- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: కోపంతో మాళవిక పీక పట్టుకున్న అభి.. భర్త చెంప పగలగొట్టిన వేద!
Ennenno Janmala Bandham: కోపంతో మాళవిక పీక పట్టుకున్న అభి.. భర్త చెంప పగలగొట్టిన వేద!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. భార్యని అపార్థం చేసుకొని దూరం పెడుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నీ అవమానానికి బాధకి బాధ్యున్ని నేను కాదు అప్పుడు మాళవిక అయితే ఇప్పుడు వేద. అప్పుడు అభిమన్యు అయితే ఇప్పుడు వివిన్. నిజంగా నిన్ను చూస్తే జాలికే జాలి వేస్తుంది అంటూ యష్ ని అవమానించేలాగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అభిమన్యు. మరోవైపు హాస్పిటల్ కి వస్తూనే నర్స్ మీద రుసరుసలాడుతుంది వేద. మరోవైపు పేషెంట్ ఫోన్ చేసి రాను అని చెప్పడంతో మీకోసమే నేను ఫంక్షన్ మానుకొని వచ్చాను మీలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం నాదే తప్పు అంటూ ఆవిడ మీద కూడా కోప్పడుతుంది.
ఇదంతా ఆమె వెనకే వచ్చిన వివిన్ చూస్తాడు. ఎందుకు ఇలా ఇరిటేట్ అవుతున్నావు అని అడుగుతాడు. రోజు రోజుకి నా భర్త మీద నా కూతురు మీద నాకు ప్రేమ పెరిగిపోతుంది. నేను నా భర్తని చాలా మిస్ అవుతున్నాను. నా సంతోషంలోనూ దుఃఖంలోనూ నా భర్త ఉండాలి అలాగే నా భర్త సంతోషంలోనూ దుఃఖంలోనూ నేనే ఉండాలి అనే భావన పెరిగిపోతుంది అందుకే ఇరిటేట్ అవుతున్నానేమో అంటుంది వేద. మరోవైపు ఇంటికి వచ్చిన మాళవిక ఏ సోషల్ మీడియాలో చూసిన యశోదరే కనిపిస్తున్నాడు గ్రేట్ కదా అంటూ అభితో చెప్తుంది.
అభి కోపంతో మాళవిక చంప పగలగొట్టి వాడు గ్రేట్ అయితే మరి నేనేంటి అంటూ ఆమె పీక పట్టుకుంటాడు. మళ్లీ తనే మాళవికకి మంచినీళ్లు ఇస్తూ ఆడదాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిన గెలుపు ఒక గెలుపేనా అంటాడు. అలా అంటున్నావ్ ఏంటి అంటుంది మాళవిక. వేద, వివిన్ గాడితో ఎఫైర్ నడుపుతుంది రేపో,మాపో వాడితో జంప్ అయిపోతుంది. అందుకే ఆ వివిన్ వాడికి సపోర్ట్ చేశారు అంతేగాని ఇందులో యశోదర్ గొప్ప ఏమీ లేదు ఇంకెప్పుడూ నా ముందు వాడి గురించి గొప్పగా మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇస్తాడు అభి.
నీకు ఇష్టం లేని పని నేను చేయను నిజంగా సారీ అంటుంది మాళవిక. వేద లైఫ్ లో కూడా లవర్ ఉన్నాడా అనుకుంటుంది మాళవిక. మరోవైపు అభి మాటలకి అవమానంతో ఓవర్ గా డ్రింక్ చేస్తూ ఉంటాడు యష్. వేద మీద కోపంతో బ్రెస్లెట్ తీసి విసిరేస్తాడు. అక్కడికి వచ్చిన వసంత్ నిన్ను చంపేసిన మాళవికనే గుర్తొచ్చింది కానీ పునర్జన్మ నిచ్చిన వేద వదిన గుర్తుకురాలేదు. అందరికీ పున్నమి రోజు చందమామ కనిపిస్తే నీకు మాత్రం చందమామలో మచ్చ కనపడుతుంది. వేద వదినలో ఏ మచ్చా లేదు ఆ విషయం నీకు తొందర్లోనే అర్థమవుతుంది అంటూ కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వసంత్.
తాగిన మత్తులో నీ మనసుని మాళవిక ముక్కలు చేస్తే నువ్వు వేద మనసుని ముక్కలు చేస్తావా, ఒకవేళ వేద నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే ఆ తప్పు నాదే ఎందుకంటే నేనే తనని ఇరిటేట్ చేస్తున్నాను అనుకుంటాడు. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను పాపం వేద నాకోసం బ్రేస్లెట్ తీసుకువచ్చింది అంటూ దాన్ని వెతికి పట్టుకుంటాడు. నేను దీన్ని పోగొట్టుకొని నీ ప్రేమని నీతో జీవితాన్ని దేన్నీ పోగొట్టుకోను నా గుండెల్లో దాచుకుంటాను అనుకుంటాడు యష్. మరోవైపు యష్ ప్రవర్తనకి బాధపడుతుంటారు రత్నం దంపతులు.
యష్ ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది ఒకసారి బాగుంటాడు ఒక్కోసారి బాగోడు. అప్పుడే చిరాకు అప్పుడే ప్రేమ. కన్నతల్లిని నాకే అర్థం కావట్లేదు వాడు ఎక్కడో డిస్టర్బ్ అయ్యాడు అంటుంది మాలిని. వాడిని వెనకేసుకురావద్దు అంటూ భార్యని మందలిస్తాడు రత్నం. ఇంత మంచి అకేషన్ లో వేద పేరు చెప్పాలి. ఈరోజు వాడు సంపాదించిన ప్రతి విజయము వేద పెట్టిన బిక్ష. అలాంటిది వేద పేరు చెప్పకుండా మాళవిక పేరు చెప్తాడా, ఆ అమ్మాయి వీడి కోసం ఎంత త్యాగం చేసింది అలాంటిది అంతమందిలో వేదని అవమానిస్తాడా అంటూ కోపంతో రగిలిపోతాడు రత్నం.
మరోవైపు యష్ ఇంటికి వచ్చిన టైంకి వేద, విన్ని కూడా వస్తారు. కారు దిగకుండానే వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకోవడం చూసి డిసప్పాయింట్ అవుతాడు యష్. నీ ఫేస్ లో డిసప్పాయింట్మెంట్ కాదు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటాడు విన్ని. నేను మనిషినే కదా విని నేను కూడా అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంటాను కానీ అలాంటప్పుడు నన్ను మోటివేట్ చేయడానికి నీలాంటి రియల్ ఫ్రెండ్ ఇచ్చే సపోర్టు విలువ కట్టలేనిది అంటుంది వేద.
నేను ఒక మంత్రం చెప్తాను నీ మనసు బాగోలేనప్పుడల్లా ఆ మంత్రం చెప్పు అంటూ ఆల్ ఈజ్ వెల్ అని చెప్తాడు విన్ని. తరువాయి భాగంలో భార్యాభర్త అంటూ లెక్చర్లు ఇచ్చావు కదా ఇప్పుడు భర్తగా నా హక్కు చూపిస్తాను అంటాడు యష్. దూరంగా ఉండమంటుంది వేద. నాకు దూరంగా ఉండి ఎవరికి దగ్గరవుతామని అంటాడు యష్. ఆ మాటకి కోపంతో భర్త చంప పగలగొడుతుంది వేద.