- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: ఖుషి జీవితం కోసం పెళ్లికి సిద్ధమైన యష్, వేద.. త్వరలోనే బ్యాండ్ బాజా!
Ennenno Janmala Bandham: ఖుషి జీవితం కోసం పెళ్లికి సిద్ధమైన యష్, వేద.. త్వరలోనే బ్యాండ్ బాజా!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ సీరియల్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం.

యష్ (Yash) ఖుషి గురించి ఆలోచిస్తూ తనకు మంచి నాన్నగా ఉండాలని నిశ్చయించుకుంటాడు. ఇక వెంటనే వేదకు మెసేజ్ చేస్తాడు. తనను రేపు కలవమని అంటాడు. లేదా వేద కూడా ఖుషి (Khushi) గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే యష్ నుంచి మెసేజ్ రావటంతో తాను కూడా ఓకే అంటుంది.
ఇక మొత్తానికి ఇద్దరూ ఒకచోట కలుస్తారు. ఇక వేద (Vedha) తన మనసులో ఏదో ముఖ్యమైన విషయం ఉందనే త్వరగా వచ్చాడని అనుకుంటుంది. యష్ వేద వైపు చూస్తూ తనను అర్థం చేసుకోవాలని అనుకుంటాడు. ఇక ఖుషి (Khushi) పరిస్థితి ఇతనికి అర్థం కావాలని వేద కూడా అనుకుంటుంది.
ఇక ఇద్దరు ఖుషి (Khushi) గురించి మాట్లాడుకుంటారు. వేద తనకు ఖుషి ఫోన్ చేసిందని అక్కడ ఉండనని అంటుందని చెబుతుంది. యష్ కూడా అవును అక్కడ ఎలా ఉంటుందని అంటాడు. వెంటనే వేద ఖుషి నీ దగ్గర ఉన్నంత కాలం ఏం చేసావు అని ప్రశ్నించడంతో.. యష్ (Yash) కాస్త ఎమోషనల్ అవుతాడు.
ప్రేమించిన భార్య కాదని వెళ్ళిపోయినప్పుడు అదే ఆలోచనలో ఉన్నానని.. అప్పుడు చాలా బాధ పడ్డానని తనతో చెప్పుకుంటాడు. తాను బాధ పెట్టిన ఆ సమయంలో తనకు పసిపాప కనపడలేదని.. గెలవాలన్న లక్ష్యం తప్ప మరి ఏమి కనబడలేదని కానీ నువ్వు వచ్చాక ఖుషి ఏం కావాలో ఇప్పుడు అర్థం అవుతుందని వేదతో (Vedha) అంటాడు.
అది తెలుసుకోవటానికి ఇంత సమయం పట్టిందని.. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని బాధపడతాడు. ఇక తనకు ఖుషి (Khushi) యే కావాలి అంటూ.. దానికి నువ్వే ముఖ్యం అంటూ వేదను అడుగుతాడు. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకోమని అడగటంతో దానికి వేద (Vedha) కూడా ఒప్పుకుంటుంది.
ఇదంతా ఖుషి (Khushi) కోసమే అని ఇద్దరు నిశ్చయించుకుంటారు. వారి మాటలు విన్న వసంత్ సంతోషంగా ఫీల్ అవుతాడు. చిత్ర కి (Chitra) కూడా చెప్పడంతో తను కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది. మరోవైపు ఖుషి కూడా ఫ్యామిలీ పెయింట్ వేసి సంతోషంగా ఫీల్ అవుతుంది.