MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Epiosde: వల్లి గురించి నిజం మొత్తం కక్కేసిన నకిలీ డాక్టర్.. చెంప పగలగొట్టిన వేదవతి

Illu Illalu Pillalu Today Epiosde: వల్లి గురించి నిజం మొత్తం కక్కేసిన నకిలీ డాక్టర్.. చెంప పగలగొట్టిన వేదవతి

Illu Illalu Pillalu Today Epiosde: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి బాగోతం అంతా బయట పెట్టేస్తుంది నకిలీ డాక్టర్ మెరుపుతీగ. ఇక వేదవాతి వల్లి పని పట్టేందుకు సిద్ధమవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఇంకేం జరిగిందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 06 2026, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నర్మద మాస్టర్ ప్లాన్
Image Credit : Jio hotstar

నర్మద మాస్టర్ ప్లాన్

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమ, ధీరజ్ ఇంటికి వస్తారు. నర్మదా చాలా కోపంగా ప్రేమను చూస్తూ ఉంటుంది. ప్రేమ నర్మదతో దయచేసి అలా చూడకు, ఇప్పటికే ధీరజ్ కొట్టాడు, తిట్టాడు. కాలికి దెబ్బ కూడా తగిలింది. ఇక నేను ఈ బాధను భరించలేను అని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు చేసింది మంచి పనే కానీ ఇలా జీవితాన్ని రిస్క్ లో పెట్టకునే పనులు ఇంకెప్పుడు చేయకు అంటుంది నర్మద. ప్రేమ సరేనని అంటుంది. ప్రేమ.. వల్లి ప్రెగ్నెన్సీ గురించి అడుగుతుంది. అప్పుడు నర్మద మొత్తం విషయం చెప్పేస్తుంది. డాక్టరు నిజం చెప్పడానికి ఇంటికి రమ్మంటే భయపడుతోంది. ఇప్పుడు ఆ ఫేక్ డాక్టర్ మెరుపుతీగను లైన్లో పెట్టాలి అని అంటుంది నర్మద. మరి డాక్టర్ ని పట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తారు ప్రేమ, నర్మద ధీరజ్. ముగ్గురు ఇంట్లోకి వచ్చి తమ ప్లాన్ మొదలుపెడతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వల్లి ప్రెగ్నెంట్ కాదని చెప్పేసిన సుకన్య
Image Credit : Jiohotstar

వల్లి ప్రెగ్నెంట్ కాదని చెప్పేసిన సుకన్య

ఆ సమయానికి వేదవతి ప్రేమతో వల్లికి జ్యూస్ తీసి ఇస్తుంది ప్రేమ తనక్కూడా ఇవ్వమని అడుగుతుంది. వేదవతి జ్యూస్ తీసి ప్రేమకు ఇస్తుంది. ఎవరికీ తెలియకుండా ధీరజ్ ఆ జ్యూస్ లో వాంతులు అయ్యే మందులు కలుపుతాడు. నర్మద ఆ జ్యూస్ తీసుకెళ్లి ప్రేమగా సుకన్యకు ఇస్తుంది. సుకన్య జ్యూస్ తాగి వాంతులు చేసుకుంటుంది. ధీరజ్ డాక్టర్ కు రమ్మని ఫోన్ చేస్తాడు. ఇంటికి డాక్టర్ రాగానే ఆమెను చూసి మళ్లీ సుకన్య, వల్లి షాక్ అవుతారు. ఎందుకంటే వచ్చింది ఫేక్ డాక్టర్ మెరుపుతీగ. ఆమెనే వల్లికి అబార్షన్ చేశానని అబద్ధం చెప్పింది. మెరుపుతీగ సుకన్యను చెక్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని చెబుతుంది. దాంతో ఒక్కసారిగా సుకన్య షాక్ అయ్యి ‘నేను ప్రెగ్నెంట్ ఏంటి? ఇది అసలు డాక్టరే కాదు’ అంటూ అసలు నిజాన్ని చెప్పేస్తుంది. అలాగే వల్లి అసలు ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని కూడా అందరికీ తెలిసేలా చేస్తుంది. దీంతో వేదవతితో పాటు అందరూ షాక్ అవుతారు.

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode: వల్లి తాట తీసేందుకు సిద్ధమైన నర్మద.. అన్ని నిజాలు చెప్పేసిన డాక్టర్
Related image2
Illu Illalu Pillalu Latest Episode: వల్లి బండారం బయట పెట్టేందుకు నర్మద ప్రయత్నాలు.. రాజపుష్పం చేతిలో చిక్కుకున్న ప్రేమ
33
వల్లి చెంప పగలగొట్టిన వేదవతి
Image Credit : Jio hotstar

వల్లి చెంప పగలగొట్టిన వేదవతి

సుకన్య చెప్పినదంతా అప్పుడే వచ్చిన చందు కూడా వినేస్తాడు. వేదవతికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ‘ఏంటీ? వల్లి ప్రెగ్నెంట్ కాదా? అసలు ఏమైంది’ అని అడుగుతుంది. వల్లిని మీ ఇంట్లోకి తీసుకొచ్చేందుకు వాళ్ళ అమ్మ ఆడిన నాటకం అని చెప్పేస్తుంది సుకన్య. కానీ వల్లి మధ్యలో వచ్చి ‘ఇది ఏదో వాగుతోంది పట్టించుకోకండి అత్తయ్య. నర్మదే అంతా చేసింది’ అని చెబుతుంది. చందు కోపంతో వల్లిని చేయి ఎత్తుతాడు. నీలాంటిది నా భార్య అని చెప్పుకోవడానికే కంపరంగా ఉంది అంటాడు చందు. ఈలోపు వేదవతి కోపంతో వల్లి చెంప పగలగొడుతుంది. ‘నువ్వు ఎలాంటి దానివో తెలిసినా.. ప్రెగ్నెంట్ అని ఇంట్లోకి రానిచ్చాను. నా కూతురుని వేరే ఇంటికి కోడలుగా బలవంతంగా పంపించినా కూడా నీ జీవితం కాపాడాలని ఇంట్లోకి రానిస్తే ఎంత మోసం చేస్తావా? నువ్వు మనిషివేనా’ అంటూ చెడా మడా తిడుతుంది. రామరాజు గురించి తలచుకొని చాలా బాధపడుతుంది. నువ్వు మంచి కోడలివని తెలిసి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది అంటూ బాధపడిపోతుంది వేదవతి. ఇక్కడి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: వల్లి తాట తీసేందుకు సిద్ధమైన నర్మద.. అన్ని నిజాలు చెప్పేసిన డాక్టర్
Recommended image2
Illu Illalu Pillalu Latest Episode: వల్లి బండారం బయట పెట్టేందుకు నర్మద ప్రయత్నాలు.. రాజపుష్పం చేతిలో చిక్కుకున్న ప్రేమ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved