MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Venkatesh: చిరంజీవి, వెంకటేష్ మధ్య భారీ బాక్సాఫీస్ వార్, సంక్రాంతి పోరులో సీనియర్ హీరోలు

Venkatesh: చిరంజీవి, వెంకటేష్ మధ్య భారీ బాక్సాఫీస్ వార్, సంక్రాంతి పోరులో సీనియర్ హీరోలు

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా మారబోతోంది. ఈ సారి పొంగల్ కు పోటీ పడటానికి టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ హీరోలు రెడీ అవుతున్నారు. ఇద్దరికి సంక్రాంతి సక్సెస్ కొత్తేం కాదు. మరి చిరంజీవి, వెంకటేష్ లలో పై చేయి ఎవరిది.?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 19 2026, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంక్రాంతి సక్సెస్ హీరోలు..
Image Credit : Asianet News

సంక్రాంతి సక్సెస్ హీరోలు..

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ స్టార్ వెంకటేష్ ఇద్దరు సంక్రాంతి హీరోలే. ఈ సంక్రాంతికి ఇద్దరు బాక్సాఫీస్ వార్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చిరు,వెంకీ ఇద్దరు సంక్రాంతి హీరోలే . సంక్రాంతి సీజన్ లో ఇద్దరి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈమధ్య కాలంలో ఈ ఇద్దరు హీరోలు పొంగల్ విజేతలుగా నిలుస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో హిట్ కొట్టగా.. గత రెండు సంక్రాంతులకు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం , ఎఫ్ 2, ఎఫ3 లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేశారు. ఇక ఈసారి సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు హీరోలు పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సూపర్ ఫాస్ట్ గా చిరంజీవి సినిమా షూటింగ్
Image Credit : X

సూపర్ ఫాస్ట్ గా చిరంజీవి సినిమా షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మెగా 158. ఈమూవీ సెకండ్ షెడ్యూల్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో, భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాబీ షూటింగ్ ను సూపర్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తంది. ఈసినిమా నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు సమాచారం.ఇక ఈ మెగా 158 చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విడుదల సమయానికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

35
చిరంజీవి బర్త్ డేకి భారీ అప్ డేట్..?
Image Credit : instagram

చిరంజీవి బర్త్ డేకి భారీ అప్ డేట్..?

ఇప్పటివరకు మెగా 158 సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ పేరును అధికారికంగా ప్రకటించలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే రెండో షెడ్యూల్ పూర్తయ్యేలోపు హీరోయిన్‌ను అధికారికంగా ప్రకటించేందుకు కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని సమాచారం. అంతే కాదు షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుండటంతో... అగస్ట్ 22 చిరంజీవి బర్త్ డే నాటికి అదిరిపోయే అప్ డేట్ కూడా ఒకటి ఇవ్వాలని మూవీ టీమ్ భావిస్తున్నారట. ఈసినిమా రిలీజ్ సంక్రాంతికి కన్ ఫామ్ అయితే.. చిరుతో పోటీకి వెంకటేష్ కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం.

45
సంక్రాంతికి రెడీ అవుతున్న విక్టరీ వెంకటేష్
Image Credit : facebook.com/Venkateshdaggubatifans

సంక్రాంతికి రెడీ అవుతున్న విక్టరీ వెంకటేష్

సంక్రాంతి 2027 సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు విక్టరీ వెంకటేశ్ , కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కూడా విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి అంటేనే సంక్రాతి దర్శకుడు. ఆయనకు పొంగల్ బాగా కలిసివస్తుంది. వెంకటేష్ తో ఎఫ్2,ఎఫ్3, మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, చిరంజీవితో మనశంకరవరప్రసాదు గారు లాంటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు అనిల్ రావిపూడినే డైరెక్టర్. దాంతో సంక్రాంతి కూడా అనిల్ కు కలిసొస్తే.. చిరంజీవి సినిమాకు గట్టి పోటీ తప్పదనే చెప్పాలి.

55
వెంకటేష్, చిరంజీవి మధ్య సంక్రాంతి పోరు.
Image Credit : instagram

వెంకటేష్, చిరంజీవి మధ్య సంక్రాంతి పోరు.

ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ లు ఫిక్స్ అయితే.. ఈసారి సంక్రాంతి రసవత్తరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రెండు సినిమాలపై భారీగా అంచనాలు ఉన్నాయి. అటు చిరంజీవి, ఇటు వెంకటేష్ ఇద్దరు సంక్రాంతి హీరోలే కావడంతో పొంగల్ వార్ పై అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, వెంకటేష్ కలిసి సందడి చేశారు. కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం రెండు సినిమాలతో పోటీ పడబోతున్నారు. మరి ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరో చూడాలి.?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved