- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: యశోధర్ కు నాకు మధ్య ఎలాంటి ప్రేమ లేదు.. బాంబు పెల్చిన వేద!
Ennenno Janmala Bandham: యశోధర్ కు నాకు మధ్య ఎలాంటి ప్రేమ లేదు.. బాంబు పెల్చిన వేద!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక ఇరు ఫ్యామిలీల అందరూ శాంతి పూజ గణనీయంగా ముగించుకొని అక్కడినుంచి వెళ్ళిపోతారు.

ఇక మాలిని ఫ్యామిలీ ఇంటికి వచ్చి కాళ్ళు నొప్పి అంటూ లబోదిబోమంటున్నారు. ఆ తర్వాత మాలని ఖుషి ను గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. ఖుషి కూడా ఈ పూజలో ఉంటే ఎంతో హడావుడి చేసేది అని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతుండగా యశోదర్ చూసి మనసులో మరింత బాధను వ్యక్తం చేసుకుంటాడు.
మరోవైపు సులోచన ఫ్యామిలీ నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే వరుడు కు పెట్టే ఉంగరం చూసుకుంటూ మురిసిపోతారు. ఆలోపు వేద అక్కడికి వచ్చి ఈ ఉంగరం తొడగొద్దు అని అంటుంది. ఆ ఉంగరం సులోచన భర్త ఎంతో ప్రేమతో తొడిగిన ఉంగరం కాబట్టి వేద వద్దు అని చెబుతుంది.
కార్యక్రమంలో ఈ ఉంగరం వెనకాల ఇంతా సెంటిమెంట్ ఉంది కాబట్టి ఉంగరం పెట్టడం అవసరమా అని వేద అంటుంది. అదే క్రమంలో ప్రేమ అనే పదం మా ఇద్దరి మధ్య లేదు. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంది ఖుషీ కోసం అని చెప్పగా ఫ్యామిలీ అంతా స్టన్ అవుతారు. ఆ తరువాత సులోచన భర్త పెళ్లవగానే ఇద్దరు హాయిగా హ్యాపీగా ఉంటారు మనం భయపడాల్సిన పనిలేదు అని ఆ ఫ్యామిలి కి ధైర్యం చెబుతాడు.
మరోవైపు ఇరు ఫ్యామిలీలు నిశ్చితార్థ వేడుకల్లో తెగ హడావిడి చేస్తూ ఆనందంతో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మాలిని ను మర్యాదగా ఆహ్వానించాలని ఇగో తో ఇంటి బయటే ఉంటుంది. ఇక సులోచన ఇష్టం లేకుండా వచ్చి ఫన్నీగా మలబారి మాలినీ గారు లోపలికి విచ్చేయండి అని అంటుంది.
ఇక మాలిని ఇగో అప్పటికీ శాటిస్ఫై అవ్వదు.. దాంతో సులోచన సన్నాయిమేళం పెట్టి మరీ..ఆహ్వానిస్తుంది. అప్పుడు ఆనందంగా మాలిని లోపలకు వస్తుంది. మరోవైపు వధూవరులిద్దరూ అందం గా రెడీ అయ్యి నిశ్చితార్థ పీటలపై కూర్చుంటారు. ఈ లోపు ఆ వేడుకలకు మాళవిక రానే వస్తుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.