- Home
- Entertainment
- కొత్త సంవత్సరంలో ప్రభాస్ పెళ్లి ? కుండ బద్దలు కొట్టేసిన వేణు స్వామి.. అసలైన అడ్డంకి ఏంటో తెలుసా..
కొత్త సంవత్సరంలో ప్రభాస్ పెళ్లి ? కుండ బద్దలు కొట్టేసిన వేణు స్వామి.. అసలైన అడ్డంకి ఏంటో తెలుసా..
రెబల్ స్టార్ ప్రభాస్ 2023ని ఘనంగా ముగించాడు అనే చెప్పాలి. బాహుబలి తర్వాత ఊరిస్తూ వస్తున్న విజయం సలార్ తో దక్కింది. సలార్ చిత్రంతో ప్రభాస్ తన అభిమానులని సంతృప్తి పరిచాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ 2023ని ఘనంగా ముగించాడు అనే చెప్పాలి. బాహుబలి తర్వాత ఊరిస్తూ వస్తున్న విజయం సలార్ తో దక్కింది. సలార్ చిత్రంతో ప్రభాస్ తన అభిమానులని సంతృప్తి పరిచాడు. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అంచనాలన్నీ సలార్ తో నిలబడ్డాయి.
అయితే ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి 2023 లో క్వశ్చన్ మార్క్ అలాగే మిగిలిపోయింది. అదే పెళ్లి విషయం.. ఏళ్ళు గడుస్తున్నాయి కానీ ప్రభాస్ పెళ్లి వైపు మాత్రం మొగ్గు చూపడం లేదు. అప్పుడప్పుడూ ప్రభాస్ పెళ్లి గురించి రూమర్స్ రావడం చూస్తూనే ఉన్నాము. ఇదిగో అదిగో అనడం తప్ప ఎలాంటి గుడ్ న్యూస్ రావడం లేదు.
ప్రబస్ ఏమో సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తూ బిజీ అయిపోతున్నాడు. అయితే కొత్త సంవత్సరం 2024లో అయినా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 ఏళ్ళు. బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ లాగా ప్రభాస్ బ్రహ్మచారిగా ఉండిపోతాడేమో అని ఫ్యాన్స్ లో కాస్త కంగారు ఉంది.
అయితే ప్రభాస్ సినిమాల విషయంలో జాతకం చెప్పి విమర్శల పాలైన వేణు స్వామి తాజాగా పెళ్లి గురించి కూడా కామెంట్స్ చేశారు. ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. ప్రభాస్ కి పెళ్లి కాదని అలాగే ఉండిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ ఆరోగ్య సమస్యల గురించి కూడా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి ఆరోగ్య సమస్యలు కూడా ఒక కారణం అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వేణు స్వామి కూడా ప్రభాస్ ఆరోగ్యం గురించి మీకేం తెలుసురా వెధవల్లారా అంటూ ఇటీవల హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కి మునుపటిలా ఆరోగ్యం సహకరించడం లేదనే రూమర్స్ ఉన్నాయి. అందుకే చకచకా సినిమాలు చేస్తున్నాడట. ఇటీవల ప్రభాస్ కాలికి సర్జరీ కూడా జరిగింది.
వీలైనంత త్వరగా ఎక్కువ సినిమాలు చేసి కుదిరితే కొన్నేళ్లు రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలో కూడా ప్రభాస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణం రాజు ఉన్నప్పుడు ప్రభాస్ ని పెళ్లికి ఒప్పించే ప్రయత్నాలు కాస్త జరిగాయి. బాహుబలి పేరు చెప్పి ప్రభాస్ కొంతకాలం తప్పించుకున్నాడు.
ఇప్పుడు ఆయన లేరు.. ఇక ప్రభాస్ పెళ్లి బాధ్యత ఎవరు తీసుకుంటారు ? ఎవరైనా చెబితే ప్రభాస్ వింటాడా అనేది కూడా డౌటే. బాహుబలి తర్వాత ప్రభాస్ కి కెరీర్ ఉండదు అని వేణు స్వామి చెప్పారు. అది తప్పు అని సలార్ చిత్రంతో నిరూపించాడు. అదే విధంగా ప్రభాస్ కి పెళ్లి యోగం లేదని కూడా అన్నారు. 2024 కొత్త సంవత్సరంలో ప్రభాస్ ఓ ఇంటివాడై వేణు స్వామి జాతకం తప్పని మరోసారి నిరూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.