- Home
- Entertainment
- Guppedantha Manasu: అసలు నిజాన్ని బయటపెట్టిన జగతి.. కన్నీరు పెట్టుకుంటూ రిషిని నిలదీస్తానన్న వసుధార?
Guppedantha Manasu: అసలు నిజాన్ని బయటపెట్టిన జగతి.. కన్నీరు పెట్టుకుంటూ రిషిని నిలదీస్తానన్న వసుధార?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

వసుధార (Vasudhara) జగతి ప్రవర్తనలో వచ్చిన మార్పును గురించి మహేంద్ర తో చెప్పుకుంటూ భాధ పడుతుంది. ఇక మహేంద్ర ఈ విషయం గురించి మాట్లాడానికి రెస్టారెంట్ లో కలుద్దాం అని జగతికి ఫోన్ చేస్తాడు. కానీ జగతి (Jagathi) రావడానికి ఇష్టపడదు.
ఇక మహేంద్ర, వసుకు ఈ విషయం గురించి నువ్వేం దిగులు పడకు అని చెప్పి పంపిస్తాడు. మరో వైపు జగతి (Jagthi) దీనంగా ఆలోచిస్తూ ఉండగా మహేంద్ర (Mahendra) అక్కడకి వెళ్లి అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసిన జగతి చిరాకు పడుతూ విసిగించుకుంటుంది.
కానీ జరిగిన విషయం అసలు మహేంద్ర కు ఏ మాత్రం చెప్పదు. మరోవైపు వసుధార (Vasudhara) కోసం గౌతమ్ (Gautham) తాను పని చేసే రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ వసుని చూస్తూ మనసులో మురిసిపోతు వరుసగా ఆ అనందంలో 3 కాఫీ లు ఆర్డర్ చేస్తాడు.
ఈలోపు వసు గౌతమ్ ను చూస్తుంది. ఇక ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. తరువాత గౌతమ్ (Gautham) రెస్టారెంట్ లో కాఫి తాగుతూ సెల్ఫీ దిగి వాట్సప్ లో స్టేటస్ అప్ డేట్ చేస్తాడు.ఇక రిషి (Rishi) మరోవైపు వసధార జ్ఞాపకాలను తీపి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఊహల్లో ఉంటాడు.
తరువాత గౌతమ్ వాట్సప్ స్టేటస్ చూసి షాక్ అయ్యి గౌతమ్ (Gautham) కు కాల్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకొని కోపంగా కాల్ కట్ చేస్తాడు. తరువాత దేవయాని (Devayani) పాలు తెచ్చిన ధరణి పై కోపడుతుంది. రిషి, వసుధారల మధ్య ఏం జరుగుతుందో నువ్వు అసలు నాకు చెప్పడం లేదంటూ.. గట్టిగా అంటుంది.
ఇక ధరణి (Dharani) మౌనంగా ఉంటుంది. మరో వైపు గౌతమ్ వసుధార రెస్టారెంట్ వర్క్ అయ్యేంత వరకు ఉండి తన కారు లో తీసుకొని వెళ్ళాలి అనుకుంటాడు. కానీ వసు ఆటోలో వెళతాను అని చెబుతుంది. ఈలోపు అక్కడకు రిషి (Rishi) రావడంతో గౌతమ్ షాక్ అవుతాడు.
ఇక రిషి (Rishi) ని వసు సార్ కాఫి తాగుతారా అని అడుగుతుంది. కానీ రిషి గర్వంగా వద్దని చెబుతాడు. ఒకవైపు గౌతమ్ రిషి ఏమంటాడా.. అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక తరువాయి భాగంలో వసుధార జగతిని మీ ప్రవర్తనకి కారణం ఏమిటి అని అడిగేస్తుంది. ఆ తరువాత జగతి (Jagathi) రిషి తనను ఇంట్లోకి నుంచి బయటికి వెళ్లి పొమ్మన్నాడు అని హాస్టల్లో ఉండమన్నాడని అనడంతో వసు కంటనీరు పెట్టుకుంది.