20 ఏళ్లైనా టిఆర్పి లో దుమ్మురేపుతున్న వెంకటేష్ సినిమా ఏదో తెలుసా?
దాదాపు 20 ఏళ్లు అవుతోంది ఈ సినిమా రిలీజ్ అయ్యి. ఇప్పటికీ టీవీల్లో దుమ్మురేపుతోంది. అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎంత టీఆర్పీ వచ్చింది.

కొన్ని సినిమాలు థియేటర్ల కంటే టెలివిజన్‌లోనే ఎక్కువ ఆదరణ పొందుతూ రికార్డులు తిరగరాస్తుంటాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పటికే మహేష్ బాబు నటించిన అతడు ముందుంది. మళ్లీ మళ్లీ ప్రసారమవుతూ, ప్రతి సారి కొత్త టీఆర్పీ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి సినిమా కూడా ఆ స్థాయిలోనే టీవీలో రికార్డులను నమోదు చేస్తోంది.
KNOW
2005లో విడుదలైన సంక్రాంతి సినిమా అప్పట్లో పెద్ద హిట్టు అయింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామాలో వెంకటేష్ తో పాటు శ్రీకాంత్, స్నేహ, సంగీత, శివబాలాజీ, శర్వానంద్ ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళ సినిమా అన్నన్ కు ఇది తెలుగు రీమేక్. సమ్మర్ విడుదలైన ఈ సినిమా, వెంకటేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.
ఈ సినిమా జెమినీ టీవీ రైట్స్ అప్పుడే కొనుగోలు చేయగా, అప్పట్లో ఈ స్థాయిలో స్పందన ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ సినిమా విడుదలై 20 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ టెలికాస్ట్ అయ్యే ప్రతిసారి టీఆర్పీ భారీ స్థాయిలో నమోదు అవుతోంది. తాజాగా 2025 సెప్టెంబర్ మొదటి ఆదివారం ఆగస్టు 31 న జెమినీ టీవీలో సంక్రాంతి సినిమా ప్రసారమవగా, 6.08 టీఆర్పీ రేటింగ్ ను సాధించింది (అర్బన్ + రూరల్ కలిపి). ఇందులో అర్బన్ ఏరియాలో మాత్రమే 5.23 రేటింగ్ వచ్చిందంటే ఈ సినిమా కి ఉన్న క్రేజ్ ఎంతో అర్థమవుతోంది.
అదే రోజున ఇతర చానళ్లలో ప్రసారమైన సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే స్టార్ మా చానల్ లో జాక్ (World TV Premier) — 4.45 (Urban + Rural), 5.80 (Urban only), జీ తెలుగు లో తండేల్ — 5.2 (Urban + Rural), 5.32 (Urban only) ఈ క్రమంలో జెమినీ టీవీకి సంక్రాంతి సినిమా మరోసారి భారీ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రాముఖ్యత పెరిగిన ఈ కాలంలో కూడా, పాత సినిమాలు ఇలా టీవీల్లో తిరిగి టీఆర్పీలు సాధించడం విశేషమే.