- Home
- Entertainment
- Guppedantha Manasu: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న జగతి.. వసుని హెడ్ గా నియమించిన రిషి?
Guppedantha Manasu: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న జగతి.. వసుని హెడ్ గా నియమించిన రిషి?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు కలిసి పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు వసుధార మెనూ మొత్తం చెబుతూ ఉండగా వెంటనే రిషి వసుధార నేను ఈ పూటకు మాత్రమే తినాలి అనుకున్నాను నువ్వు ఈ పూటకి రేపు పొద్దున్నే కూడా తినిపించేలా ఉన్నావు అని అంటాడు. అప్పుడు వసుధార సరే సార్ అని చెప్పి ఈ పానీ పూరి తింటూ ఉంటారు. అప్పుడు రిషికి పానీ పూరి తినడం రాకపోయేసరికి అలా కాదు ఇలా తినాలి అని నేర్పిస్తూ ఉంటుంది వసుధార. అప్పుడు సరదాగా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ పానీపూరి తింటూ ఉంటారు.
ఇంతలోనే పానీ పూరి బండి అతను మీ పెళ్లెప్పుడు సార్ అని అనడంతో వసుధార, రిషి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి ఏంటి ఒకేసారి అలా అడిగావు అని అడగగా వెంటనే ఆ పని పూరి బండి అతను ఏమీ లేదు సార్ ఏ గొడవలు లేకుండా ఇంత సంతోషంగా ఉన్నారు అంటే కాబోయే జంట అని తెలిసిపోతుంది సార్ అని అంటాడు. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటే సిగ్గుపడుతూ ఉంటారు. తర్వాత రిషి పానీపూరి బండి అతను అన్న మాటలు చిరునవ్వుతో వదిలేయకూడదు మన పెళ్లి గురించి మనం ఆలోచించాలి అని అంటాడు.
పెద్దమ్మతో నేను మాట్లాడతాను అని అనగా వసుధార ఆలోచనలో పడుతుంది. అప్పుడు రిషి వసు చేతులు పట్టుకొని నువ్వు మీ ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరీ పెళ్లి పీటల పై నుంచి చదువుకోడానికి వచ్చేసావు నీ ధైర్యం నాకు నచ్చింది మన పెళ్లి విషయంలో మీ ఇంట్లో వాళ్ళను ఒప్పిస్తావని నాకు నమ్మకం ఉంది అని అంటాడు అంటాడు రిషి. అప్పుడు మీ ఇంట్లో వారు మన పెళ్ళికి ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అనడంతో వసుధార తన ఫ్యామిలీ గురించి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తన గతం మొత్తం చెప్పుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది వసుధార.
చిన్నప్పుడు నేను అవార్డు గెలిచి చూపిస్తే దాని నేలకేసి కొట్టారు. బహుమతిని నేలకేసి కొట్టారు కానీ నా జీవితాన్ని కొట్టలేదు కదా అనుకుని బాధపడుతూ ఉండగా అప్పుడు రిషి వసుధార కన్నీళ్లు తుడుచుకోవడానికి కర్చీప్ ఇస్తాడు. తీసుకోకపోవడంతో వెంటనే రిషి తన చేతులతో వసుధార కన్నీళ్లు తుడుస్తాడు. అప్పుడు రిషి నువ్వు అందించిన అందమైన జ్ఞాపకాలకు ఎప్పటికీ మరకలు అంట నివ్వను అని అనడంతో వెంటనే వసుధార రిషి ని హత్తుకుంటుంది. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. మీ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ విషయం గురించి ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఇటువంటి సమయంలో జగతి మేడం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు హెడ్ గా కొనసాగడం లేదని మెయిల్ చేశారు అనడంతో రిషి వసుధారలు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తన స్థానంలో ప్రతి మేడంకి బదులుగా వసుధారని తీసుకోమని సలహా ఇచ్చారు అనడంతో వసుధార ఆశ్చర్య పోతుంది. జగతి మేడంకి ఆరోగ్యం బాగోలేక తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు మనం దానికి ఏం చేయలేము కదా రిషి అని అంటాడు మినిస్టర్. మరొకవైపు జగతి కాలేజీ స్టాప్ తో మాట్లాడుతూ ఇకమీదట మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ విషయం వసుధారే చూసుకుంటుంది అని అంటుంది.
ఆ తర్వాత వసుధార మినిస్టర్ తో మాట్లాడుతూ సార్ నేను ఇంత పెద్ద బాధ్యత మోయలేను అని అనగా బరువు బాధ్యతలు ఇప్పటినుంచే అలవాటు చేసుకోవాలి అనే మినిస్టర్ అనడంతో వెంటనే రిషి నువ్వే మాట్లాడొద్దు వసుధార అని చెప్పి సార్ వసుధర ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా ఉంటుంది అని అంటాడు. ఆ మాటకు మినిస్టర్ కూడా సంతోష పడుతూ ఉంటాడు. మరొకవైపు కాలేజ్ స్టాఫ్ మేడం వసుధార ఈ ప్రాజెక్టుకి హెడ్ అయితే మేము తన కింద పని చేయాలా అని అంటారు. ఆ తర్వాత జగతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. మేడం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా ఉండడానికి రిషి సార్ కూడా ఒప్పుకున్నారు అని అనడంతో జగతి సంతోషపడుతూ వసుధారకి ధైర్యం చెబుతూ ఉంటుంది.
అప్పుడు వసుధార మేడం నేను ఈ ప్రాజెక్టుకి హెడ్గా డీల్ చేయగలను లేదో కొంచెం టెన్షన్ గా ఉంది అనడంతో ఏం కాదు అని జగతి ధైర్యం చెబుతూ ఉంటారు. ఆ తర్వాత రిషి మెసేజ్ చేయడంతో వసుధార అక్కడికి వెళుతుంది. ఆ తరువాత వసుధార రిషి ప్రదేశానికి వెల్లగా అక్కడ రిషి లేకపోవడంతో ఎక్కడికి వెళ్లాడు అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే వచ్చి దొంగచాటుగా వచ్చి వసుదరచి లాక్కొని వెళ్లడంతో ఏంటి సార్ మీరు పిలవచ్చు కదా అసలే భయం లో ఉన్నాను మళ్ళీ మీరు ఇలా చేశారు అని అంటుంది. అప్పుడు రిషి వసుధార చేతులు పట్టుకొని ఏంటి వసుధార నువ్వు ఇలా భయపడుతున్నావు అని ధైర్యం చెబుతూ ఉంటాడు.