MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • AK47 Release Date: ఆ వార్తలకు ఆదర్శ కుటుంబం టీమ్‌ చెక్‌.. వెంకటేష్‌ మూవీ విడుదలయ్యేది అప్పుడే

AK47 Release Date: ఆ వార్తలకు ఆదర్శ కుటుంబం టీమ్‌ చెక్‌.. వెంకటేష్‌ మూవీ విడుదలయ్యేది అప్పుడే

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఏకే 47`(ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం 47) మూవీ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ వచ్చింది. గాంధీ జయంతికి మూవీ రాబోతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 27 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వెంకటేష్ హీరోగా `ఆదర్శ కుటుంబం`
Image Credit : Asianet News

వెంకటేష్ హీరోగా `ఆదర్శ కుటుంబం`

వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం`(హౌస్‌ నెం 47) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న మూవీ ఇది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతుంది. చాలా రోజులుగా సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ నుంచి కేవలం ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ ఒక్కటే విడుదలైంది. అక్టోబర్‌ 2న విడుదల చేయబోతున్నట్టు అప్పట్లో ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆదర్శ కుటుంబం మూవీపై రూమర్లు
Image Credit : Asianet News

ఆదర్శ కుటుంబం మూవీపై రూమర్లు

అయితే తాజాగా దీనిపై అనేక రూమర్లు వచ్చాయి. సినిమా విడుదల వాయిదా పడుతుందని, రీ షూట్‌ చేస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఆ మధ్య `బ్లాస్ట్` మూవీ వచ్చిన నేపథ్యంలో ఇది కూడా అలానే ఉంటుందని, దీంతో స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని, కొంత రీ షూట్‌ జరుగుతుందనే వార్తల వచ్చాయి. అదే సమయంలో ఓ హాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌ అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా మూవీకి సంబంధించి అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చింది టీమ్‌. సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది.

33
గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం రిలీజ్‌
Image Credit : Asianet News

గాంధీ జయంతికి ఆదర్శ కుటుంబం రిలీజ్‌

`ఆదర్శ కుటుంబం` మూవీని గాంధీ జయంతికి విడుదల చేయబోతున్నారు. అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ సినిమాలోని హృద్యమైన, ఉత్సాహభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఇందులో వెంకటేష్, శ్రీనిధి శెట్టి ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆత్మీయ కుటుంబ కథకు అద్దం పట్టేలా ఉన్నారు. సినిమాలో ఎమోషన్స్, ఎంటర్టైన్‌మెంట్‌, హార్ట్ టచింగ్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉంటాయని టీమ్ చెబుతోంది.

టీమ్‌ చెబుతూ, వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శైలిలో మనసును హత్తుకునే భావోద్వేగాలు, గుర్తుండిపోయే పాత్రలు, కట్టిపడేసే హాస్యం, అర్థవంతమైన కథనం కలగలిపి, ప్రేక్షకులకు సంపూర్ణమైన సినిమా అనుభూతిని అందించడానికి `ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47` సిద్ధమవుతోంది. తన సహజమైన ఆకర్షణ, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే వెంకటేష్.. ఈసారి కూడా కుటుంబ విలువలతో కూడిన పాత్రలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనున్నారు.

ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ కుమార్ యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన కలయికలో ఒకటైన వెంకటేష్–త్రివిక్రమ్ కాంబో మరోసారి కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అక్టోబర్ 2, 2026న పండుగ సీజన్‌లో విడుదల కానున్న `ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47` చిత్రం, ఒక పరిపూర్ణ కుటుంబ వినోదభరిత చిత్రంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది` అని వెల్లడించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేష్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image2
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image3
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Related Stories
Recommended image1
Rajamouli: సినిమా డిజాస్టర్‌, రాజమౌళి పని అయిపోయింది.. ఆస్తులు అమ్మేందుకు రెడీ అయిన రమా రాజమౌళి
Recommended image2
AK47: వెంకటేష్‌, త్రివిక్రమ్‌ మూవీ రీ షూట్.. `ఆదర్శ కుటుంబం` దానికి కాపీనా, రీమేకా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved