MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Latest Episode: వల్లి బండారం బయట పెట్టేందుకు నర్మద ప్రయత్నాలు.. రాజపుష్పం చేతిలో చిక్కుకున్న ప్రేమ

Illu Illalu Pillalu Latest Episode: వల్లి బండారం బయట పెట్టేందుకు నర్మద ప్రయత్నాలు.. రాజపుష్పం చేతిలో చిక్కుకున్న ప్రేమ

Illu Illalu Pillalu Latest Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో నర్మద  వల్లి బండారాన్ని బయట పెట్టాలని ప్రయత్నిస్తుంది. ఇక ప్రేమ రాజపుష్పం నుంచి తప్పించుకునేందుకు ధీరజ్ కు ఫోన్ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 03 2026, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మెరుపుతీగ కోసం నర్మద వెతుకులాట
Image Credit : Jio hotstar

మెరుపుతీగ కోసం నర్మద వెతుకులాట

నర్మద తనపై పడిన నిందను ఎలాగైనా పోగొట్టుకోవాలని.. వల్లి అసలు స్వరూపాన్ని ఇంట్లో నిరూపించాలని చాలా ప్రయత్నం చేస్తుంది. వల్లికి అబార్షన్ చేశానని చెబుతున్న డాక్టర్ని కలుసుకోవడానికి వెళుతుంది. అయితే హాస్పిటల్ కు వెళ్ళిన నర్మదకు అక్కడ మెరుపుతీగ అనే డాక్టర్ కనిపించదు. వేరే డాక్టర్ ను మెరుపుతీగ అనే డాక్టర్ గురించి అడిగితే ఆ పేరుతో ఉన్నవారు ఎవరు లేరని చెబుతారు. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది నర్మద. అయితే ఆ మెరుపుతీగ ఎవరో ఎలాగోలా పట్టుకోవాలని అనుకుంటుంది. అయితే నర్మద ఆసుపత్రి నుంచి బయటికి వస్తున్నప్పుడు అదే ఆసుపత్రిలో ఆ మెరుపుతీగ ఫ్లోర్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. కానీ నర్మద మాత్రం చూసుకోదు అక్కడ నుంచి ఆవేశంగా బయటికి వచ్చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ధీరజ్ కోపం
Image Credit : Chat gpt

ధీరజ్ కోపం

ఇక ఇక్కడి నుంచి సీన్.. ధీరజ్ దగ్గరికి మారుతుంది. రాత్రి అయినా సరే ప్రేమ ఇంటికి రాకపోవడంతో చాలా కంగారుపడుతూ ఉంటాడు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇటూ అటూ తిరుగుతూ ఉంటాడు. డాన్స్ క్లాస్ కి వెళ్లిన ప్రేమకు తన మాటంటే లెక్క లేదని చాలా కోపంగా ఉంటాడు. అదే సమయానికి నర్మద అక్కడికి వస్తుంది. ధీరజ్ ‘ప్రేమకు కొంచమైనా బుద్ధి ఉందా.. కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ..ఇప్పటివరకు ఇంటికి రాలేదు’ అని అంటాడు. అప్పుడు నర్మద ప్రేమ ఎక్కడికి వెళ్లిందని అడుగుతుంది. జరిగిందంతా చెబుతాడు ధీరజ్. డాన్స్ క్లాస్ కు తాను వద్దని చెప్పినా కూడా ప్రేమ ఎందుకు వెళ్ళింది అనుకుంటుంది నర్మద. ఈ లోపు రామరాజు వస్తాడు. ప్రేమ ఇంకా ఇంటికి రాలేదా? ఆ ఇద్దరు ఆడపిల్లలు అక్కడికి వెళ్లి ఏమి ఇబ్బంది పడుతున్నారో.. వెళ్లి కనుక్కో.. అని ధీరజ్ కి చెప్తాడు. దానికి ధీరజ్ నేను హాస్పిటల్ కి వెళ్తాను నాన్నా అంటాడు.

33
రాజపుష్ఫాన్ని చితక్కొట్టిన ధీరజ్
Image Credit : Chat gpt

రాజపుష్ఫాన్ని చితక్కొట్టిన ధీరజ్

ఇక్కడ నుంచి సీన్.. రాజపుష్పం దగ్గరికి మారుతుంది. ప్రేమను ఎలాగైనా సొంతం చేసుకోవాలని రాజపుష్పం ప్రయత్నిస్తూ ఉంటాడు. కరెంటు కూడా కట్ చేస్తాడు. గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్న ప్రేమ చీకట్లోనే ఉంటుంది. కరెంటు పోయిందనుకొని బయటకు వచ్చి ఫోన్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈలోపు రాజపుష్పం ప్రేమను పట్టుకుంటాడు. మళ్ళీ ప్రేమ బలవంతంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. రాజపుష్ఫం తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. ప్రేమ తనతో పాటు ఫోను కూడా ఈసారి గదిలోకి తీసుకెళ్తుంది. ధీరజ్ కు ఫోన్ చేసి తాను ఎక్కడున్నానో.. జరిగిందంతా చెబుతుంది. ధీరజ్ లోకేషన్ పెట్టమని చెప్పడంతో ప్రేమ అలాగే చేస్తుంది. ధీరజ్ ప్రేమ చెప్పిన లొకేషన్ కు వస్తాడు. రాజపుష్పం ప్రేమని ఇబ్బంది పెడుతూ ఉంటే వెంటపడి వెంటపడి చితక్కొడతాడు. అలా ప్రేమను కాపాడుతాడు. అప్పటివరకు భయంతో ఉన్న ప్రేమ.. ధీరజ్ ను చూడగానే సంతోషంగా ఉంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan House: స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టుతో రామ్ చరణ్ లగ్జరీ ఇల్లు.. ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Recommended image2
KTR: చాలా ఏళ్ల త‌ర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నా.. వైర‌ల్ అవుతోన్న కేటీఆర్ ట్వీట్
Recommended image3
Same Concept Movies: ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని సినిమాలు.. నేచురల్‌ స్టార్‌ రికార్డు సృష్టిస్తాడా?
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: వల్లి తాట తీసేందుకు సిద్ధమైన నర్మద.. అన్ని నిజాలు చెప్పేసిన డాక్టర్
Recommended image2
Branded clothes: కోట్ల విలువైన కొత్త బ్రాండెడ్ దుస్తులను ఇక్కడ చెత్తలా పడేస్తున్నారు.. ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved