MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Saindhav : గ్రాండ్ గా ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెంకీమామ, నవాజుద్దీన్ స్టైలిష్ లుక్... ఫొటోలు

Saindhav : గ్రాండ్ గా ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెంకీమామ, నవాజుద్దీన్ స్టైలిష్ లుక్... ఫొటోలు

విక్టరీ వెంకటేశ్- సైలేష్ కొలను కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రం ‘సైంధవ్’ Saindhav. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్ లో గ్రాండ్ గా జరుగుతోంది. వెంకీ, నవాజుద్దీన్, హీరోయిన్ల ఎంట్రీతో పాటు ఫ్యాన్స్ రావడంతో ఈవెంట్ ఘనంగా జరుగుతోంది.   

Shreekanth Nuthi | Updated : Jan 07 2024, 09:44 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేశ్ (Venkatesh)  ప్రస్తుతం ‘సైంధవ్’ Saindhav మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నారు వెంకీ మామ. ఈ మూవీ కోసం అభిమానులూ ఎదురుచూస్తున్నారు. 
 

27
Asianet Image

పైగా ఈ చిత్రం వెంకీ కెరీర్ లో 75వ చిత్రం కావడం విశేషం. దాంతో సినిమాపైనా భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ వెంకటేశ్ మాస్ అండ్ యాక్షన్ తో రాబోతుండటంతో ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. 

37
Asianet Image

ఈ యాక్షన్ ఫిల్మ్ ను ‘హిట్ వెర్స్’ ఫేమ్ డైరెక్టర్ శైలెష్ కొలను Sailesh Kolanu  తెరకెక్కిస్తున్నారు. వెంకీని తన అభిమానులు కోరుకున్న స్టైల్ తో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. 
 

47
Asianet Image

ఇక ఈరోజు సైంధవ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లోని RK బీచ్ లో గ్రాండ్ గా జరుగుతోంది. గోకుల్ పార్క్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు వెంకటేష్, నవాజుద్దీన్ సిద్దిఖ్, డైరెక్టర్ సైలేష్ కొలను, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ హాజరయ్యారు. 
 

57
Asianet Image

ఈ సందర్భంగా వెంకీ అభిమానులు సహా సైంధవ్‌ చిత్రయూనిట్ అంతా హాజరైంది. దీంతో వెంకీ మామ అభిమానులు, వైజాగ్ ప్రజలు భారీగా ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు. ప్రాంగణమంతా సందడి సందడిగా మారింది. 

67
Asianet Image

ఈక్రమంలో వెంకీమామ ఎనర్జిటిక్ లుక్ తో అట్రాక్టివ్ గా అలరించారు. అలాగే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ కూడా స్టైలిష్ లుక్ లో మెరిశారు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ Shraddha Srinath, రుహానీ శర్మ కూడా బ్యూటీఫుల్ గా హాజరయ్యారు. 

77
Asianet Image

అలాగే ఈవెంట్ కు వెంకీ అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యారు. వెంకీపై ఉన్న అభిమానంతో ఫ్యాన్స్, స్థానికులు కూడా వచ్చి ఈవెంట్ ను సక్సెస్ చేశారు. ప్రస్తుతం ఈవెంట్ గ్రాండ్ గా కొనసాగుతోంది. 

Shreekanth Nuthi
About the Author
Shreekanth Nuthi
 
Recommended Stories
Top Stories