అల్లు అర్జున్ సంచలన నిర్ణయం, ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త, నిజమెంత?
అల్లు అర్జున్ సంచలన నిర్ణయం, పాన్ ఇండియాతో పాటు, లోకల్ ఫ్యాన్స్ పై ప్రత్యేకంగా ప్లాన్. అభిమానులకు పండగలాంటి వార్త. కాని అందులో నిజమెంత? అసలు విషయం ఏంటి?

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోలు ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలు పూర్తి కావడానికి సంవత్సరాల సమయం పడుతుండటంతో, ప్రతి ఏడాది తమ హీరోను తెరపై చూడలేకపోతున్నారని అభిమానులు అసంతృప్తిగా ఫీలవుతున్నారు.ఈ గ్యాప్‌ని తగ్గించేందుకు మాస్ సినిమాలు కూడా చేయాలని అభిమానుల నుంచి వస్తున్న అభిప్రాయాన్ని అల్లు అర్జున్ గమనించినట్టు సమాచారం. అందుకే, పాన్ ఇండియా ప్రాజెక్టులతో పాటు, త్వరగా పూర్తి చేసి విడుదల చేయగల తెలుగు మాస్ సినిమాకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో బన్నీ ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 2016లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరైనోడు’. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ ను ఈసినిమాలో డిఫరెంట్ గా చూపించాడు బోయపాటి. ఫ్యాన్స్ కు ఈ పవర్ ప్యాక్ యాక్షన్ పర్ఫామెన్స్ నచ్చింది. దాంతో ఫ్యాన్స్ సరైనోడు సినిమాతో పండగ చేసుకున్నారు. అల్లు అర్జున్ మాస్ అవతారం, థమన్ మ్యూజిక్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు మళ్లీ చూడాలని వారు కోరుకుంటున్నారు.
ఈ కాంబినేషన్ మళ్లీ రావాలని అల్లు అర్జున ఫ్యాన్స్ తో పాటు, ఆయన తండ్రి, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ కూడా కోరుకుంటున్నారట. ఈ డ్రీమ్ కాంబోకి ఇప్పటివరకు టైమ్ కుదరకపోయినా, తాజా సమాచారం ప్రకారం ‘సరైనోడు 2’ ప్రాజెక్ట్‌పై పచ్చజెండా ఊపినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బోయపాటి శ్రీను, అల్లు అర్జున్, అల్లు అరవింద్‌ల మధ్య ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కథకు బన్నీ, అరవింద్ మంచి రెస్పాన్స్ ఇచ్చారని సమాచారం.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప-2’ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించే భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాతో బిజీ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ 2027 వేసవిలో రిలీజ్ అవుతుందని అంచనా. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య కూడా అల్లు అర్జున్, ‘సరైనోడు 2’ కోసం కమిట్ అవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారట.
అల్లు అర్జున్ భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు తగ్గట్లు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే, టార్గెట్‌గా తెలుగు ప్రేక్షకుల కోసం మాస్ ఎంటర్‌టైనర్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ-2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది 2025 డిసెంబర్ లేదా 2026 జనవరిలో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత వెంటనే ‘సరైనోడు 2’ పనులు బోయపాటి మొదలు పెడతాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2026 ప్రారంభంలో ‘సరైనోడు 2’ అధికారికంగా ప్రకటించే అవకాశముంది.