MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కేతమ్మ టాలెంట్ కు ఫిదా అయిన డైరెక్షన్, అగ్నిపరీక్ష నుంచి సినిమా అవకాశం

కేతమ్మ టాలెంట్ కు ఫిదా అయిన డైరెక్షన్, అగ్నిపరీక్ష నుంచి సినిమా అవకాశం

సామాన్యులకు బిగ్ బాస్ లోకి తీసుకునే ఉద్దేశ్యంతో అగ్ని పరీక్ష ద్వారా సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు టీమ్. ఈక్రమంలో నల్గొండ కేతమ్మ బిగ్ బాస్ లోకి వెళ్లకముందే సినిమా అవకాశాన్ని సాధించింది. అగ్నిపరీక్ష స్టేజ్ మీదనే ఆమెకు ఓ డైరెక్టర్ గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 02 2025, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Star Maa

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కు సంబంధించి కామనర్స్‌కి అవకాశం కల్పించేందుకు నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ కాంటెస్ట్ ఉత్కంఠ రేపుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నల్గొండ జిల్లాకు చెందిన కేతమ్మ, తన ప్రతిభతో ప్రేక్షకుల జడ్జీలను కూడా ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఎంట్రీ ఖరారు కాకపోయినా, నటిగా మాత్రం తొలి అవకాశాన్ని అగ్నిపరీక్ష వేదికగా అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : our own

బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో దర్శకుడు జాగర్లమూడి క్రిష్ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. సెప్టెంబర్ 5న విడుదలవుతున్న తన కొత్త చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అగ్నీపరీక్ష ఈవెంట్ కు వచ్చారు. ఈ సందర్భంగా క్రిష్, కంటెస్టెంట్ల ప్రతిభ దగ్గరుంచి చూశారు. యాంకర్ శ్రీముఖి మీకు ఈ కంటెస్టెంట్ స్ లో ఎవరు బాగా అనిపించారు అని అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, "నికితా బాగా నచ్చింది," అని పేర్కొన్నారు. అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ హెయిర్ స్టైల్‌ను ప్రశంసించారు.

35
Image Credit : Star Maa

ఈ ఎపిసోడ్‌లో నవదీప్, కొత్త కంటెస్టెంట్లకు ఓ డేర్ టాస్క్ ఇచ్చారు. ‘‘ఎవరైనా నా ముఖంపై నీళ్లు చల్లాలి’’ అని అన్నారు. అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో దర్శకుడు క్రిష్ స్పందిస్తూ, ‘‘నేను కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా నీళ్లు చల్లేవాడిని,’’ అన్నారు. ఇప్పటికే పలువురు ప్రేక్షకుల దృష్టిలోకి వచ్చిన నల్గొండ కేతమ్మ, ఈ సందర్భంలో తన జీవితంలో ఎదురైన కష్టాల్ని ఒక పాట రూపంలో వివరించారు. ఆమె గాత్రం, భావప్రకటనలు చూసి చలించిపోయిన క్రిష్, "మీకు ఇష్టం ఉంటే నా తదుపరి సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం తీసుకుంటాను" అని చెప్పారు. ఈ మాట విన్న కేతమ్మ కంట్లో ఆనందబాష్పాలు వెల్లివొచ్చాయి.

45
Image Credit : Star Maa

దర్శకుడు క్రిష్ కేతమ్మను ఉద్దేశించి, "మీరు వచ్చినప్పటి నుంచి ఏ భేషజాలు లేకుండా ఆటని ఆటలా ఆడుతున్నారు. ఈ కంటెస్టెంట్లలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు" అంటూ ప్రశంసలు కురిపించారు.కేతమ్మకు నటనపై ఉన్న ఆసక్తి, ఆమె పాటల ద్వారా వ్యక్తపరిచిన జీవిత అనుభవాల వల్ల ఆమె ఈ అవకాశాన్ని అందుకోగలిగింది. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారా లేదా అనేది ఇంకా తెలియదు కానీ, క్రిష్ తదుపరి సినిమాలో ఆమె కనిపించనుంది అనే విషయం మాత్రం ఇప్పుడు కన్ఫర్మ్ అయింది.

55
Image Credit : Star Maa

ఈ సందర్భంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇది మంచి ప్లాట్‌ఫామ్‌గా మారిందని చెప్పవచ్చు. కేతమ్మకు ఈ అవకాశం రావడంతో, నవదీప్ కూడా ఆమెపై ప్రశంసలు కురిపించాడు. కేతమ్మకు సినిమా అవకాశం రావడం సంతోషం అన్నాడు. క్రిష్ నాకు మంచి స్నేహితుడు, ఆయన నెక్ట్స్ సినిమాలో నీకు సరిపోయే పాత్ర ఉంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. నేను అది గుర్తు చేస్తాను. అప్పటి నువ్వు బిజీ అయితే నేను నీకు మేనేజర్ గా ఉండి, నీ డేట్స్ నేనే స్వయంగా చూస్తాను అని నవదీప్ అన్నారు. దాంతో కేతమ్మ కన్నీరు పెట్టారు. దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి కేతమ్మ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. మరీ ఏం జరిగిందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
17 ఏళ్లుగా నాని భద్రంగా దాచుకున్న జ్ఞాపకం ఏంటో తెలుసా? షాక్ అవుతారు
Recommended image2
బిగ్ బాస్ తెలుగు 9 లో ఫోక్ డాన్సర్, సినిమాలు వద్దనుకొని బిగ్ బాస్ లోకి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved