస్కృతిని పక్కన పెట్టి హర్రర్ మూవీలా రామాయణాన్ని మార్చేసినట్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ తో మాత్రమే ప్రస్తుతం ఈ చిత్రానికి కలెక్షన్స్ వస్తున్నాయి.
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది.
ఇటీవల కొన్ని రోజుల క్రితం వేణు స్వామి ఆదిపురుష్ చిత్రంపై చెప్పిన జ్యోస్యం నిజమైంది. ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. ఆదిపురుష్ చిత్రంపై ఎవరూ అంచనాలు ఎక్కువగా పెట్టుకోవద్దు అని అలా అయితే నిరాశ తప్పదు అని అన్నారు. ఆదిపురుష్ చిత్రం జస్ట్ యావరేజ్ గానే ఉండబోతోంది. ఆడియన్స్ అంచనాలు అందుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ జాతకం ఆశాజనకంగా లేదు అని వేణు స్వామి అన్నారు.
ఇలాంటి చిత్రాలు తెరకెక్కించాలంటే రాజమౌళికి మాత్రమే సాధ్యం అని వేణు స్వామి అన్నారు. ఆ మధ్యన సమంత నటించిన 'శాకుంతలం' రిజల్ట్ ఏంటో చూశాం. అదే చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించి ఉంటే తప్పకుండా ఆస్కార్ వచ్చి ఉండేది అని వేణు స్వామి అన్నారు.
Prabhas
ఆదిపురుష్ విషయంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు నిజమయ్యాయి. రామాయణ గాధని అద్భుతంగా తెరకెక్కిస్తాడనుకున్న ఓం రౌత్ మోడ్రనైజ్ చేయాలనే రాంగ్ వేలివ్ వెళ్లి బోల్తా పడ్డారు. వేణు స్వామి కామెంట్స్ పై ప్రభాస్ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అది నోరా తాటిమట్టా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.