ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమాకు పోటీగా నిలబడ్డ వెంకటేష్ సినిమా ఏదో తెలుసా?
ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమాకు ఎదురెళ్లి నిలబడగల ధైర్యం ఎవరికైనా ఉందా. తారక్ మంచి ఫామ్ లో ఉండగా విక్టరీ వెంకటేష్ ఎన్టీఆర్ సినిమాకు ఎదురెళ్లి గెలిచాడని మీకు తెలుసా? ఇంతకీ ఆ సినిమా ఏంటి ?

ఎన్టీఆర్ కు ఎదురెళ్లిన వెంకటేష్
టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య రిలీజుల పోటీ అనేది సాధారణమే అయినప్పటికీ, బ్లాక్ బస్టర్ సినిమాకు పోటీగా విడుదలై హిట్ సాధించడం చాలా అరుదు. అది కూడా మంచి ఫామ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాలకు ఎదురు వెళ్లడం అంటే సాహసమనే చెప్పాలి. అయితే అలాంటి సాహసమే చేశాడు సీనియర్ స్టార్ మీరో విక్టరీ వెంకటేష్. తన ఫ్యామిలీ సినిమాతో, మాస్ హీరో సినిమాకు ఎదురెళ్లాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి?
క్లాసిక్ హిట్ వసంతం
ఎన్టీఆర్ సినిమాకు ఎదురెళ్లి హిట్ అయిన ఘనతను సొంతం చేసుకున్న చిత్రాల్లో వెంకటేష్ నటించిన వసంతం ఒకటి. ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు పూర్తయ్యింది. వసంతం చిత్రం 2003 జూలై 11న విడుదలైంది. ఇందులో వెంకటేష్ సరసన ఆర్తి అగర్వాల్, కల్యాణి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కుటుంబ భావోద్వేగాలతో పాటు యూత్‌కి అనుసంధానమైన కథతో ప్రేక్షకుల మనసు దోచింది. వసంతం సినిమాకు ఎస్.ఎ రాజ్‌కుమార్ పాటలు ప్రాణంగా నిలిచాయి. ఈ పాటలు అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా "గాలి చిరుగాలి" పాట మోటివేషనల్ హిట్‌గా నిలిచింది.
సింహాద్రి వర్సెస్ వసంతం
వసంతం సినిమా విడుదలకు రెండు రోజుల ముందే, ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యింది. జులై 11న వసంతం రిలీజ్ అయితే, జులై 9న సింహాద్రీ సినిమా విడుదలైంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సింహాద్రి ప్రభంజనంలో కూడా వసంతం నిలదొక్కుకోవడం పెద్ద విషయమే. ఇకపోతే వెంకటేష్ గతంలో వాసు, జెమిని సినిమాలతో పరాజయాలు ఎదుర్కొన్న సమయంలో వసంతం కోసం చాలా జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకున్నారు.
ఊహించని హిట్ కొట్టిన సినిమా
ఈ సినిమాకు విడుదల సమయంలో 8.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండగా, చివరకు 14 కోట్ల వరకు షేర్ వసూలు చేసి, దాదాపు 5 కోట్ల లాభం తెచ్చింది. ఈ సినిమా టీమ్ ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి, విజయాన్ని అందుకుంది. వెంకటేష్ నటన, కథ కథనాలు, మ్యూజిక్ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. సునీల్, ఆకాష్, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. మంచి పాజిటివ్ మౌత్ టాక్‌తో వసంతం క్లీన్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా 22 వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులు ఈ సినిమాను మరోసారి తలుచుకుంటున్నారు. టీవీల్లో ఎన్నిసార్లు వచ్చినా చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.