MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Biker Review: బైకర్‌ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్‌, రాజశేఖర్‌ మూవీలో హైలైట్స్ ఇవే.. అదొక్కటే మైనస్‌

Biker Review: బైకర్‌ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్‌, రాజశేఖర్‌ మూవీలో హైలైట్స్ ఇవే.. అదొక్కటే మైనస్‌

శర్వానంద్‌, రాజశేఖర్‌ కలిసి నటించిన `బైకర్‌` మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వస్తుంది. ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. సినిమాకి ఫస్ట్ రివ్యూ వచ్చింది. మరి మూవీ ఎలా ఉండబోతుందంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 02 2026, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏప్రిల్‌ 3న బైకర్‌ మూవీ విడుదల
Image Credit : X/@UV_Creations

ఏప్రిల్‌ 3న బైకర్‌ మూవీ విడుదల

శర్వానంద్‌ ఈ సంక్రాంతికి `నారీ నారీ నడుమ మురారి` చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు `బైకర్‌` చిత్రంతో వస్తున్నారు. రాజశేఖర్‌ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కొంత గ్యాప్‌ తర్వాత ఆయన నటిస్తున్నారు. ఇందులో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం(ఏప్రిల్‌ 3)న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. సినిమా ఎలా ఉందో తేలిపోయింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
బైకర్‌ మూవీ స్టోరీ ఇదేనా
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీ స్టోరీ ఇదేనా

శర్వానంద్‌ `నారీ నారీ నడుమ మురారి` హిట్‌ తర్వాత నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. దీనికితోడు ఇందులో రాజశేఖర్‌ ముఖ్యపాత్ర పోషిస్తుండటం విశేషం. ఇది బిజినెస్‌ పరంగానూ, ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ఇది బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రం అని తెలుస్తోంది. ఇందులో రాజశేఖర్‌ ఒకప్పుడు రేసర్‌గా రాణిస్తారు. ఆయన ఛాంపియన్‌ కూడా. కానీ కొంత స్ట్రగుల్‌ ఉంటుంది.కొన్ని కారణాలతో దానికి ఆయన దూరం కావాల్సి వస్తుంది. తన కొడుకు అయిన శర్వానంద్‌ ని ఈ రంగంలో ఎంకరేజ్‌ చేయడం, కొడుకుని ఛాంపియన్‌ చేసేందుకు తండ్రి పడే తపనే మూవీ అని తెలుస్తోంది.

Related Articles

Related image1
Giribabu: కృష్ణ ఓ రోజు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు.. అలా చెప్పడం ఏ హీరో వల్ల కాదు.!
Related image2
Rajasekhar: డబ్బింగ్‌ సినిమాతో తమిళంలో రజనీకాంత్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన రాజశేఖర్‌ మూవీ ఏంటో తెలుసా?
35
బైకర్‌ మూవీ సెన్సార్‌ టాక్‌
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీ సెన్సార్‌ టాక్‌

ఇక ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికేట్‌ని పొందింది. సెన్సార్‌ నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీ రెండు గంటల 35 నిమిషాల నిడివితో ఉండబోతుందట. అయితే సినిమాని ఇప్పటికే కొంత మంది చూశారు. వారి అభిప్రాయం మేరకు సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఎమోషనల్‌ అండ్‌ రోలర్‌ కోస్టర్‌లా సాగుతుందట. టెక్నీకల్‌గా బ్రిలియంట్ గా ఉంటుందని, నటీనటుల ప్రదర్శన హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. 

45
బైకర్‌ మూవీ ఫస్ట్ రివ్యూ రిపోర్ట్
Image Credit : X/@UV_Creations

బైకర్‌ మూవీ ఫస్ట్ రివ్యూ రిపోర్ట్

ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా స్టార్ట్ అవుతుందట. శర్వానంద్‌ నటన ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆకట్టుకుంటుందని, పాత్రలో ఒదిగిపోయినట్టు సమాచారం. అలాగే రాజశేఖర్‌ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, ఆయన నటన కట్టిపడేస్తుందని, చాలా రోజుల తర్వాత ఒక బలమైన పాత్రలో ఆయన కనిపించబోతున్నారని, వింటేజ్‌ రాజశేఖర్‌ని చూడొచ్చు అంటున్నారు. విజువల్స్ బాగుంటాయని, రేసింగ్‌ సీన్లు ఆకట్టుకుంటాయని అంటున్నారు. రేసింగ్‌లో జంపింగ్‌ సీన్లు అదిరిపోతాయని, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని సమాచారం.

55
బైకర్‌లో హైలైట్స్, మైనస్‌ ఇదేనా?
Image Credit : X/@UV_Creations

బైకర్‌లో హైలైట్స్, మైనస్‌ ఇదేనా?

ఇక సెకండాఫ్‌లో ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్స్, వారి బాండింగ్‌ హైలైట్‌గా నిలుస్తాయని, అది అదిరిపోతుందని, క్లైమాక్స్ లో రేసింగ్‌ సీన్లు ఉత్కంఠకి గురి చేస్తాయని తెలుస్తోంది. శర్వానంద్‌, రాజశేఖర్‌ మధ్య వచ్చే సీన్లు, అందులోని ఎమోషన్స్ పీక్‌లో ఉంటాయని అంటున్నారు. మ్యూజిక్‌, సౌండింగ్‌ బాగుందని చెబుతున్నారు. మొత్తంగా సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. కానీ ఒక్కటే నెగటివ్‌ టాక్‌ ఉంది. కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా కథ పరంగా ఓల్డ్ గానే ఉంటుందని, గతంలో ఇలాంటి సినిమాలు చాలానే తెలుగులో వచ్చాయని సమాచారం. కాకపోతే దర్శకుడు తెరపై స్క్రీన్‌ ప్లే చేసిన మ్యాజిక్‌ హైలైట్‌ అని అది ఆడియెన్స్ ని ఎంత వరకు ఎంగేజ్‌ చేస్తుందని, దానికి కనెక్ట్ అయ్యే సినిమా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. మరి అది ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image2
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image3
Madhuri Dixit Dance Numbers: మాధురీ డ్యాన్స్‌తో హిట్టైన 6 సినిమాలు.. అప్పట్లోనే కోట్ల కలెక్షన్లు!
Related Stories
Recommended image1
Giribabu: కృష్ణ ఓ రోజు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు.. అలా చెప్పడం ఏ హీరో వల్ల కాదు.!
Recommended image2
Rajasekhar: డబ్బింగ్‌ సినిమాతో తమిళంలో రజనీకాంత్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన రాజశేఖర్‌ మూవీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved