- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: అసలు విషయం మరిచిపోయిన యష్.. నడి రోడ్డుమీద భర్తని నిలదీసిన వేద!
Ennenno Janmala Bandham: అసలు విషయం మరిచిపోయిన యష్.. నడి రోడ్డుమీద భర్తని నిలదీసిన వేద!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. భార్యని బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో తనకు తానే శిక్ష వేసుకుంటున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కారులో వెళ్తున్న యష్ మనసుకి ఏదో దిగులుగా ఉంది, గుండెల్లో ఏదో అవుతుంది అనుకుంటాడు. మరోవైపు వేద కారులో వస్తూ ఎంత సంతోషంగా గడిపారు, నాతో డిన్నర్ కి కూడా వచ్చారు కదా అంతలోనే డైవర్స్ పేపర్ ఇచ్చారు. ఇంత సీక్రెట్ గా ఎలా మెంటైన్ చేశారు అనుకుంటూ ఏడుస్తుంది. మరోవైపు ఎంత వద్దనుకుంటున్నా వేద ఆలోచనలే వస్తున్నాయి. ఆమె జ్ఞాపకాలు నన్ను బాధ పెడుతున్నాయి ఇంత పెయిన్ ఏంటి నాకు అనుకుంటాడు. కృషి ఇచ్చిన పెయింటింగ్ చూసుకుంటూ వసంత్.. మంచి మాట అన్నావు వేద వదిన నీకు ఉపకారం చేసింది అన్నావు తనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్నావు ఇదేరా తనకి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అనుకుంటాడు.
ఎప్పుడు నువ్వే త్యాగం చేయగలవా నేను త్యాగం చేయలేనా, నీ సంతోషం కోసం నీ ఫ్రీడం కోసమే నా సంతోషాన్ని వదులుకుంటున్నాను అనుకుంటాడు యష్. నీకు శాశ్వతంగా దూరం అవుతున్నది నా బాడీ మాత్రమే కానీ నా మనసు నీ చుట్టూనే తిరుగుతుంది రియల్లీ ఐ మిస్ యు అనుకుంటాడు. ఇంతలో తన కార్ ట్రబుల్ ఇవ్వటంతో ఏం జరిగింది అని అడుగుతాడు యష్. కారు ట్రబుల్ ఇచ్చింది సార్ టైం పట్టేలాగా ఉంది అంటాడు డ్రైవర్. నాకు ఫ్లైట్ కి టైం అయిపోతుంది అనుకుంటూ అటుగా వస్తున్న కారుని ఆపుతాడు యష్. ఆ కారులో ఉన్నది వేద. ఇద్దరూ షాక్ అవుతారు.
వేద గబగబా కారు దిగి, కారు ట్రబుల్ ఇచ్చిందా.. మీకు ఫ్లైట్ కి లేట్ అయిపోతుందేమో పదండి నేను డ్రాప్ చేస్తాను అని అతన్ని తన కారులో తీసుకు వెళుతుంది. నువ్వు రాకపోయి ఉంటే ఫ్లైట్ మిస్ అయిపోయే వాడిని కారు ట్రబుల్ ఇచ్చేసరికి చాలా టెన్షన్ పడ్డాను అంటాడు యష్. ఫ్లైట్ మిస్ అయ్యావారా, లైఫ్ ని మిస్ అయిపోయేవారా అంటుంది వేద. యష్ చెప్పిన రూట్ లో కాకుండా వేరే రూట్లో తీసుకెళ్తుంది వేద.
ఫ్లైట్ కి లేట్ అయిపోతుందని కంగారు పడతాడు యష్. భర్తని కారు దిగమని చెప్పి మీరేమీ కంగారుపడకండి మిమ్మల్ని టైం కి ఎయిర్పోర్ట్ తీసుకెళ్లే బాధ్యత నాది కానీ అంతకంటే ముందు మనిద్దరి మధ్య ఒక పని మిగిలిపోయింది అంటూ డైవర్స్ పేపర్స్ తీసుకొస్తుంది వేద. అన్ని బాగానే ఉన్నాయి లీగల్ పాయింట్స్ కూడా కరెక్ట్ గా రాశారు కానీ సైన్ చేయటం మరిచిపోయారు అంటుంది.
నేను మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను అనుకుంటున్నారు అంతకన్నా మీ చేతిలో చనిపోవడం మంచిది అంటుంది వేద. నేను నీకు తగిన వాడిని కాదు మంచి లైఫ్ కావాలంటే మంచి లైఫ్ పార్టనర్ కావాలి నేను నీకు సరైన లైఫ్ పార్టనర్ ని కాదు. ఇది నీకు నేను వేసిన శిక్ష కాదు నాకు నేను వేసుకున్న శిక్ష అంటాడు యష్. ఒక భార్యని నీకు భర్త కావాలా, భవిష్యత్తు కావాలా అని అడిగితే ఆ భార్య భర్తనే కోరుకుంటుంది.
నేను మిమ్మల్ని వదిలి ఉండగలనని ఎలా అనుకున్నారు అంటుంది వేద. రియలైజ్ అయిన యష్ ఆమెకి సారీ చెప్తాడు. వేద ఆనందంగా యష్ ని హాగ్ చేసుకుని ఐ లవ్ యు చెప్తుంది. యష్ కూడా ఐ లవ్ యు చెప్తాడు. అయినా ఒక్క పేపరు మన బంధాన్ని ఎలా తెంచేస్తుందనుకున్నారు, ఒక్క కాగితంతో నన్ను వదిలించుకుందామనుకున్నారా, నన్ను మీ నుంచి దూరం చేద్దాం అనుకున్నారా అంటూ సరదాగా భర్తని తరుముతుంది వేద.
ఆమె నుంచి తప్పించుకుంటూ పరిగెడతాడు యష్. తరువాయి భాగంలో భర్త పడుకున్నాడు అనుకోని ప్రతి జన్మకి మీరే నా భర్త కావాలి అంటుంది వేద. యష్ కళ్ళు తెరిచేసరికి తను కళ్ళు మూసేస్తుంది. పర్ఫార్మెన్స్ చాలు నేను అంతా చూసేసాను అంటాడు యష్. వివిన్ ఏం చెప్పాడు అని అడుగుతాడు యష్. భార్య భర్తల మధ్యన దాపరికాలు ఉండకూడదని చెప్పాడు అంటూ భర్తని హత్తుకుంటుంది వేద.