- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode: వల్లిని పుట్టింటికి ఈడ్చుకెళ్లిన వేదవతి.. నూతిలో దూకేసిన వల్లి
Illu Illalu Pillalu Today Episode: వల్లిని పుట్టింటికి ఈడ్చుకెళ్లిన వేదవతి.. నూతిలో దూకేసిన వల్లి
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం ఆడినట్టు వేదవతికి తెలిసి వల్లిని పుట్టింటికి లాక్కెళుతుంది. అక్కడ భాగ్యాన్ని చెడమడా తిడుతుంది వేదవతి. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

ఇంట్లోంచి వల్లిని బయటికి తోసేసిన వేదవతి
ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్లో వల్లి అత్తారింటికి రావడం కోసమే ప్రెగ్నెంట్ అని అబద్ధమాడినట్టు వేదవతి, చందులకు తెలిసిపోతుంది. దీంతో వేదవతి వల్లిని బాగా తిడుతుంది. ఇంటికి వారసుడు వస్తున్నాడని రామరాజు ఆనందంతో పొంగిపోతున్నాడని, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని కంగారుపడుతుంది వేదవతి. కొడుక్కి బంగారం లాంటి కోడల్ని తీసుకొచ్చానని, దేవత లాంటి కోడలు వచ్చిందని ఆయన పొంగిపోతున్నారని.. ఇప్పుడు ఆ కోడలు పెద్ద దెయ్యమని తెలిస్తే ఆయన ఏమైపోతాడో అంటూ రామరాజు గురించి వేదవతి కన్నీరు పెట్టుకుంటుంది. నీ కడుపులో నిజంగానే బిడ్డ ఉందనుకొని మేమందరం ప్రేమ పెంచుకుంటుంటే అయ్యో పాపం అని నీకు ఒక్కసారైనా అనిపించలేదా అంటూ వల్లిని అడుగుతుంది. నర్మద గురించి మాట్లాడుతూ ఇది నిజంగానే నీ కడుపు పోగొట్టేసిందని కొట్టాను, అసహ్యించుకున్నాను.. అప్పుడైనా నిజం చెప్పావా అని అడుగుతుంది. అందరూ వద్దంటున్నా కూడా నేను ఇంటికి తీసుకొచ్చాను.. కాబట్టి నాకు బాగా బుద్ధి చెప్పావు అంటుంది. ‘నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. బంగారంలాంటి నా ఇంటిని నా కుటుంబాన్ని ఏం చేస్తావో’ అంటూ వల్లి చేయి పట్టుకొని వేదవతి ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చేస్తుంది. నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని బరబరా ఈడ్చుకొని ఇంటి నుంచి బయటకు తీసుకొస్తుంది.
భాగ్యానికి ఇచ్చిపడేసిన వేదవతి
వేదవతి వల్లిని తీసుకొని కుటుంబంతో సహా భాగ్యం ఇంటికి వస్తుంది. వళ్ళీ చెయ్యి పట్టుకుని భాగ్యం దగ్గరికి లాక్కెళుతుంది. భాగ్యాన్ని కూడా చెడామడా తిడుతుంది. ‘నీ కూతురు నెలతప్పిందని చెబితే ఎంతో సంబరపడిపోయాను. నీ కూతురిని అత్తారింటికి పంపించడానికి ఇంత అబద్ధం చెబుతావా? మాతో ఆడుకుంటావా? మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తావా?’ అంటూ గడ్డి పెడుతుంది. దానికి భాగ్యం కాపురం కూలిపోతే నా కూతురు బతకలేదు, అందుకే అలా చేశానని చెబుతుంది. వేదవతి కోపంగా నీ కూతుర్ని మీ దగ్గరే ఉంచుకో.. మీలో ఎవరైనా మా ఇంటి గుమ్మం తొక్కారంటే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి బయలుదేరబోతుంది. వల్లి ఎంత బతిమిలాడినా పట్టించుకోదు. అప్పుడు ‘భాగ్యం వాళ్లని బతిమిలాడుకోవాల్సిన అవసరం నీకు లేదు. వాళ్ళనే కోర్టు మెట్లు ఎక్కిద్దాం. అందరి మీద గృహహింస చేసి పెట్టించి మీ అందరి సంగతి కోర్టులో చూస్తా’ అని భాగ్యం వార్నింగ్ ఇస్తుంది. వేదవతి పట్టించుకోకుండా కోర్టు కాకపోతే ఎక్కడికైనా వెళ్ళు అనేసి రామరాజుకి ఫోన్ చేస్తుంది. వల్లి గురించి మీ దగ్గర చాలా విషయాలు దాచాను. ఆమె గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పాలి మీరు వెంటనే భాగ్యం ఇంటికి వచ్చేయండి అని పిలుస్తుంది.
నూతిలో దూకిన వల్లి
వల్లి అందరూ వెళ్ళిపోతూ ఉంటే బాధతో అక్కడే ఉన్నా నూతిలో దూకేస్తుంది. దాంతో వేదవతి, చందు, నర్మద అందరూ వెనక్కి వస్తారు. వెంటనే ధీరజ్ నూతిలో దూకి వల్లిని కాపాడతాడు. ‘ ఎందుకు బతకాలో తెలియనప్పుడు నేను ఎందుకు బతికి ఉండాలి. చచ్చిపోక. నేను ఇంకేం చేయాలి’ అంటూ ఏడుస్తుంది వల్లి. చందు మాట్లాడుతూ ‘నీకు నిజంగా కాపురం కావాలని ఉంటే నువ్వు ఇన్ని మోసాలు, తప్పులు చేయవు. నిజంగానే నువ్వు ప్రెగ్నెంట్ అనుకొని ఎంత ప్రేమ పెంచుకున్నానో నీకు తెలుసు. పిచ్చోడిని చేసి ఆడించిన నీకు మొగుడు కావాలని అడిగే అర్హత లేదు. చేసిన తప్పులు అన్నీ చేసి ఇప్పుడు చావడానికి వెళ్తావా? అంటే ఇంకా ఇంకా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తున్నావా’ అని అంటాడు చందు. ‘మా అమ్మ వాళ్ళ మాటలు విని అబద్ధాలు చెప్పాను. కానీ నిన్ను మోసం చేయాలని కాదు’ అని వల్లి వివరిస్తుంది. భాగ్యాన్ని చూస్తూ ‘నీవల్లే నాకు ఈ పరిస్థితి. వద్దు వద్దు అని చెబుతున్నా నువ్వే ఇదంతా చేశావు. నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను అని చెప్పావు. నా కాపురం కూలిపోతుంటే నువ్వు చూస్తున్నావే తప్ప ఏం చేయలేదు’ అంటూ ఏడుస్తుంది వల్లి. ఆ తర్వాత చందుతో మీరు ఇప్పుడు నన్ను కాపాడి ఉండొచ్చు కానీ మీరందరూ వెళ్లిపోయాక నేను కచ్చితంగా ప్రాణాలు తీసుకుంటాను అంటూ బెదిరిస్తుంది. కనీసం అప్పుడైనా మా అమ్మ చెబితే నేను చేశాను తప్ప నాకు నేనుగా చేయలేదని నమ్మండి అంటూ ఏడుస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

